For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : శిల్ప నట విశ్వరూపం.. ఇంగ్లీష్ లో మాట్లాడి భారీ స్కెచ్.. మళ్ళీ కొత్త టెన్షన్ !

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 639వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా నానిని ఇల్లరికం తీసుకువెళ్లడానికి ఎలా ప్లాన్ వేయాలా అనే ఆలోచన చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తనను బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నాని ఆగ్రహానికి గురై అలకపాన్పు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరి కొన్ని ప్రయత్నాలు కూడా ఆమె చేస్తున్నట్లు చూపించారు. మరి ఆమె ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతున్నాయి. అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   అపార్ధం చేసుకున్న దుర్గ

  అపార్ధం చేసుకున్న దుర్గ

  నిన్న సీత తన అన్న దగ్గరికి రాఖీ కట్టేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే దుర్గ సీతను అవమానించేలా మాట్లాడుతుంది, అంతే కాక సీత కోసం తెచ్చిన చీర కట్టుకొని తనకు చీర తేలేదు అన్నట్లుగా భర్తను నిందించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సీత రాఖీ కట్టిన తర్వాత రఘురాం కూడా తనకు రాఖీ కట్టమని దుర్గ కు రాఖీ ఇస్తాడు, అయితే ఈ పరిణామం ఊహించని దుర్గ రఘురాంని అర్థం చేసుకున్నట్లుగా భావిస్తూ పశ్చాత్తాప పడుతుంది.

  నోరుమూయించింది

  నోరుమూయించింది

  అలాగే రాఖీ కట్టడమే కాక రఘురాం డబ్బులు ఇవ్వకపోతే తీసుకుంటుంది, అలా తీసుకోవడం ఏమిటి అని భర్త వారిస్తున్నా వినకుండా తీసుకుని లోపలికి వెళ్ళి లెక్కపెట్టుకుంటూ ఉంటుంది. ఇదేం పద్ధతి ఇప్పటిదాకా డబ్బులు తీసుకునే వాళ్ళని తిట్టావు కదా మరి ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకున్నావు అని అడిగితే నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావా అయినా ఈ డబ్బులు నా కోసం కాదు కదా మన ఇంటి అవసరాల కోసమే కదా అని భాస్కర్ ని నోరుమూయించింది.

  తల్లికి విషయం చెప్పేసిన శిల్ప

  తల్లికి విషయం చెప్పేసిన శిల్ప

  ఇక మరోపక్క శిల్ప తన అన్నకు రాఖీ కట్టడానికి గాను ఇంటికి బయలుదేర బోతుంటే సీత చూసి నువ్వు వెళ్ళకూడదు అని అంటుంది. తను అన్నయ్యకు రాఖీ కట్టి వస్తాను అంటే కరెక్టే కానీ నువ్వు వెళ్లకూడదు ఎందుకంటే మూడు రోజులు పూర్తి కాకుండా బయట పెట్ట కూడదు అని అంటుంది. అయితే నన్ను మా ఇంటి నుండి దూరంగా ఉంచడానికి ఆమె ఇలా అంటోంది అని అర్థం చేసుకుంటుంది. అలాగే తన అన్నకు ఫోన్ చేసి రాఖీ పండుగ కోసం రప్పించి రాఖీ పట్టించుకోవాలని భావించి తల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తి తల్లి క్లాస్ పీకుతుంది రాత్రంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూడలేదు ఏమైపోయావు అని అడుగుతుంది. ఫోను సైలెంట్లో ఉందనే విషయం చెప్పి తాను నీ మాట తప్పాను అనే విషయం కూడా చెబుతుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దమయంతి నేను నీ కోసం ఎన్ని తంటాలు పడుతుంటే నువ్వు మాత్రం ఇలా చేస్తున్నావా ఇలా చేస్తే అతను ఇల్లరికం ఎప్పటికీ వస్తాడు అని భయపెడుతుంది.

   శిల్ప నట విశ్వరూపం

  శిల్ప నట విశ్వరూపం

  అయితే మనం శోభనం ఇక్కడ జరగదు అనుకున్నాం కానీ అసలు శోభనం జరగకూడదు అని అనుకోలేదు కదా మనకి నాని ఇల్లరికం రావడం ముఖ్యం కానీ శోభనం ఎక్కడ జరిగితే ఏంటి ? అన్నట్లు మాట్లాడుతుంది. మాట తప్పడం కాదు అని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నా అంటూ ఆమె కూతురి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎలా అయినా నానిని ఇల్లరికం తీసుకువచ్చే బాధ్యత తనది అని చెప్పిన శిల్పా ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి శిల్ప ఆ ఇంట్లో ఒక దానిగా కలిసిపోయినట్లు గా నటిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి సీత తన ఇద్దరు తోడికోడళ్లకు శిల్ప గురించి గొప్పగా చెబుతోంది. శిల్ప మాత్రం మరో నెల రోజుల్లో మీ ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేస్తాను అన్నట్లుగా మాట్లాడుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  కొత్త టెన్షన్

  కొత్త టెన్షన్

  ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా భారత్ షాపులో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో శిల్ప బంధువుని అని చెబుతూ ఒక వ్యక్తి వస్తాడు, నువ్వు భరత్ వి అని నాకు తెలుసు అని అంటే ఎలా తెలుసు అని అడుగుతాడు. తాను శిల్ప బంధువుని అని చెబుతూ తాను రైస్ డీలర్ ని కాబట్టి తన వద్ద కూడా బియ్యం వేయించుకోవాలని అడుగుతాడు. చాలా రోజుల నుంచి ఒకరి దగ్గర వాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మానేయడం కుదరదు అంటే మాటల్లో పెట్టి మాయ చేసి శిల్ప కు ఫోన్ చేయిస్తాడు. శిల్పతో మాట్లాడుతూ ఇలా మీ బంధువులు అంట కదా మన దగ్గర బియ్యం తీసుకోవచ్చా అని అడుగుతాడు భరత్, ఇది ఏదో మనకి కలిసి వచ్చేలా ఉందని చెబుతూ ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నాకు అతను ఎవరో తెలియదు కానీ గొంతు ఎక్కడో విన్నట్టుంది లోడు వేయించుకోవాలో లేదో అనేది మీ ఇష్టం నేనేమీ చెప్పలేను అని అంటుంది. అయితే భరత్ కు ఇంగ్లీషు రాకపోవడంతో ఓకే అనే మాట ఒక్క దాన్ని అర్థం చేసుకుని లోడ్ వేయించి కొంత డబ్బులు అడ్వాన్స్ గా కూడా ఇస్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తర్వాత ఎపిసోడ్ లో ప్లాస్టిక్ బియ్యం అని తేలడంతో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది.

  English summary
  Vadinamma Episode 638: Shilpa impresses Sita's family with an evil intention. Unaware of the consequences, Bharat takes a wrong step.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X