For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : దమయంతి ప్లాన్ సక్సెస్.. మళ్ళీ వీధుల్లోకి రఘురామ్ అండ్ కో.. ఏమైందంటే?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 643వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న శిల్ప తాజాగా ప్లాస్టిక్ బియ్యం వ్యవహారంతో పెద్ద రచ్చ లేపాలని ప్రయత్నించింది. అయితే రఘురామ్ కుటుంబ సభ్యులు శిల్ప ఊహించినంత సీరియస్ అవ్వలేదు. దీంతో మళ్లీ ఎలా గొడవలు పెట్టాలని శిల్ప ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఏం జరిగింది అనే విషయాలు ఫోన్లో తన తల్లికి చెబుతూ ఉంటుంది. ఇలా గొడవ పెట్టాను కానీ అదేమీ వర్కవుట్ అవ్వలేదు అని చెబుతూ ఉంటుంది, అలాగే నువ్వు పంపిన ప్లాస్టిక్ బియ్యం వ్యక్తిని ఎక్కడా కనబడదు అని చెప్పు అతను కనపడితే కనుక మా వాళ్ళు దుమ్ముదులపడం ఖాయం అని చెబుతూ ఉండగా సీత ఎంట్రీ ఇస్తుంది. ఏంటి ఎవరితోనో ప్లాస్టిక్ బియ్యం అంటున్నావు అని అడగడంతో, మొత్తం విన్నదో లేదో అనే ఉద్దేశంతో తన తల్లి కి ఫోన్ చేసిన విషయం చెబుతుంది.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   శిల్ప దొరికేసిందా

  శిల్ప దొరికేసిందా

  నీకు ఇంకా పూర్తిగా విషయాలు తెలియదు కాబట్టి చెబుతున్నా ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు ఇంటికి ఫోన్ చేసి తల్లికి చెప్పడం కరెక్ట్ కాదు, అత్తారింటికి పుట్టింటికి మధ్య కొన్ని రకాల పట్టింపులు అనేవి ఉంటాయి. ఈ విషయం మీకు తెలియదు కదా అందుకే నేను చెబుతున్నాను అని సీత అంటుంది.. అంటే అతను మా బంధువుల వ్యక్తి అని చెప్పాడు కదా మా అమ్మకు ఏమైనా ఐడియా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రయత్నం చేస్తున్నామని శిల్ప అంటుంది. అంతేకాక నేనేం చేసినా చివరికి నేనే నిందలు మోయాల్సి వస్తుందని బహుశా నేను వరలక్ష్మీ వ్రతం సరిగ్గా చేయలేదేమో అంటుంది. దీంతో సీత కల్పించుకుని నువ్వు అలా బాధపడవద్దు నేనే పొరపాటు పడ్డాను అలాంటిదేమీ లేదు అని శిల్పకు ధైర్యం చెబుతుంది.

   మళ్ళీ ఫీలయిన భరత్

  మళ్ళీ ఫీలయిన భరత్

  ఇక మరో పక్క రఘురాం షాప్ కి కొత్తగా కాలేజీ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఫోన్ లో వివరంగా విన్న రఘురాం వెంటనే భరత్ ను అక్కడికి వెళ్లాల్సిందిగా కోరుతున్నా మళ్లీ వెంటనే అలర్ట్ అయ్యి, వద్దు లక్ష్మణ్ నువ్వే అక్కడికి వెళ్ళమని చెబుతాడు. దీంతో బాధ పడిన భరత్ ఎందుకు నేను వెళ్ళకూడదు అని ప్రశ్నిస్తాడు, అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే మళ్ళీ కొత్తగా తల నొప్పులు వస్తాయి వాళ్ళు ఏదో అడిగితే నువ్వు ఏదో ఇవ్వటం ఇదంతా వద్దు లక్ష్మణ్ అయితే దానిని మేనేజ్ చేసుకుని వస్తాడు అని అంటాడు. అన్న మాటలకు బాధ పడిన భరత్ మళ్ళీ గదిలోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సిరి ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా విషయం అంత వివరంగా చెబుతాడు.

   నైట్ కాలేజ్ కు భరత్

  నైట్ కాలేజ్ కు భరత్


  దీంతో సిరి నువ్వు మళ్ళీ చదువుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు, నువ్వు ఆపేసిన చదువు పూర్తి చేయి నైట్ కాలేజీకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మునుపటిలాగా నువ్వు ఎవరితో మాటలు పడకుండా పని చేసుకోవచ్చు అని సలహా ఇస్తుంది. సరేనని కూడా తన భార్యకు మాటిస్తాడు. ఇక మరో పక్క ఎప్పటిలాగానే పార్వతి ఎలా డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తూ రఘురాం షాప్, బండి లీజుకు ఇచ్చిన వ్యక్తి గురించి దమయంతికి చెబుతోంది. నువ్వు గనక డబ్బులు ఇస్తే ఆ వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాను అని అంటుంది. ముందు పని అయిన తర్వాత డబ్బులు ఇస్తాను అని అనడంతో నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ మనిషి ఇంటికి పంపించాను ఆ మనిషికి కావలసింది ఇచ్చి ఈ పని చేయించుకొ అని అంటుంది.

   దమయంతి ప్లాన్ సక్సెస్

  దమయంతి ప్లాన్ సక్సెస్

  అందులో భాగంగానే దమయంతి ఇంటికి వచ్చిన వ్యక్తి డబ్బులకు ఆశపడి రఘురాం ని వాళ్ళ తమ్ముళ్ళను ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అవుతాడు.. అందులో భాగంగా తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు అనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు షాప్ ఖాళీ చేయాలని బండి కూడా తనకు వెంటనే ఇవ్వాలి అని అంటాడు. ముందు కాస్త టెన్షన్ పడిన రఘు తల్లి విషయం అనేసరికి అతని బండి అతనికి ఇచ్చేస్తాడు. షాపు కూడా మూడు నాలుగు రోజుల్లో ఖాళీ చేస్తాం అని చెబుతాడు.

  #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
  శిల్ప కు తలనొప్పి

  శిల్ప కు తలనొప్పి

  ఇక మరోపక్క శిల్ప గదిలో ఏసీ ఉండడంతో పిల్లలిద్దరినీ తీసుకు వెళ్లి అక్కడే పడుకోబెట్టి శిల్ప కు తలనొప్పి చెప్పిస్తూ ఉంటారు సిరి అలాగే శైలు. ఏసీలో హ్యాపీగా ఉన్నా అనుకుంటున్న శిల్ప కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. పిల్లల మోతతో ఆమె గదంతా మార్మోగిపోతూ ఉంటుంది. ఇది ఏంటి రా బాబు ఏసీలో రెస్ట్ తీసుకుందాం అని నేను పెట్టించుకుంటే ఇలా పిల్లలతో మోత అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మరో పక్క రాబోతున్న ఎపిసోడ్ లో కూడా శిల్ప మళ్లీ కొత్త ప్లాన్లు సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. సీత ఎక్కడ దొరుకుతుందా అని ఉద్దేశంతోనే ప్రస్తుతం పని చేస్తోంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Vadinamma Episode 644: Shilpa lands in a tight spot when Sita overhears her. Elsewhere, Dhamayanthi comes up with an evil plan against Raghuram and Sita.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X