twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : ఎవరూ ఊహించని విధంగా మారిన శిల్ప.. అప్పు కోసం పచ్చళ్ళు పెట్టి అమ్ముతూ?

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 667వ ఎపిసోడ్ కి చేరింది. ఇప్పటికే శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మంచిగా మారుతుంది. కుటుంబంలో అన్ని టెన్షన్లు క్లియర్ అయ్యాయి అనుకుంటున్న తరుణంలో మరో టెన్షన్ వచ్చి పడింది. రఘురాంకి అవసరం అయిన సమయంలో పాతిక లక్షలు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి మరీ షాక్ ఇచ్చాడు. తనకు వేరే వ్యాపారం మొదలు పెట్టే అవకాశం రావడంతో ఆ డబ్బు వెంటనే కట్టాలని అంటారు.

    రఘురామ్ ఇప్పటికిప్పుడు ఎలా ఇవ్వాలి అని అడుగుతూ ఉండగా ఇవన్నీ నాకు అనవసరం నా డబ్బు నాకు కావాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆ డబ్బు ఎలా అయినా సర్దాలని రఘురాం మొదలు సిరి దాకా అందరూ ఏదో ఒక పని చేస్తూ ఆ డబ్బు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చూపారు. అలా అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది పరిశీలిద్దాం.

    Photos Courtesy: Star MAA and Disney+Hotstar

    నీ గిరాకీ బాధ్యత నాది

    నీ గిరాకీ బాధ్యత నాది

    ఇక ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న రఘురాం కుటుంబం ఎలా అయినా డబ్బులు కూడా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. లక్కీ ఆఫీస్ కు కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఇంటి ప్లాన్ ఒకటి గీస్తూ ఉండడం తో ఇదేంటి అని అడుగుతుంది శైలు. అయితే ఆఫీస్ పని తో పాటు తాను పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నానని బయట వాళ్లకు ఇంటి ప్లాన్ కావాలంటే గీసి పెడుతున్నానని లక్ష్మణ్ అంటాడు. దీంతో శైలు ఆనంద పడుతూ తన ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు తను ఇలా హౌస్ ప్లాన్లు కావాలని అడిగారు అని నీకు గిరాకి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని అంటుంది.

    ఇంకేం కావాలి

    ఇంకేం కావాలి

    అలాగే వీరిద్దరి మధ్య సరదా సంభాషణ సాగుతున్న నేపథ్యంలో రఘురాం తన భార్య సీతను వ్యాన్ ఎక్కించుకుని సరుకులు డెలివరీ చేయడం కోసం బయటికి వెళ్ళాడు. అందరూ తమ తమ కార్లలో భార్యలను బయటకు సరదాగా తిప్పుతూ ఉంటే నేను మాత్రం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని ఇలా ఒక సరుకులు డెలివరీ సరుకులు డెలివరీ కోసం తీసుకువెళ్లడం తన బాధగా ఉంది అంటాడు. అయితే అందుకు సీత ఒప్పుకోదు మనిద్దరం కలిసి ఉంటే అంతే చాలు అంటుంది. నువ్వు ఎప్పుడూ నన్ను ఏమీ ఊరుకోవు ఎందుకు అని రఘురాం ప్రశ్నించగా నేను ఏమీ కోరుకోకుండానే నాకు అన్నీ తెచ్చి ఇచ్చే భర్త దొరికాడు ఇంకేం కావాలి అని అని ప్రశ్నిస్తుంది.

    ప్రయత్నాలు మానుకో

    ప్రయత్నాలు మానుకో

    ఇక అలా సరుకులు డెలివరీ చేస్తూ వెళ్తున్న క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. అయితే మరోపక్క దమయంతి బాధపడుతూ ఉంటే చూడలేక భర్త నువ్వు ఇలా ఉండటం చూడలేక పోతున్నాను దయచేసి మామూలు మనిషిగా మారు, మన అమ్మాయి జీవితం బాగుపడుతుంది అంటూ చెప్పబోతున్నాడు. అయితే మీరు ఏమి చెప్పాల్సిన అవసరం నాకు లేదు దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని దమయంతి అంటుంది. అయితే ఇంతలో కిషోర్ కల్పించుకుని ఆ రఘురాం కుటుంబం వలే అమ్మ ఎలా బాధపడుతోంది వాళ్ళని ఏదో ఒకటి చేస్తే కానీ మా అమ్మకు ఆనందం ఉండదు అంటాడు. దమయంతి భర్త కొడుకు మీద కోప్పడి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సలహా ఇస్తాడు.

    పిల్లలను చూసుకుంటున్నావు కదా చాలు

    పిల్లలను చూసుకుంటున్నావు కదా చాలు

    మరో పక్క శైలు ట్యూషన్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. వారి ట్యూషన్ కి కొత్త కొత్త పిల్లలు కూడా వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి అడ్వాన్స్ ఇచ్చి మరీ శైలు కోసం పిల్లల్ని ఇంట్లో వదిలి వెళుతూ ఉంటారు. ఇక ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అనే డబ్బులు తీసుకువచ్చి సీతకు ఇస్తూ ఉంటారు. అయితే ఇదంతా చూసి శిల్ప మాత్రం బాధపడుతూ ఉంటుంది. తాను ఏమీ చేయలేక పోతున్నాను అని బాధ పడుతున్న నేపథ్యంలో ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో పిల్లలను చూసుకుంటున్నావు కదా చాలు అని వాళ్ళు అంటే లేదు నేను కూడా ఏదో ఒకటి చేసి కుటుంబానికి అండగా నిలబడాలి అని అంటుంది.

    అప్పు వద్దు

    అప్పు వద్దు

    ఇదే సమయంలో సీత ఒక ఆలోచన చేసి సరే నీకు పచ్చళ్ళు ఎలా పెట్టాలో నేర్పిస్తాను అవి పెడితే మనం వాటినమ్మితే డబ్బులు సంపాదించవచ్చు అంటుంది. దానికి శిల్ప కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది ఇది ఇలా జరుగుతూ ఉన్న నేపథ్యంలో రఘురాం ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బులు చేతికి ఇచ్చి ఇప్పటివరకు ఎంత డబ్బు జమ అయ్యాయి అని ఒకసారి చూద్దాం అని అంటాడు. దానికి బావ నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు ఎప్పటికప్పుడు డబ్బులు లెక్క వేసుకుంటే ఇంకా పని మీద దృష్టి పెడతాము? మనకు గడువు దగ్గర పడుతున్న సమయంలో అప్పుడు డబ్బులు లెక్క వేద్దాం ప్రస్తుతం పని మీద దృష్టి పెడదామని సీత అంటుంది. అయితే శిల్ప తండ్రి దగ్గర అప్పు తీసుకుని వచ్చి పాతిక లక్షలు ఇస్తానని అంటుంది. అయితే దానికి రఘురాం ఒప్పుకోడు. ఇక కమింగ్ అప్ లో ఎంత డబ్బు జమయ్యాయి అనే విషయం మీద చర్చలు జరుగుతున్నట్లు చూపించారు.

    English summary
    Vadinamma Episode 667: Sita and Raghuram toil hard to clear the debt. Later, a guilt-ridden Shilpa apologises to them and offers help.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X