For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : ముసలం పుట్టించిన శిల్ప.. అడగకూడని ప్రశ్న అడిగి మరీ అలకపాన్పు!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 638 వ ఎపిసోడ్ కి చేరింది. చాలాకాలంగా ఈ సీరియల్ లో నలుగుతూ వస్తున్న నాని శిల్పల శోభనం పూర్తి కావడంతో ఇప్పుడు తర్వాత పనుల మీద కుటుంబ సభ్యులు దృష్టి పెట్టారు. దమయంతి కూతురు తన దారి తప్పింది అని భావిస్తూ ఉండగా కూతురు శిల్ప మాత్రం తన తల్లిని మెప్పించే విధంగా నానిని ఎలా ఇల్లరికం తీసుకువెళ్లాలనే భావనలో ఉంటుంది. దానికి ఎలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది.

  అందులో భాగంగానే కుటుంబ సభ్యులు అందరూ వైదేహి రిషి చేతికి రాఖీ కట్టింది. వాళ్ళంతా ఆనందంగా గడుపుతుంటే నీకెందుకు పిల్లలు లేరు ? అని ప్రశ్నించి కొత్త కలకలం రేపుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  శిల్ప మీద ఆగ్రహం

  శిల్ప మీద ఆగ్రహం

  శిల్ప అడిగిన ప్రశ్నకు సీత నోటి మాట రాకుండా పోతుంది. ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నానికి ఈ విషయంలో కోపం వస్తుంది ఏంటా మాటలు? వదినని అలా అడుగుతావా అని కోప్పడతాడు. ఇంతలో రఘురాం కల్పించుకుని ఇప్పుడు శిల్ప కూడా మన కుటుంబ సభ్యురాలే ఆమెకు వచ్చిన డౌట్ తీర్చాల్సిన అవసరం మన మీద ఉంది అంటాడు.

  ఈ లోపు శైలు కల్పించుకుని తాను గర్భవతి గా ఉన్నప్పుడు సీతక్క కూడా గర్భవతిగా ఉండేదని అయితే ఒక బాబు పుట్టి పురిట్లోనే చనిపోయాడు అని చెబుతోంది. అయితే తాను బాధ పెట్టాలనే ఉద్దేశంతో అడగలేదని ఇంత మంచిదైన సీతక్క ఎందుకు తల్లి కాలేదు అని బాధతో అడిగానని శిల్ప కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే నాని శిల్ప మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, మా వదిన బాధపడేలా ఎందుకు అలా ప్రశ్నించావు అని ఆమెను అడుగుతాడు.

  శిల్ప అలకపాన్పు

  శిల్ప అలకపాన్పు

  నిజంగా తనకు ఆ విషయం తెలియక అడిగాను అని అంటే అయినా సరే ఇక మీదట అలా అడగొద్దు అంటే శిల్ప బాధపడుతుంది, బాధపడి అలిగినట్లుగా నటించి వెళ్లి పడుకుంటుంది. అన్న, వదిన మీద ప్రేమ ఎక్కువ అయి పోయిందని వీలైనంత త్వరగా వీడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని చెబుతూ అలిగి వెళ్లి పడుకుంది. ఇక మరో పక్క సీత బాధపడుతున్నట్లు కనిపించగానే రఘురాం మీ అన్నయ్య కి ఫోన్ చేసి చెబుతున్నాను నువ్వు రావడం లేదని అనడంతో ఎందుకు అని ప్రశ్నిస్తుంది సీత.

  నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్లి రాఖీ ఏం కడతావు అన్నట్లు మాట్లాడతాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రోజు మాత్రం అన్నయ్యకు రాఖీ కట్టి తీరాల్సిందే అని చెప్పి రఘురామ్ ను తీసుకుని అన్నయ్య ఇంటికి బయలుదేరి వెళుతుంది. ఇంతలో భాస్కర్ తన చెల్లి సీత కోసం తీసుకొచ్చిన చీరను తన కోసం భర్త తీసుకు వచ్చాడు అని భావించి దుర్గ కట్టుకుంటుంది.

  ఏం చేయాలో అర్ధం కాక

  ఏం చేయాలో అర్ధం కాక

  దీంతో వాళ్ళిద్దరి మధ్య కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. భార్యకు తీసుకురావడం తెలియదుగానీ చెల్లెలి కోసం తీసుకు వచ్చావా అన్నట్లుగా దుర్గ నిష్టూరంగా మాట్లాడుతుంది. నేను సంవత్సరానికి ఒక్కసారి సీతకు బట్టలు తీసుకు వస్తాను అవి కూడా ఎందుకు నువ్వు అడ్డం పడుతున్నావు అని అడుగుతాడు.

  నేను దాని గురించి బాధపడటం లేదని ఆమె తీసుకువచ్చిన వాడికి నాకు తీసుకురావాలని తెలియదా అని అడుగుతుంది. అయితే వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న సమయంలోనే డబ్బు ఎక్కడ ఉంది, డబ్బు తీసుకురా అని అడుగుతాడు నువ్వు తెచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇంట్లో అవసరాలకు డబ్బులు అన్నీ వాడేశాను ఆమె అంటుంది. దీంతో ఏం చేయాలో భాస్కర్ కి అర్థం కాదు. తన చెల్లి తనకు రాఖీ కడితే ఏమి ఇవ్వాలో సందిగ్ధావస్థలో పడిపోతాడు.

  రాఖీ అప్పుడే

  రాఖీ అప్పుడే

  ఇంతలో సీతా రఘురాం ఇంటికి రావడంతో వాళ్లను మాటల్లో పెట్టు నేను వాళ్ళకి ఏదైనా బహుమతి తీసుకు వస్తానని చెప్పి దుర్గను బయటకు పంపిస్తాడు. అలా బయటకు వచ్చిన దుర్గ మళ్ళీ సీత బాధపడేలా మాట్లాడుతుంది. కొంతమంది చెల్లెళ్ళు సంవత్సరం మొత్తం అన్నయ్య ఉన్నాడో లేడో కూడా చూడరు అని రాఖీ పండుగ రోజు మాత్రం రాఖీ తీసుకు వచ్చి పది రూపాయలకు పది వేలు సంపాదిస్తారని నిష్టూరంగా మాట్లాడుతుంది. ఇక ఈ విషయంలో ముందుగా సీత బాధపడినా వదిన గురించి తనకు ముందే తెలుసు కాబట్టి అన్నయ్య ఎక్కడ వదిన అని అంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  కొత్త టెన్షన్

  కొత్త టెన్షన్

  అన్నయ్య వచ్చాక నేను ఇప్పుడే బయటికి వెళ్లి వస్తాను అని చెబుతుంటే తనకు విషయం అర్థం కావడంతో అదేమీ చేయవద్దని సీత కోరుతుంది. ఎందుకంటే నీ కళ్ళు చూస్తే అసలు ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి అన్నయ్యకు రాఖీ కడుతుంది. ఇదిలా జరుగుతుండగా తనకు రాఖీ కట్టమని దుర్గ అని అడుగుతాడు రఘురామ్. దీంతో ఒక రకంగా దుర్గ పశ్చాత్తాప పడుతున్నట్లు గా చూపించారు. అలాగే అక్కడితో ఎపిసోడ్ ముగించారు ఇక తరువాతి ఎపిసోడ్లో శిల్ప సీతకు సిరికి మధ్య వివాదం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూపించారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Vadinamma Episode 638: Sita gets emotional with Shilpa's questions. Afterwards, Bhaskar gets enraged when Durga humiliates Sita.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X