Vadinamma : దమయంతికి సీత మాస్ వార్నింగ్.. దెబ్బకు వణికిపోయి సరెండర్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 659వ ఎపిసోడ్ కి చేరింది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం రఘురాం కుటుంబం అంతా కష్టాలపాలు అవుతుండటం చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భరత్, సిరి ఇద్దరూ కూడా ఇల్లు విడిచి బయటకు వెళ్ళిపోయారు. దీన్ని అదునుగా తీసుకుని దమయంతి తన కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని ప్రయత్నించగా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అయితే భరత్ కంట ప్లాస్టిక్ బియ్యం అమ్మేవాడు పడడంతో పాటు రఘురాంకు శ్యాంసుందర్ విషయం తెలియడంతో శిల్ప కంగారు పడుతుంది.
అదే సమయంలో తన తల్లికి ఫోన్ చేసి విషయం చెబితే దొరికిపోతే నిన్న మహా అయితే ఇంటికి పంపిస్తారు నువ్వు ఇంటికి వచ్చేస్తే నీకు మరో పెళ్లి చేస్తాను అని తల్లి చెబుతుంది. ఈ మాటలకు ఒక రకంగా ఆమె నిరాశకు గురవుతుంది. ఈ విషయాలన్నీ తెలిస్తే తనను నాని ఎలా అర్థం చేసుకుంటాడో అనే బెంగతో ఆమెకు కడుపు జ్వరం వస్తుంది. డాక్టర్ ను ఇంటికి పిలిపించగా ఆమె దేనినో చూసి దడుచుకుందని అంతే తప్ప పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతుంది. తన కూతురికి జ్వరం వచ్చింది అనే సంగతి తెలుసుకొని దమయంతి హుటాహుటిన రఘురాం ఇంటికి చేరుతుంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

దమయంతి రాద్ధాంతం
జ్వరం వచ్చి సీత పడుకొని ఉంటే దమయంతి వచ్చి నానా రాద్ధాంతం చేస్తుంది. తన కూతురికి ఏమైంది అని ప్రశ్నించగా జ్వరం వచ్చింది అని సీత సహా కుటుంబ సభ్యులు చెబుతారు. అయితే ఇలాంటి ఇళ్లల్లో ఉంటే జ్వరం వస్తుంది, సరైన గాలి వెలుతురు ఉండదు, శుభ్రత ఉండదు అంటూ వాళ్ళ మీద విరుచుకు పడుతుంది. అయితే మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా దమయంతి మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదని ఇలా మాట్లాడడం తగదని అంటారు. అయితే దమయంతి మాత్రం తన కూతురికి ఇలా జరిగితే తాను ఊరుకోనని ఇప్పటికిప్పుడు తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటుంది. అయితే సీత మాత్రం మీరందరూ బయటికి వెళ్ళండి ఆమె తన కుమార్తెను పరామర్శిస్తూ ఉంది అంటుంది. అలా మిగతా వాళ్ళు అందరూ బయటకు వెళ్ళగా కేవలం దమయంతి, సీతా మాత్రమే గదిలో మిగులుతారు. మిగతా వాళ్లు అందరూ బయటకు వచ్చినా సరే దమయంతి మంచిది కాదు సీతమ్మను ఏదో ఒకటి అంటుందని ఆమె బాధ పడే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు.

సీతకు అన్నీ తెలుసు
ఎవరో ఒకరు లోపల ఉండాల్సింది అని కనీసం నువ్వైనా ఉండాల్సింది అని రఘురామ్ అని అందరూ అంటారు.. అయితే సీత ఏం చేసినా ఆలోచించి చేస్తుందని తను కూడా బయటకు వెళ్ళమని అంటే ఆమె ఏదో ఆలోచించే అన్నది అని అంటాడు.. కాసేపు వేచి చూద్దామని అంటూ ఉండగా లోపల మాత్రం దమయంతి మీద సీత ఫైర్ అవుతూ ఉంటుంది. ప్లాస్టిక్ బియ్యం కొనిపించి అతనికి డబ్బులు ఇచ్చిన సంగతి అలాగే తమ స్టోర్ రూమ్ ఖాళీ చేయించి బండి వెనక్కి లాక్కునే లాగా చేసి రాక్షస ఆనందం పొందుతున్న సంగతి తనకు తెలిసిపోయిందని అంటుంది. దమయంతి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలిస్తే తెలిసింది ఇప్పుడు ఏంటి నా కూతురు ఇంటికి పంపిస్తావా సరే తీసుకువెళ్ళు ఇంకో పెళ్లి చేస్తాను అంటుంది

సీత మాస్ వార్నింగ్
సీత సీరియస్ అయ్యి నేను కనుక ఈ విషయాలన్నీ నా భర్తకు, మరుదలకు చెప్పానంటే వాళ్లే నీ సంగతి తేలుస్తారు, ముందు నువ్వు చేసిన అన్ని పనులకు పోలీసులు పట్టించి జైలుకు పంపిస్తారు. నువ్వు ఇంకా మా బంధువు అనుకుంటున్నాను కాబట్టి నీకు నెమ్మదిగా చెబుతున్నాను నువ్వు కనుక ఈ విషయాలన్నీ మళ్లీ రిపీట్ చేయాలని అనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందు సీతను భయపడతాం అనుకున్న దమయంతి పోలీస్ కేసు అనడంతో సైలెంట్ అయిపోతుంది.. ఇప్పుడు సైలెంట్ గా నాతో పాటు బయటకు వచ్చి మా వాళ్లందరికీ క్షమాపణలు చెప్పు లేదా నీ సంగతి తేలుస్తాను అంటుంది. సీత చెప్పినట్లుగానే బయటకు వచ్చిన దమయంతి వాళ్లందరికీ క్షమాపణలు చెబుతుంది. అయితే వాళ్లు అందరూ మాత్రం షాక్ అయి చూస్తూ ఉంటారు.

దమయంతి షాక్
ఇక అవమానభారంతో ఇంటికి చేరిన దమయంతి తన పెద్ద కూతుర్ని అల్లుడిని కూడా ఆ కోపంలో అవమానిస్తుంది. మరోపక్క శిల్ప మాత్రం తల్లి లాంటి సీతమ్మ మనసు ని తప్పుగా అర్థం చేసుకున్నాను ఎలా అయినా ఇల్లరికం తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో మా అమ్మ చెప్పినట్లు చేసి ఇక్కడి దాకా తీసుకు వచ్చాను అని బాధపడుతూ ఉంటుంది. అయితే దమయంతి ఇలా ప్రవర్తించడం చూసి ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరిగింది? లోపల ఏం చెప్పావు అని అడిగితే అది ఏమీ లేదని ఆమె తనంతట తానే నిజం తెలుసుకొని బాధపడింది అని చెబుతుంది.
Recommended Video

కమింగ్ అప్ లో
ఇక్కడితో నీటి ఎపిసోడ్ ముగించగా కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం శిల్ప చేసినం పాడు పని గురించి శైలు, సిరి ఇద్దరికీ తెలిసి పోయినట్లుగా శైలు ఇద్దరు కూడా శిల్పను కొట్టి ఇంటి నుంచి తరిమి వేస్తున్నట్లుగా చూపించారు. నానీ చేత నీకు విడాకులు ఇప్పిస్తాం ఇంకా మా ఇంటికి రావద్దు అని వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా చూపించారు. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











