For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial Episode 640: ఏసీ కావాలన్న శిల్ప.. ఇరుక్కున్న భరత్, శిల్ప ఉచ్చులో చిక్కుకున్న ఫ్యామిలీ !

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 640వ ఎపిసోడ్ కి చేరింది. ఎట్టకేలకు శిల్పా నాని ఇంట్లోనే ఉంటుంది, నాని ఇంట్లో అందరితో మంచిది అని అనిపించుకునే ప్రయత్నం చేయడానికి ఆమె బాగానే నటిస్తోంది. ఇక ఎలా అయినా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టి వాళ్ళు విడి పోవడానికి కారణం అయ్యి తద్వారా తన భర్తను తన పుట్టింటికి తీసుకువెళ్లాలని ఆమె ప్లాన్లు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని ఆమె ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  రిషితో ఆడుకోవడానికి

  రిషితో ఆడుకోవడానికి

  సిరి స్నానానికి వెళుతూ తన కూతురికి అన్నం తినిపించడం అని సీతకు చెప్పి స్నానానికి వెళుతుంది, అయితే సిరి చెబుతున్న సమయంలో కుక్కర్ విజిల్ రావడంతో సిరి చెబుతున్న మాటలు ఏమీ సీత వినదు, అయితే సిరి చెబుతున్న మాటలు వెనక నిలబడి శిల్ప మాత్రం వింటుంది. ఇక సిరి మాటలు వినిపించుకోని సీత అక్కడే ఉన్న రిషితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో శిల్పా వంట గదిలోకి వెళ్లి అన్నం తీసుకుని వైదేహి కి తినిపిస్తాను అంటూ బయలుదేరుతుంది, ఇది చూసిన సీత ఎక్కడికి వెళుతున్నావు ఏం తీసుకు వెళుతున్నావు అంటే ఇలా వైదేహి ఏడుస్తోంది ఆకలి వేస్తోంది ఏమో అనే ఉద్దేశంతో ఆమెకు తినిపించడానికి వెళుతున్నాను అంటుంది.

  వైదేహి కంటే రిషి ఎక్కువ ఇష్టం

  వైదేహి కంటే రిషి ఎక్కువ ఇష్టం

  ఇవన్నీ నీకు ఎందుకు అంటే నిన్ను చూసి అన్ని పనులు నేర్చుకుంటున్నానని అంటుంది, అయితే నన్ను చూసి నేర్చుకుంటున్నావా లేకుంటే రేపు నీ పిల్లల కోసం ముందుగానే నేర్చుకుంటున్నావా అని ఆట పట్టిస్తుంది. అయితే లోపలికి అన్నం తీసుకు వెళ్ళిన శిల్పా అన్నం తినిపించకుండా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏడుపు వినిపించకుండా పాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సిరి ఏమైంది అని అడగగా తాను అన్నం తినిపిస్తుంటే తినడం లేదని అంటుంది, అదేంటి నేను సీతకు చెప్పాను కదా అంటే ఏమో బహుశా ఆమె వినిపించు కోలేదు ఏమో అని అందుకే నేను పెడుతున్నాను అని అంటుంది. అలా అంటూనే సీతకు వైదేహి కంటే రిషి ఎక్కువ ఇష్టం కదా అని అంటుంది. అంటే అదేమీ లేదని పేర్కొన్న సిరి సీతక్క దృష్టిలో అందరూ ఒకటేనని అందరూ ఆమె దృష్టిలో పిల్లలమేనని అలాంటి సీత ఇంట్లో మనం ఉండడం మన అదృష్టం అని అంటుంది. ఇలా అనేసి ఆమె బయటకు వెళ్లిపోతుంది

  అగ్గి రాజేయడం ఖాయం

  అగ్గి రాజేయడం ఖాయం

  ఇప్పుడైతే ఏమీ కాలేదు కానీ భవిష్యత్తులో మాత్రం అగ్గి రాజేయడం ఖాయం ఇప్పుడు అన్న మాటలు అన్నీ భవిష్యత్తులో పనికి వస్తాయి అని శిల్ప భావిస్తూ ఉంటుంది. మరో పక్క కాలు నొప్పి తో బాధ పడుతున్న పార్వతి దగ్గరికి దుర్గ పలకరింపు కోసం వెళుతుంది, ఎలా ఉంది కాలు అని అడగడంతో నొప్పిగానే ఉందని మనం వరలక్ష్మీ వ్రతం వెళ్లకుండా ఉండడానికి కాలు నొప్పి పట్టింది అని చెబితే ఆ మహిమగల దేవత నిజంగానే కాలు నొప్పి పుట్టేలా చేసింది అని అంటుంది. దీంతో దుర్గ కల్పించుకుని ఇంకా నయం నీకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అబద్దం చెప్పేవు కాదు, అలా చెబితే నిజంగానే వచ్చి పోయే దానివి అంటే అలా అన వద్దని పార్వతి అంటుంది. ఎంతైనా సీత చాలా పతివ్రత అని ఆమె చేసిన పూజ ఫలం వల్లే ఆ కుటుంబం ఇబ్బందులు లేకుండా నడుస్తోందని పార్వతి అంటే ఇదే మాట దమయంతి ముందు అనక పోయావా నీ కాళ్లు విరగ్గొడుతుంది అని దుర్గా అంటుంది.

   నిద్ర పట్ట లేదు

  నిద్ర పట్ట లేదు

  అమ్మో నిజమే అని ఆమె సైలెంట్ అవుతుంటే నువ్వు సీత ని పొగిడితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని దుర్గా అంటుంది. లేదు పొగడను లే అని పార్వతి వారిస్తుంది. మరో పక్క ఎలా అయినా కుటుంబంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా శిల్ప రాత్రి నిద్ర లేదు ఏసీలో పడుకోవడం అలవాటు అయిన తనకు ఇక్కడ నిద్ర పట్ట లేదు అని అంటుంది. దీంతో వెంటనే రఘురాం నీ గదికి ఏసీ పెట్టి ఇస్తామని అంటాడు అయితే ఇప్పుడు నాలుగు ఏసీలు ఎందుకు అంటే నాలుగు ఎందుకు నీకు గదికి ఒక్క దానికే పెడతాను అంటే తను ఒక్కతే ఏసీలో పడుకునే మీరందరూ ఏసీ లేకుండా ఉంటే నేను పడుకో గలవా అని ప్రశ్నిస్తుంది. అదేమీ లేదని డబ్బు సమకూరగానే అందరికి పెట్టిస్తానని రఘురాం అంటాడు. వెంటనే లక్ష్మణ్ కి ఫోన్ చేసి విషయం చెప్పి ఈరోజు వచ్చిన కలెక్షన్ డబ్బులతో ఏసీ పెట్టించాలని అంటారు. అయితే లక్ష్మణ్ కలెక్షన్ డబ్బుల కోసం చూడగా డబ్బులు అక్కడ కనిపించలేదు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   ఏసీ టెన్షన్

  ఏసీ టెన్షన్


  భరత్ వచ్చి తాను ఆ డబ్బులతో బియ్యం లోడు వేయించా అనే విషయం చెబుతాడు. చెప్పకుండా అలా ఎలా చేసావు ఇప్పుడు చూడు ఆ డబ్బుతో ఏసీ కొనమని చెప్పాడు, ఎలా అని అడుగుతాడు, దీంతో ఇప్పుడే చెప్పొద్దు అని కాసేపాగి వచ్చిన కలెక్షన్ తో కొందామని అంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. అయితే తర్వాతి ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం షాప్ వద్ద పెద్ద గొడవ జరిగినట్టు చూపారు, చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

  English summary
  Vadinamma Episode 640: Shilpa provokes Siri against Sita. On the other hand, Bharat lands in a fix when Laxman questions him about the missing money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X