For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : భరత్ మీద కత్తి దాడి..రంగంలో జానకి కలగనలేదు రామ.. అసలు ఏమైందంటే?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ నేడు 650వ ఎపిసోడ్ కి చేరింది. అయితే ఈ కుటుంబంలో ఎలా అయినా గొడవలు పెట్టాలని చూస్తున్న శిల్ప తన తల్లి సహాయంతో ఒక పెను విధ్వంసానికి తెరలేపింది.. శిల్ప ప్లాన్ వర్కవుట్ కావడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎన్నో కోట్ల రూపాయల నష్ట పోయినప్పుడు కూడా మారు మాట్లాడకుండా అన్న చెప్పిన మాట విన్న తమ్ముళ్ళు ఈ విషయంలో మాత్రం పట్టు కోల్పోవడంతో కుటుంబం మధ్య చీలిక ఏర్పడింది. ఇక నిన్నటి కమింగ్ అప్ ప్రకారం భరత్, సిరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చూపించారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అనేక ఆసక్తికరమైన ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఆ ట్విస్ట్ లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   మరో టెన్షన్

  మరో టెన్షన్

  కుటుంబంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇక తమ ముఖం కుటుంబ సభ్యులకు చూపించలేము అనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోతారు. వాళ్ళిద్దరు బయటకు వెళ్లడంతో కుటుబ సభ్యులు అందరూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంటారు. రఘురాం సీత అయితే అసలు ఎందుకు వాళ్ళు అలా బయటకు వెళ్లిపోయారు అర్థం కాక తల బాధకుంటూ ఉంటారు. ఇంతలో శైలు మాట్లాడుతూ ఇంట్లో జరిగిన విషయాలకు బాధపడి బయటకు వెళ్లిపోయారు ఏమో అంటుంది. అయితే పెద్ద వాళ్ళం ఒక మాట అనకూడదా, ఎన్నో టెన్షన్ లో ఉండి పొరపాటున ఒక మాట అంటే దానిని అంత సీరియస్ గా తీసుకుని బయటకు వెళ్లి పోవాలి అని రఘురాం ప్రశ్నిస్తాడు. అంతేకాక వాళ్ళు తిరిగి వస్తారని ధైర్యం చెబుతూ ఉండగా సీత మాత్రం వాళ్లు తిరిగి ఇంటికి తీసుకు వచ్చే దాకా నాకు మనశ్శాంతి ఉండదని వాళ్లు నాతో మాట్లాడకపోతే మాట్లాడక పోయారు కానీ ఇంటికి వచ్చేదాకా నేను ప్రశాంతంగా ఉండ లేను అని అంటుంది.

   పార్వతి ఇంట్లో ఉన్నారా?

  పార్వతి ఇంట్లో ఉన్నారా?

  అయితే ఒకవేళ పార్వతి ఇంటికి వెళ్లి ఉంటారా అనే ఉద్దేశంతో పార్వతి ఇంటికి లక్ష్మణ్ శైలు వెళ్లి విషయం అడక్కుండా పరిస్థితి గమనించి రావాలనే ఉద్దేశానికి వస్తారు. అందులో భాగంగానే పార్వతి ఇంటికి వెళ్లి ఏదో పని మీద వెళుతూ ఆగామని మంచినీళ్లు ఇవ్వమని శైలు అడుగుతుంది. అయితే తన కాళ్ల నొప్పుల వల్ల తానే తాగలేక పోతున్నాను అని నువ్వే తీసుకురమ్మని శైలుకు చెబుతుంది పార్వతి. ఇంతలో లక్ష్మణ్ కూడా కూపీ లాగే ప్రయత్నం చేస్తాడు. ఇంట్లో ఎవరూ లేరు మావయ్య ఎక్కడికి వెళ్లారు? అంటే మా మామయ్య ఏదో పని మీద బయటకు వెళ్లాడు అని అంటుంది. దీంతో అక్కడికి సిరి భరత్ రాలేదనే నిర్ధారణకు వస్తారు. అయితే మరోపక్క సిరి, భరత్ ఇద్దరూ కూడా ఒక గుడిలో తల దాచుకుంటారు, ఆ గుడిలోనే బాధపడుతూ కూర్చుంటారు.

  గుడిలో దాగి

  గుడిలో దాగి

  మరోపక్క వీరిద్దరినీ వెతకడానికి వెళ్లి దాదాపు అన్ని ప్రదేశాలు చూసిన తర్వాత భరత్ వస్తే ఇక్కడికి వస్తాడు అని చెబుతూ వాళ్ళు ఉన్న గుడికి తీసుకువస్తాడు రఘురాం. దీంతో వీళ్ళిద్దరి ని చూసి భరత్, సిరి తమ పాపను తీసుకుని గుడిలోనే మరోచోట దాక్కుంటారు. రఘు రామ్ సీత గుడి మొత్తం వెతికినా వీళ్లిద్దరు కంట పడక పోవడంతో వీళ్ళు ఉన్నారనే విషయం కూడా వాళ్ళిద్దరికీ తెలియదు. తమ ముఖాలు చూపించకూడదు అనే సిరి, భరత్ ఉద్దేశంతోనే ఉంటారు తప్ప తమ కోసం అన్నా వదినలు ఎంత బాధ పడుతున్నారో అనే విషయం భరత్ ఆలోచించలేక పోతాడు. ఈ నేపథ్యంలోనే భరత్ ఎలా అయినా ఇంకా దాక్కుందాం అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

  ఎలా అయినా దొరక్కూడదని

  ఎలా అయినా దొరక్కూడదని

  ఇక మరోపక్క ఇంట్లోనే ఉన్న శిల్ప ఈ విషయం గురించి తన తల్లికి చెప్పాలని చెబితే ఎంతో ఆనందిస్తుంది అని ఆమెకు ఫోన్ చేయడానికి వెళుతుంది. అయితే అన్న వదినలు తమ వెంట పడడంతో భరత్ తన భార్య సిరి పాప ను బయటకు తీసుకు వెళ్ళి పోతాడు. ఎలాగైనా వాళ్ళకి దొరకకుండా రాత్రంతా గడిపి వాళ్లకి దూరం అవ్వాలని ఉద్దేశానికి వస్తాడు. అయితే లక్ష్మణ్ మాత్రం వాళ్ళ అన్న వదినలను వదిలి ఉండలేరు అని తెల్లారాక వాళ్ల మనసును మార్చుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. అయితే తర్వాత కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం సీరియల్ తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   జానకి కలగనలేదు నుంచి రామచంద్ర

  జానకి కలగనలేదు నుంచి రామచంద్ర

  గతంలోనే ఈ సీరియల్ కోసం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుంచి నందు క్యారెక్టర్ ని తీసుకు రాగా ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్ నుంచి రామచంద్ర క్యారెక్టర్ ని కూడా తీసుకొచ్చారు. రోడ్డు మీద నిద్రిస్తున్న భరత్ తల కింద ఉన్న బ్యాగ్ తీసుకుని దొంగ పారిపోతుంటే భరత్ వెంటపడి ఆ దొంగను కొట్టి బ్యాగ్ లాక్కుంటాడు. అయితే భరత్ మీద ఎటాక్ చేయడానికి సందర్భంగా ప్రయత్నిస్తున్న సమయంలో రామచంద్ర ఆ దొంగను చూసి ఆట కట్టించేందుకు రంగంలోకి దిగుతాడు.

  English summary
  Vadinamma Episode 650: Bharat feels guilty for leaving his family during their hard times. Meanwhile, Raghuram and his family search for the latter in various places.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X