Vadinamma : దమయంతి కొత్త స్కెచ్.. ఒక్కరోజులో వెనక్కు రాకుంటే అంతా అయిపోయినట్టే!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 653వ ఎపిసోడ్ కి చేరింది. ఇంట్లో శిల్ప పెట్టిన చిచ్చు ఇప్పటికీ చల్లారలేదు. ఇంట్లో నుంచి భరత్, సిరి ఇద్దరూ కూడా వెళ్లిపోయారని తెలియడంతో పార్వతమ్మ సీత ఇంటి మీదకు దండెత్తి వచ్చి నానా రాద్ధాంతం చేస్తుంది. సీత తో పాటు శైలు ని కూడా టార్గెట్ చేస్తూ అనేక మాటలు అంటుంది. కోట్ల రూపాయల ఆస్తి పోవడానికి నువ్వే కారణం అమ్మాయి, నా బిడ్డకు అల్లుడికి ఏమైనా జరిగితే నిన్ను వదిలేది లేదు అంటూ ఆమెను హెచ్చరించడంతో శైలు కూడా బాధపడుతుంది. దీంతో శైలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోవడానికి సిద్ధమవుతోంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 అలిగిన శైలు

అలిగిన శైలు

పార్వతి మాటలతో బాధ పడిన శైలు తన బ్యాగ్ తీసుకుని పుట్టింటికి వెళ్లడానికి బయలుదేరుతుంది, అది చూసిన సీత కన్నీళ్లు పెట్టుకుంటుంది. భరత్, సీత వెళ్లిపోయారని నేను గుండెలు పగిలేలా ఏడుస్తుంటే నువ్వు కూడా వెళ్ళిపోతావా అని ప్రశ్నిస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయకుండా వేరే వేరే వాళ్ల దగ్గర మాటలు పడాల్సిన అవసరం లేదు అని అందుకే నేను పుట్టింటికి వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. అయితే సీత మాత్రం తనను వదిలేసి వెళితే తన పరిస్థితి ఏమీ బాగోలేదు అని వాళ్లకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఎట్టకేలకు సీత అన్న మాటలకు శైలు మనసు మార్చుకుని మళ్ళీ ఆగిపోతుంది. నిజమే కద సిరి వాళ్ళు వెళ్ళి పోయారు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతే సీతక్క ఏమైపోతుందో కదా అనే ఉద్దేశంతో ఆమె ఆగుతుంది.

నచ్చచెప్పడానికి చూస్తున్న రామ

నచ్చచెప్పడానికి చూస్తున్న రామ

మరో పక్క జానకి కలగనలేదు రామ ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్న భరత్, సిరి ఇద్దరికీ కూడా రామ భోజనం చేసి తీసుకు వస్తాడు. భోజనం చేసి తీసుకు వచ్చిన అనంతరం వీళ్ళిద్దరి మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం అన్నాక గొడవలు వస్తూనే ఉంటాయని అలా అని ఇలా విడిపోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. ఎలా అయినా మీరు మనసు మార్చుకుని వెళ్ళిపోతే ఆనందిస్తామని ఎందుకంటే మీరు ఇల్లు వదిలి వచ్చేయడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని అంటాడు. మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబం అంటే మీ లాగానే ఉండాలి అని అంటూ ఉంటుందని కానీ మీరు మాత్రం ఇలా అన్నా వదినలకు మనశ్శాంతి లేకుండా చేసి బయటకు రావడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని అంటాడు. అయితే ఆయనకు జరిగిన విషయం ఏమిటో తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు జరిగింది ఏంటో చెప్తాను అంటూ సిరి ప్రయత్నం చేయబోయింది.

డబ్బు సంపాదించాకే ఇంటికి

డబ్బు సంపాదించాకే ఇంటికి

అయితే తనకు ఏం మాటలు చెప్పవద్దని తను వినాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. తమ మాట వినని వెళ్ళిపోతే బావుంటుందని రామ చెప్పి తన పని మీద తాను వెళ్ళిపోతాడు. ఇక మరో పక్క సీత ఏమీ తినకుండా ఇంట్లోనే దిగాలుగా కూర్చుని ఉంటుంది. అన్నం కలిపి తీసుకెళ్లి ఇచ్చిన సరే సీత తినకుండా భరత్, సిరి వచ్చాక తింటాను అని అన్నట్లుగా భారత్ కి కల వస్తుంది దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. అయితే ఇది చూసిన సిరి భయపడి ఎందుకు ఇలా చేస్తున్నావు వెనక్కి వెళ్లి పోదామా అంటుంది, వెళ్ళిపోదాం అన్నట్లుగా భరత్ మాట్లాడితే లేదు మన వల్ల డబ్బు నష్టపోయారు కాబట్టి మనం ఆ డబ్బు సంపాదించి తిరిగి వాళ్లకి ఇవ్వాలి అని అంటుంది. మనిద్దరమే అంత డబ్బు సంపాదించగలమా అంటే సంపాదించగలము అంటే సంప్రదించగలము అని లేదంటే లేదని ఆమె ధైర్యం చెబుతుంది. అదే సీత మాత్రం భరత్ గతంలో చేసిన అన్ని పనులు గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటుంది.

ఫలించిన దమయంతి ప్లాన్

ఫలించిన దమయంతి ప్లాన్

ఇక మరో పక్క దమయంతి ప్లాన్ ప్రకారం దుర్గ సీత ఇంటికి వెళ్తుంది. సీతను బాధపడొద్దు అసలు దీనంతటికీ కారణం శిల్ప ఏమో అని నా డౌట్ అంటుంది. శిల్ప వచ్చిన వేళ విశేషం ఏమీ బాలేదు అని అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని శిల్పను టార్గెట్ చేసినట్లు చూపిస్తున్నారు. అయితే ఇదంతా దమయంతి ప్లాన్ లో భాగంగా జరుగుతున్నట్లుగా ప్రేక్షకులను ఇట్టే అర్థమైపోతుంది. తనను అంటుంటే శిల్ప కూడా ఎదురు తిరుగుతుంది ఇలా మాట్లాడడం ఏమీ కరెక్ట్ గా లేదు అంటున్న సమయంలో నేటి ఎపిసోడ్ ముగించారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

ఇక తరువాత కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం దమయంతి హుటాహుటిన తన కూతురిని తీసుకువెళ్లడానికి సీత ఇంటికి వస్తుంది. తన కూతురు మీద మాటలు అంటుంటే ఎలా భరించగలను అని ఆమెను తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. ఆవిడ తీసుకు పోవడానికి వీలు లేదని చెబుతాడు. అయితే భరత్, సిరి తిరిగి వెనక్కి ఈ రోజులోగా తిరిగి వస్తే తాను తన కూతురిని ఉంచుతానని అలా రాకపోతే మాత్రం తీసుకుని వెళ్తాను అని అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X