For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : రోడ్డెక్కిన రఘురామ్ ఫ్యామిలీ.. చివరికి తప్పు ఒప్పుకున్న శిల్ప.. దెబ్బకు అందరూ ఎటాక్?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 666 వ ఎపిసోడ్ కి చేరింది. ఇప్పటికే శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని సీతా అలాగే రఘురాం సలహాతో మంచిగా మారుతుంది. మరోపక్క భరత్ అలాగే సిరి ఇద్దరూ కూడా భరత్ డిగ్రీ పూర్తి చేసే పనిలో పడ్డారు. మరోపక్క లక్ష్మణ్ కూడా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఇక అలా కుటుంబంలో అన్ని టెన్షన్లు క్లియర్ అయ్యాయి అనుకుంటున్న తరుణంలో మరో టెన్షన్ వచ్చి పడింది. రఘురాంకి అవసరం అయిన సమయంలో పాతిక లక్షలు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి మరీ షాక్ ఇచ్చాడు. తనకు వేరే వ్యాపారం మొదలు పెట్టే అవకాశం రావడంతో ఆ డబ్బు వెంటనే కట్టాలని అంటారు. రఘురామ్ ఇప్పటికిప్పుడు ఎలా ఇవ్వాలి అని అడుగుతూ ఉండగా ఇవన్నీ నాకు అనవసరం నా డబ్బు నాకు కావాలని తేల్చి చెప్పారు. అలా అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగానే తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది పరిశీలిద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  పాతిక లక్షల టెన్షన్

  పాతిక లక్షల టెన్షన్

  ఎట్టి పరిస్థితుల్లో పది రోజుల్లో పాతిక లక్షలు కట్టి వేయాలి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు అందరూ టెన్షన్ పడతారు. ఎలా అయినా కష్టపడి ఆ డబ్బులు తీర్చేయాలని భావిస్తూ ఉంటారు. ఈ పది రోజులు అవసరమైతే అన్నం, నిద్ర కూడా మానేసి డబ్బులు సంపాదించాలని అందరూ భావిస్తారు.. అలా ఎవరికి వారు తమ వంతు సహాయం చేయాలని అనుకుంటారు.

  అందరూ కష్టపడి

  అందరూ కష్టపడి

  అందరం కలిసి కష్టపడి ఈ సమస్య నుంచి గట్టెక్కాలని అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన తరువాత శిల్ప తన భర్త నానీతో నేను ఈ పాతిక లక్షల రూపాయలు ఇస్తాను అంటుంది. నువ్వెలా ఇస్తావ్ ? నువ్వు ఎక్కడ నుంచి ఇస్తావు? అని నాని ప్రశ్నిస్తాడు.. నేను మా నాన్నని అడిగి ఆ డబ్బులు తీసుకువచ్చి కడతాను అంటుంది. మీ ఇంటి నుంచి నాకు రూపాయి వద్దు రూపాయి వచ్చినప్పటినుంచి మీ అమ్మ ఇల్లరికం తీసుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడుతూ ఉంటుంది.

  ఎవరికి వారు ప్రయత్నిస్తూ

  ఎవరికి వారు ప్రయత్నిస్తూ

  నాకు అది మాట్లాడటం ఇష్టం లేదు అంటాడు నాని. అయితే అప్పుగా నే తీసుకుందామని మన దగ్గర ఉన్నప్పుడు తీర్చి వేయవచ్చు అని అంటుంది. అసలు ఈ విషయం గురించి మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతాడు నాని. ఎలా అయినా మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఇద్దాం కానీ అప్పులు విషయం గురించి ఆలోచించవద్దు అని క్లారిటీ ఇస్తాడు. ఇక లక్ష్మణ్ కూడా ఎలా అయినా ఈ విషయం నుంచి గట్టెక్కేలా చేయాలి అని భార్యతో అంటాడు. నువ్వు ఆఫీస్ కి వెళుతున్నావు అని నేను ట్యూషన్లు చెప్పడం కూడా మానేశాను. ఇప్పుడు నేను కూడా ట్యూషన్లు చెప్పడం మొదలు పెడతాను అని శైలు అంటుంది. అయితే ఎలా అయినా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తూ ఉన్న లక్ష్మణ్ ఆఫీస్ లో లోన్ తీసుకోవాలి అన్నా తన ఫైనాన్స్ మేనేజర్ తో తనకు పడడం లేదని లేకుంటే లోన్ ఖచ్చితంగా వచ్చేది అని చెబుతాడు.

  అందరూ కష్టపడి

  అందరూ కష్టపడి


  ఇక ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించే విషయంలో పడతారు. సీత రఘురాం షాప్ లో ఉండి అమ్మకాలు జరుపుతుంటే భరత్ ఇంటింటికీ తిరుగుతూ వాళ్ళకి కావలసిన సరుకులు ఆర్డర్ తీసుకుని షాప్ నుంచి డెలివరీ ఇచ్చి డబ్బు వెనకేసుకుంటూ ఉంటాడు. శైలు ఒక పక్క ట్యూషన్లు చెబుతూ బిజీ బిజీగా గడుపుతుంటే సిరి ఇంట్లో కావలసిన వారందరికీ వంట వండే పనిలో ఉంటుంది. నాని ఎప్పటిలాగే ఆఫీసుకు వెళుతుంటాడు అలాగే లక్ష్మణ్ కూడా ఆఫీస్ కి వెళుతుంటాడు. ఖాళీగా ఉన్నది తానే కాబట్టి తాను ఎలా అయినా ఈ కుటుంబం వారికి సహాయ పడాలి అని శిల్ప భావిస్తూ ఉంటుంది. ఇక ఎవరికి వారు ప్రతిరోజూ వచ్చిన ఆదాయం తీసుకెళ్లి సీతకు అప్ప చెబుతారు సీత ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో ఆ బ్యాగ్ ని అమ్మ వారి కాళ్ల దగ్గర పెడుతుంది.

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఒప్పుకున్న శిల్ప

  ఒప్పుకున్న శిల్ప

  ఇక శిల్ప ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతూ తన వల్ల జరిగిన ఈ నష్టాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అమ్మవారిని కోరుతూ ఉంటుంది. ఇక రఘురాం కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మ వారిని ఇదే విషయం మొక్కుకుంటారు. వీలైనంత త్వరగా ఈ ఇబ్బందులు అన్ని గట్టెక్కితే మాకు అంతే చాలు అని వారు కూడా కోరుకున్నారు. ఇక అలా ఈరోజు జరుగుతున్న ఎపిసోడ్ ని ముగించారు. ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం రఘురాం అప్పుల వాళ్ళ కి డబ్బులు కట్టాల్సిన డేట్ రానే వచ్చింది. అయితే తాను ఒక పది లక్షల రూపాయలు వేరేచోట అప్పు చేశాను అని మరో పదిహేను లక్షల రూపాయలు కనుక మనం కూడపెట్టి ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయట పడతామని రఘురాం అంటాడు.. దీంతో అసలు తాము సంపాదించిన డబ్బు ఎంత ఉంది అని లెక్క పెట్టే పనిలో పడతారు. అయితే శిల్ప ఏదో ఒప్పుకున్నట్లు గా చూపిస్తూ ఉండటంతో తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే లా కనిపిస్తుంది.

  English summary
  Vadinamma Episode 666: The family members decide to tackle the financial crisis on Sita's advice. Later, they contribute their earnings to Sita and Raghuram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X