Vadinamma Serial Sept 11 Episode: ఎరక్కపోయి ఇరుక్కున్న శిల్ప.. మళ్ళీ నానికి షాక్, దమయంతి ప్లాన్ ఇదా!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 645వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా భర్త కుటుంబంలో సమస్యలు ఏర్పడేలా చేసి తన భర్తను ఇల్లరికం తీసుకువెళ్లాలని శిల్ప అనేక ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా ముందుకు తల్లి సపోర్టుతో ప్లాస్టిక్ బియ్యం వ్యవహారంతో తలనొప్పి తీసుకురాగా ఆ విషయం మీద కుటుంబ సభ్యులు పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఈ నేపథ్యంలోనే మరో ప్లాన్ సిద్ధం చేస్తుంది దమయంతి. పార్వతి అండతో రఘురాం ఫ్యామిలీకి ఆ బిజినెస్ కి అండగా నిలబడిన వ్యక్తిని కొనేసి రఘురాం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 పాపం శిల్ప

పాపం శిల్ప

బంపర్ ప్లాన్ వేసి తన గదిలో పెట్టించుకున్న శిల్పకు ఊహించని విధంగా షాకులు ఎదురవుతున్నాయి. ఒక పక్క సిరి మరో పక్క శైలు ఇద్దరూ కూడా ఏసీలో చల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో తమ తమ పిల్లలను శిల్పకు అప్పగించి వెళతారు. పైపెచ్చు నీకే అలవాటు అవుతుంది అని చెప్పి ఏసీలో చల్లగా ఉంది కదా వాళ్లు కూడా రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి వెళతారు.. వాళ్లు అలా వెళ్లారో లేదో పిల్లలు ఇద్దరూ కూడా బీభత్సంగా ఏడుస్తూ శిల్పను కల్పిస్తూ ఉంటారు. దీంతో ఎరక్కపోయి ఇరుక్కుపోయాను నా గదిలో ఏసీ ఎవరయినా ఎత్తుకుపోయిన బాగుండు అని శిల్ప తల బాదుకుంటూ ఉంటుంది. మరోపక్క రఘురాం ఉదయాన్నే షాప్ కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ్ బండి విషయం చెప్పి అది కొనడానికి ఏడు లక్షల రూపాయలు అవుతుందని కానీ ముందుగా 7000 రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే బండి మనకు హ్యాండోవర్ చేస్తారు అని చెబుతాడు.

మరో కొత్త సమస్య

మరో కొత్త సమస్య

అయితే కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియక పోవడంతో అసలు వారికి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించడంతో అప్పుడు రఘురాం జరిగిన విషయం అంతా చెబుతాడు. అతని తల్లికి సీరియస్ గా ఉండడంతో అప్పటికప్పుడు ఆ బండి అమ్మేసి ఆ డబ్బులతో ఆమెకు ఆపరేషన్ చేయించాలని చూస్తున్నాడని అతని తల్లికి ఆపద వస్తే మనకు వచ్చినట్టు కాదా అని ప్రశ్నిస్తాడు. అయితే కుటుంబ సభ్యులందరూ బాధపడుతుంటే బాధపడవద్దు అని చెబుతూ ఉంటాడు.

అమ్మవారి దగ్గరికి

అమ్మవారి దగ్గరికి

ఏదైనా మన మంచి కోసమే అని అనుకో మంటే అవును నిజమే కదా అతను తన బండి వెనక్కి తీసుకోవడం తో నే కదా మనం కొత్త బండి కొనుక్కోవాలి అనుకుంటున్నాము, తద్వారా అతను మన ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాడు అని మిగతా కుటుంబ సభ్యులు అనడంతో అందరిలో ఆనందం వ్యక్తం అవుతుంది. ఇంతలో రఘురాం తల్లి మాట్లాడుతూ నాని పెళ్లి జరిగిన వెంటనే అమ్మవారి దగ్గరికి వస్తానని మొక్కుకున్నామని నాని పెళ్లయి ఇన్ని రోజులు జరుగుతున్న అక్కడికి వెళ్ళ లేదు కాబట్టే ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని అంటుంది.

షాకిచ్చిన శిల్ప

షాకిచ్చిన శిల్ప

అయితే అక్కడికి వెళ్ళదాము నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు కార్లో వెళ్లాలంటే మరో 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని రఘురామ్ ఆలోచిస్తాడు. ఇంతలో భరత్ కారు ఎందుకు కొత్తగా తీసుకుంటున్న బండిలోనే వెళితే ఎలా ఉంటుంది అనే ఐడియా ఇస్తాడు. అందరూ వెంటనే ఎగిరి గంతేసి అలా వెళ్లడం చాలా సరదాగా ఉంటుందని అలాగే వెళదామని అంటారు. అయితే శిల్ప మాత్రం కాస్త ఇబ్బందికరంగానే మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే కుటుంబ సభ్యులు ఫీల్ అవుతాడేమో అనే ఉద్దేశంతో నేను కూడా వస్తా అని అంటుంది. కానీ లోపలికి వెళ్ళగానే భర్త తో తాను రాలేనని కావాలంటే మా అమ్మ తో ఒక కారు తీసుకురమ్మని చెబుతా అని అంటుంది. అలా అనడం కరెక్ట్ కాదని మనం కూడా వాళ్ళతో పాటే వెళ్లాలని అని అంటాడు. అయితే అది జరిగే పని కాదని ఆమె తేల్చి చెబుతోంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 దమయంతి అసలు ప్లాన్ ఇదా

దమయంతి అసలు ప్లాన్ ఇదా

మరోపక్క తల్లి చేస్తున్న పనులు ఏమీ అర్థం కాక కిషోర్ తల్లిని నిందిస్తాడు. నువ్వు చేస్తున్న పనులన్నీ నాకు ఏమీ అర్థం కావడం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నా కానీ చివరికి మనమే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటాడు. అయితే నీకు ఏమీ అర్థం కాదని నేను నెమ్మదిగా వాళ్ళని అప్పుల ఊబిలోకి దింపుతున్నానని ఒక్కసారిగా అప్పులన్నీ మీద పడితే అప్పుడు వాళ్ళకే విషయం అర్థం అవుతుందని తల్లి అంటుంది. ఇక మరో పక్క కొత్త వ్యాన్ తీసుకొస్తారు నాని కుటుంబ సభ్యులు. అందరూ బయలుదేరడానికి సిద్ధమవుతున్నా శిల్ప మాత్రం తాను రాలేనని తన ఆరోగ్యం బాలేదని తను అత్తగారికి తోడుగా ఉంటానని అంటుంది. మిగతా కుటుంబ సభ్యులకు ఆమె కావాలనే అలా చెబుతోందని బహుశా ఆ బండిలో రావడం ఇష్టం లేకపోతే ఉండొచ్చని అర్థమవుతుంది. వెంటనే నాని బండిలో కుర్చీలు పరుపులు ఏర్పాటు చేసి తన భార్యను పిలుచుకు రావడానికి వెళతాడు. అయితే నానికి మళ్ళీ శిల్పా షాకిస్తూ రాలేనేని చెప్పేస్తుంది, మరి ఏం జరగబోతోందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X