For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : దమయంతికి ఊహించని షాక్.. భరత్, సిరి దెబ్బకు తీవ్ర అవమానం!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 656వ ఎపిసోడ్ కి చేరింది.. ఎలా అయినా తన అల్లుడు నీ కూతుర్ని ఇల్లరికం తీసుకువెళ్లాలని శతవిధాల ప్రయత్నిస్తున్న దమయంతి తన కూతురు సాయంతో రఘురామ్ కుటుంబంలో పెద్ద విధ్వంసానికి తెరలేపింది. రఘురామ్ వ్యాపారం చేయడం కోసం తీసుకువచ్చిన పాతిక లక్షల రూపాయలు సరుకు కూతురు చేత పాడు చేయించడంతో రఘురాం కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. భరత్, సిరి ఇద్దరూ కూడా బాధపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న దమయంతి దుర్గ తో కలిసి పెద్ద స్కెచ్ వేసింది. ఇక తాజా ఎపిసోడ్లను ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  దమయంతికి షాక్

  దమయంతికి షాక్

  చెప్పిన సమయం అయిపోయింది కాబట్టి తన కూతుర్ని అల్లుడిని తనతో పంపించాలని కోరుతుంది. అయితే నాని మాత్రం ససేమిరా వెళ్ళేది లేదని తెగేసి చెబుతాడు. ఇదేనా నువ్వు మీ అన్నయ్యకు ఇచ్చే గౌరవం ఆయన మాటిస్తే మాట తప్పను అంటాడు కదా మరి నువ్వు రాను అని ఎలా అంటావు అని దమయంతి అల్లుడుని ప్రశ్నిస్తుంది. ఇదంతా చేయి దాటి పోయేలా కనిపిస్తూ ఉండటంతో రఘురాం వెంటనే దానికి ఇంకా సమయం ఉంది నేను చెప్పిన సమయం గడిచే వరకు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని అంటాడు.. వెంటనే దమయంతి కల్పించుకుని నీ దింపుడు కళ్లెం ఆశలు ఇంకా తీరలేదా ఇప్పటిదాకా రాని వ్యక్తులు ఈ కాసేపట్లో వచ్చేస్తారా అని ప్రశ్నిస్తుంది. సరే నీ ఆనందం నేను ఎందుకు కాదనాలి నేను ఒక కౌంట్డౌన్ లెక్క పెడతాను అది పూర్తయ్యే లోపు రాకపోతే నా అల్లుడు నీ నాతో పంపించు అని చెబుతూ కౌంట్ డౌన్ కూడా మొదలు పెడుతుంది.

  ప్రత్యక్షం అయిన భరత్, సిరి

  ప్రత్యక్షం అయిన భరత్, సిరి

  ఆమె అలా మొదలు పెట్టిందో లేదో గుమ్మంలో భరత్, సిరి ప్రత్యక్షమవుతారు. వదినమ్మ అని పిలవడంతో అందరూ ఒక్క సారిగా షాక్ అయి వాళ్ళ వంక చూస్తూ ఉంటారు. సీత ఎప్పుడు వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? అని అడగ బోతుంటే వాళ్లంతా అలసిపోయి ఉంటారు లోపలికి తీసుకు వెళ్ళమని రఘురాం అంటాడు. రఘురాం తో సిరి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా సరే ముందు లోపలికి వెళ్ళండి, తర్వాత మాట్లాడతాను అని పంపించేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి మనకు ఏమీ వర్కవుట్ కాదు అన్న ఉద్దేశంతో దమయంతి చల్లగా జారుకుని ప్రయత్నం చేస్తుంటే రఘురాం పిలిచి మరీ వార్నింగ్ ఇస్తాడు. ఎలా అయినా అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని మీ దుర్బుద్ధి మరోసారి బయటపడింది. గతంలో వ్రతం సమయంలో కూడా అలాగే చేశారు కానీ అప్పుడు ఎలా అయితే అమ్మవారు అడ్డుపడి ఆపిందో ఇప్పుడు కూడా అలాగే అమ్మవారే అడ్డుపడి ఆపింది అంటాడు. ఇక ఇదంతా వింటున్న దమయంతికి ముఖాన నెత్తురు చుక్క లేకుండా పోతుంది. తన తల్లి బాధపడుతున్న విషయం అర్థం చేసుకున్న శిల్ప వెంటనే గదిలోకి వెళ్ళి పోతుంది.

  అలిగిన శిల్ప

  అలిగిన శిల్ప

  గదిలోకి వెళ్ళి పోయి మీ అన్న మా అమ్మ ని అన్నేసి మాటలు అంటుంటే వింటూ ఉంటావా అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత లేదా అని భర్తను ప్రశ్నిస్తుంది.. అందులో తప్పేముంది మీ అమ్మ నన్ను ఎలా అయినా ఇంటికి తీసుకు వెళ్లాలని అనుకుంది కానీ అది జరగని కారణంగా మా అన్నయ్య మీకు అర్థమయ్యేలా చెప్పాడు అని అంటాడు. అయితే అది తనకు నచ్చలేదని తన తల్లిని అవమానించడమే అని శిల్ప అంటుంది. ఇలా పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఒకరిమీద ఒకరు మాటల అనుకోవడం సహజం అని దానికి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదని అని అంటాడు.

  దమయంతి రాద్ధాంతం

  దమయంతి రాద్ధాంతం

  ఇక మరో పక్క ఇంటికి వెళ్ళిన దమయంతి ఇంట్లో వాళ్ళందరూ మీద రంకెలు వేస్తూ ఉంటుంది. భర్త సర్ది చెప్పబోయినా ఎలా అయినా అల్లుడిని ఇంటికి తీసుకు వచ్చి తీరుతాను అని ఆమె అంటుంది. తన అల్లుళ్ళు కూతుర్లు తన కళ్ళముందు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పా? అంటే మీ కళ్ళముందు ఉండాలి అనుకోవడం వేరు సంతోషంగా ఉండటం వేరు అని అంటాడు భర్త. దీంతో మీరు సంతోషంగా లేరా? అని అల్లుడు నీ కూతురు నీ ప్రశ్నిస్తుంది. వాళ్లకు ఏమనాలో అర్థం కాక బాగానే ఉన్నాము అని అబద్ధం చెబుతారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   సీతకు అనుమానం

  సీతకు అనుమానం

  ఇక మరోపక్క రాత్రి భోజనానికి సమయం అవుతూ ఉంటుంది. భరత్, సిరి కి ఇష్టమైన వంటలు చేసావా అని రఘురామ్ అడుగుతాడు అయితే వాళ్ల మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు వాళ్ళతో మాట్లాడటం లేదు అని సీత అడిగితే నేను మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడకూడదా ? అయినా నేనేమీ మాట్లాడను అనలేదే అని రఘురాం అంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక కమింగ్ అప్ నిన్నటి కమింగ్ అప్ నే చూపించారు సిరి అలాగే శైలు మాట్లాడుకుంటూ సరుకుల మీద నీళ్లు పోసే విషయం గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే శిల్ప భయపడడం చూసి సీతకు అనుమానం వస్తుంది. చూడాలి రేపటి ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తారేమో.

  English summary
  Vadinamma Episode 656: Bharat and Siri return back to their house and apologise to the family. Meanwhile, Raghuram lashes out at Dhamayanthi as she loses the challenge.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X