For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma September 1st Episode : కొడుకు సీక్రెట్ లీక్.. ఒట్టుతీసి గట్టు మీద పెట్టేసిన శిల్ప.. దమయంతి బేజారు!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ ప్రస్తుతం 636వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.. గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా నిలుస్తుంన్న నాని- శిల్పల శోభనానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అన్ని సిద్ధమైన తర్వాత నువ్వు శోభనానికి సహకరించకూడదని శిల్ప దగ్గర ఆమె తల్లి దమయంతి మాట తీసుకుంటుంది. అయితే ఆ మాట ప్రకారమే దమయంతి కూతురు కోసం మరే ప్లాన్లు వేయకుండా లోపలికి పంపిస్తుంది. మరి ఈ రోజు దమయంతి మాట ప్రకారం శిల్ప శోభనం జరగకుండా అడ్డుకుంటుందా లేదా ? అనేది తేలనుంది. ఆ వివరాల్లోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  కష్టమే

  కష్టమే

  శోభనం గదిలో నాని తన భార్య శిల్ప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శిల్ప పాల గ్లాసు తీసుకుని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన శిల్ప ఈ వాతావరణం చూస్తే తట్టుకోవడం కష్టమే ఇలాంటి వాతావరణంలో ఉంటాము అని తెలిసి కూడా నీవు కన్యగానే బయటకు రావాలి అని మా అమ్మ ఎలా మాట తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. దగ్గరకు వచ్చిన నాని ఆమెను దగ్గరకు తీసుకుని నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అంటాడు. ఇదేంటి మా ప్లాన్ అంతా తెలిసి పోయిందా అని కంగారు పడుతూ ఉంటే కొత్తగా పెళ్లయిన వారిలో ఈ టెన్షన్ ఉండటం సహజం అని దాని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి మనం కాసేపు మాట్లాడుకుందాం అని అంటాడు. దీంతో కొంచెం రిలాక్స్ అయిన శిల్పా నానితో క్లోజ్ అవుతుంది. అయితే నాని అన్ని వివరాలు చెబుతూనే దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో తల్లి మాటలు గుర్తు వస్తాయి.

  హద్దు దాటేస్తున్న శిల్ప

  హద్దు దాటేస్తున్న శిల్ప

  అయినా సరే ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఈ పరిస్థితుల్లో కంట్రోల్ చేసుకోవడం కష్టమే అన్నట్లుగా శిల్ప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నాని కల్పించుకుని నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెబుతూ తనకు తన తల్లి తండ్రి ఇద్దరు అన్న వదినలేణని చెబుతూ వాళ్లని ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని అంటాడు. మరీ ముఖ్యంగా సీత వదిన అంటే తనకు చాలా అభిమానం అని అంటాడు. ఆమె గురించి నీ ఉద్దేశం ఏమిటి అని అడగగా మీ సీత వదిన నిజంగా దేవత అని ఆమె ప్రయత్నించడం వల్లే మన పెళ్లి అయిందని శిల్ప చెబుతుంది. అలా ఇద్దరూ మాటల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సీత కొబ్బరికాయ కొట్టే విషయంలో తనను పార్వతి, దమయంతి, దుర్గా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు దగ్గర కొట్టిన కొబ్బరి కాయలో పువ్వు చూపించి ఈ విషయం రఘురాం దగ్గర దాచవద్దు అనే సంకేతాలు పంపారని ఎలా అయినా సీక్రెట్ చెప్పేయాలని ఆమె అనుకుంటుంది.

  మళ్ళీ సైలెన్స్

  మళ్ళీ సైలెన్స్

  ఇంతలో అక్కడికి వచ్చిన రఘురాం నువ్వు బాధ పడకు అని ఇదంతా పంతులు వల్లే వచ్చిందని అంటాడు. అదేంటి అంటే నువ్వు కొట్టిన కాయలో పువ్వు వచ్చినంత మాత్రాన నిన్ను ఆ మాటలతో బాధ పెట్టాల్సిన అవసరం లేదని అప్పుడే ఆయనను ఏదో ఒకటి అందాం అనుకున్నాను కానీ సంస్కారం అడ్డు వచ్చి ఆగాను అని అంటాడు. అయితే సీత చెప్పాల్సిన విషయం చెప్పకుండా మళ్ళీ సైలెంట్ అవుతుంది. మరో పక్క దమయంతికి నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. శిల్పను ఇప్పుడు ఎలా అయినా డిస్టర్బ్ చేయకపోతే శోభనం అయిపోతుందని భయపడి ఫోన్ చేస్తుంది. శిల్ప తెలివిగా ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటుంది కాబట్టి ఆమె ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక్కొక్కరికి దగ్గరకు వెళ్లి చూసి వస్తూ ఉంటుంది. అలా భరత్- సిరి గది లోకి వెళ్తే వాళ్ళిద్దరి మధ్య సరససల్లాపాలు సాగుతూ ఉంటాయి.

  అందరూ అదే మూడ్ లో

  అందరూ అదే మూడ్ లో

  ఇదేం దరిద్రం రా నాయనా అనుకుంటూ మళ్లీ శైలు- లక్ష్మణ్ దగ్గరికి వెళితే వాళ్లు కూడా సరససల్లాపాలలో మునిగిపోయి ఉంటారు. ఎలా అయినా రఘురాంతో గొడవ పెట్టుకుని శోభనం క్యాన్సిల్ చేయిస్తాను అని భావించి రఘురాం దగ్గరికి వెళ్తే రఘురాం సీత కూడా దాదాపుగా అదే పరిస్థితుల్లో కనిపిస్తారు .దీంతో ఏం చేయాలో అర్థం కాదు.. కటిక దరిద్రం అనుభవిస్తూ కూడా ఈ సరసాలు అడ్డుకోవడం ఏమిటో అన్నట్లు చిటపట లాడి పోతూ తిరుగుతూ ఉంటుంది.

  Anushka Hurts Muslim Religious Views
  కాలు తొక్కి

  కాలు తొక్కి

  మరో పక్క పార్వతి తన కాలికి నిజంగా దెబ్బ తగిలింది అని చెబుతూ ఉండగా అక్కడికి వచ్చిన కావాలనే పార్వతి కాలు తొక్కుతుంది. ఎందుకు అంటే మీరు చేసిన దానికి ఇంకేం చేయాలి అన్నట్టు కూతురు మీద కోపం పార్వతి మీద చూపిస్తుంది. పార్వతి విలవిలలాడుతుంటే తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా దుర్గ నిద్రపోయే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద దమయంతి ప్లాన్లు అన్ని ఫెయిల్ అయి చివరికి శోభనం జరిగిపోయినట్లు కనిపిస్తోంది. కానీ దానికి సంబంధించిన క్లారిటీ అయితే చూపించలేదు. తరువాత ఎపిసోడ్లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.. అదే జరిగితే చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ గా నడుస్తున్న శోభనం వ్యవహారం పూర్తి అయినట్లే.

  English summary
  Vadinamma Episode 636 : Dhamayanti gets frustrated as her attempts to spoil the ritual go for a toss. In the meantime, Parvati and Durga plan something evil to trouble Sita's family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X