For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : మొన్న శిల్ప ఇపుడు దమయంతి.. రెడ్ హ్యాండెడ్ గా సీతకి దొరికేసి.. ఏమైందంటే?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 659వ ఎపిసోడ్ కి చేరింది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం రఘురాం కుటుంబం అంతా కష్టాలపాలు అవుతుండటం చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భరత్, సిరి ఇద్దరూ కూడా ఇల్లు విడిచి బయటకు వెళ్ళిపోయారు. దీన్ని అదునుగా తీసుకుని దమయంతి తన కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని ప్రయత్నించగా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అయితే ఇంటికి వచ్చాక భరత్ తన వదినమ్మ తో కలిసి బయటికి వెళ్తాడు. అదే సమయంలో ప్లాస్టిక్ బియ్యం తో మోసం చేసిన వ్యక్తి భరత్ కి తారసపడతాడు. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరక లేదు కానీ అనూహ్యంగా సీతకు దొరుకుతాడు. సీతకు దొరికాక ఈ విషయం అంతా చేయించింది దమయంతి అనే విషయం ఒప్పుకుంటాడు. భరత్ దృష్టి కి వెళితే పెద్ద రాద్ధాంతం అవుతుందని భావించి సీత భరత్ ని అక్కడి నుంచి తీసుకువెళుతుంది. దీంతో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  భరత్ కి ఏమైంది

  భరత్ కి ఏమైంది

  అతనిని వెతుకుతాను అని వెళ్లబోతున్న తనను ఆపి ఇంటికి తీసుకు రావడంతో భరత్ చాలా బాధపడతాడు. అప్పటికి ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. నాని తన భార్య శిల్ప పని చేస్తుంటే చూసి ఆనంద పడుతూ ఉంటాడు. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన భరత్ తో సిరి ఏదో పని చెప్పపోగా తన మనసు ఏమి బాగాలేదు అని కాసేపు కదిలించవద్దు అని కోరుతాడు. దీంతో అసలు భరత్ కి ఏమైంది అందరూ బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో భరత్ తనకు ప్లాస్టిక్ బియ్యం అంటగట్టి వెళ్ళి పోయిన వాడు కనపడ్డాడు అని అయితే వాడిని పట్టుకుంటాను అంటే వదినమ్మ పట్టుకొని ఇవ్వకుండా ఇంటికి తీసుకు వచ్చేసిందని అంటాడు. అయితే రఘురాం తల్లి అలా ఎందుకు చేసావు అని సీతను అడిగితే భరత్ ఆవేశం చూశారు కదా వాడు దొరికితే ఎక్కడ కొట్టి చంపేస్తాడో అనే భయం తోనే వద్దు అని ఇంటికి తీసుకు వచ్చాను అని అంటుంది.

   అబద్ధం చెప్పి

  అబద్ధం చెప్పి

  అందరూ సమాధాన పడతారు, ఇంతలో రఘురాం బండి నడుపుతూ వెళ్తున్న సమయంలో ఒక పెద్దావిడ కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితుల్లో ఉంటే బండి ఆపి అప్పటికప్పుడు ఆమెకు సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత ఆమె తనకు గతంలో స్టార్ రూమ్ అలాగే బండి అద్దెకిచ్చిన శ్యామ్ సుందర్ తల్లి అని గుర్తు పడతాడు. ఆమెకు పెద్ద ఆపరేషన్ అని చెప్పి శ్యాంసుందర్ బండి తీసుకున్న విషయాన్ని ఆమెతో ప్రస్తావించి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. నీకు అబద్ధం చెప్పి నీ దగ్గర అవన్నీ తీసుకున్నాడని బండి ఇంట్లోనే ఉందని స్టోర్ రూమ్ కూడా తాళాలు వేసి ఉన్నాయి అని అంటుంది. అతనికి చెడు సావాసాలు ఎక్కువైపోయాయి అని పని కూడా మానేసి నోట్ల కట్టలతో నే కాలం గడుపుతున్నాడని ఎవరో అతనికి నోట్లకట్టలు ఇచ్చారు అని అంటుంది. ఈ విషయం తెలిసిన రఘురాం చాలా సీరియస్ గా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఈ విషయాన్ని తల్లికి భార్య సీతకు చెబుతాడు. అయితే వాళ్లతో ఈ విషయం చెబుతున్న సమయంలో శిల్ప విని షాక్ అవుతుంది.

  బండారం బయటపడి

  బండారం బయటపడి

  ముందు ప్లాస్టిక్ బియ్యం అమ్మిన అతను అలాగే ఇప్పుడు శ్యాంసుందర్ బండారం బయటపడింది, ఇది ఎక్కువ రోజులు ఈ వ్యవహారం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు అని భయపడుతూ తల్లికి ఫోన్ చేస్తుంది. తల్లి కి ఫోన్ చేసి ఇలా జరుగుతోంది ఏం చేయాలి అంటే నువ్వేం చేయొద్దు నీ వల్ల అంతా జరిగిందని బయట పడితే వాళ్ళ నిన్ను తన్ని తరిమేస్తే తరిమెయ్యన్నీ అని అంటుంది.. అలా అనడం కరెక్ట్ కాదునీ నాని నీ విడిచి నేను ఉండలేనని శిల్ప అంటుంది.

  రెండో పెళ్లి

  రెండో పెళ్లి

  నువ్వు వచ్చేస్తే నీకు రెండో పెళ్లి చేస్తాను అని అనడంతో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు నాని నీ ఇల్లరికం తీసుకురావడానికి నీ మాటలు వింటున్నాను కానీ నీ ఉద్దేశం ఇదే అయితే నేను ఇంకా నీతో మాట్లాడను అన్నట్లుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా వింటున్న సీత తాను మంచి మాటలు చెప్పి శిల్ప మనసు మార్చడానికి వచ్చాను కానీ మంచి మాటలు చెప్పాల్సింది దమయంతికి అనే విషయం తెలుసుకుని సైలెంట్ అవుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  దమయంతికి సీత వార్ణింగ్

  దమయంతికి సీత వార్ణింగ్

  ఇక ఆ తెల్లవారుజామున శిల్ప కు జ్వరం వస్తుంది, నాని ని తన పక్కనే కూర్చుని ఉండాల్సిందిగా శిల్ప కోరుతుంది. డాక్టర్ వచ్చి పరిశీలించాక ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని నిన్న దేనినో చూసి భయపడి ఇలా జ్వరం తెచ్చుకుందని అంటుంది. దీంతో రఘురాం ఆమెను ఏమైనా అన్నావా అంటూ తమ్ముడు మీద సీరియస్ అవుతాడు కానీ విషయం తెలిసిన సీత మాత్రం ఏదో పీడ కల రావడంతో అలా జరిగి ఉండొచ్చని సమాధానం వస్తుంది. దీంతో ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ లో సీత తన ఇంటి దగ్గరికి వెళ్లి ఈ బండారం బయటపడింది మా వాళ్ల అందరికీ క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం చూపించారు.

  English summary
  Vadinamma Episode 659: Raghuram is disturbed after learning the truth about the scam behind their losses. On the other hand, Sita suspects Shilpa as she overhears her conversation with Dhamayanthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X