For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : ప్లాస్టిక్ బియ్యం కలకలం.. చేతులెత్తి దణ్ణం పెట్టిన రఘురామ్.. సీతకు దొరికేసిన శిల్ప?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 642వ ఎపిసోడ్ కి చేరింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య పెళ్లి చేసుకున్న నాని శిల్పల శోభనం కూడా నాని ఇంట్లోనే పూర్తవుతుంది. అయితే నానిని ఇల్లరికం తీసుకువస్తానని తల్లికి మాట ఇచ్చిన శిల్పా ఆ విధంగా కుటుంబంలో గొడవలు పెట్టేందుకు కుటుంబం విడిపోయేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇక కూతురి సాయానికి దమయంతి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ తన మనిషి ఒక ప్లాస్టిక్ బియ్యం లోడు రఘురామ్ వాళ్ళ షాప్ లో దింపేలా చేస్తుంది. తర్వాత నువ్వు ఇక్కడ ఉండద్దు అని చెప్పి అతనికి డబ్బు ఇప్పించి ఊరు దాటిస్తుంది. ఇంతలో రఘురామ్ షాప్ వద్ద పెద్ద గొడవ జరుగుతుండడంతో లక్ష్మణ్ తన అన్నకి ఫోన్ చేసి చెబుతాడు. రఘురాం, భరత్ ను సైతం తీసుకుని షాపు వద్దకు వెళతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  షాప్ లో పెద్ద రభస

  షాప్ లో పెద్ద రభస

  ఎంతసేపటికి శిల్ప మీద ఉన్న నమ్మకంతో ఆ బియ్యం ప్లాస్టిక్ బియ్యం కాదు అని నమ్ముతూ ఉంటాడు భరత్, ఎందుకు అనవసరంగా వచ్చి గొడవ చేస్తున్నారు అనే ఉద్దేశంతో గొడవ చేస్తున్న వ్యక్తి కాలర్ పట్టుకుని కొడతాడు కూడా, అయితే రఘురాం చూసి అవి నిజంగానే ప్లాస్టిక్ బియ్యం అని ఖరారు చేసిన తర్వాత లక్ష్మణ్ కాస్త మెత్తబడ్డాడు. అయినా సరే ఇలా షాప్ మీదకు వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళ మీద రెచ్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రఘురామ్ వాళ్లను బతిమిలాడుకుని పంపించి వేసి అప్పుడు భరత్ మీద కోప్పడతాడు. ఇన్నేళ్ల వ్యాపారంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా ? ఎలాంటి బియ్యం కొంటున్నాము అనే విషయం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇలా చేసి నా కొంప ముంచుచావు, నువ్వు నా దగ్గర పని నేర్చుకున్నా అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. అంటూ ఇలా రకరకాల మాటలతో నిందిస్తాడు.

  బియ్యం వెనక్కు తెప్పించి

  బియ్యం వెనక్కు తెప్పించి

  వెంటనే లక్ష్మణ్ వంక చూసి ఎవరెవరికి బియ్యం మేము వారందరికీ మంచి బియ్యం ఇచ్చేసి ఈ బియ్యం వెనక్కి తీసుకు రమ్మని అంటాడు. మరో ఇద్దరికి మాత్రమే అమ్మామని అయితే అందులో ఒకటి పెళ్లి పార్టీ కాబట్టి వాళ్ళు మూడు బస్తాలు తీసుకువెళ్లారని అంటాడు, అయ్యో అని తల పట్టుకున్న రఘురాం వెంటనే శేటు దగ్గరికి వెళ్లి మంచి బియ్యం తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి ఆ బియ్యం బస్తాలు వెనక్కి తీసుకు రమ్మని రఘురాం అంటాడు.

   ఇంట్లో టెన్షన్ టెన్షన్

  ఇంట్లో టెన్షన్ టెన్షన్

  మరో పక్క ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది పొద్దుననగా వెళ్లారు ఇంతకీ విషయం తెలియలేదు అని అలా అనుకుంటూ ఉండగా భరత్ ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చాక కూడా ఎవరితో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. దీంతో అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసినా నోరు ఇప్పుడు వెంటనే సీత రఘురాం కి ఫోన్ చేసి ఏం జరిగింది అని అడగగా భరత్ చెప్పిన మాటలు అన్నీ చెబుతాడు. భరత్ ఇలా చేశాడని నాతొ శభాష్ అనిపించుకోవాలని ప్రయత్నం చేసి ఇలా కొంప మీదకు తీసుకు వచ్చాడు అని అంటాడు.

  అన్నం కూడా తినకుండా

  అన్నం కూడా తినకుండా

  ఇక ఆరోజు కుటుంబంలో ఎవరూ అన్నం తినరు, ఎవరికి వాళ్ళు నాకు ఆకలిగా లేదు నాకు ఆకలిగా లేదు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయి పడుకుంటారు. అయితే తెల్లవారిన తరువాత సిరి వెళ్లి భర్తతో మాట్లాడే ప్రయత్నం చేయగా అప్పుడు ఈ విషయాలన్నీ ఓపెన్ అవుతాడు భరత్. తాను ఏమీ సొంత నిర్ణయం తీసుకోలేదు అని శిల్ప తనకు తెలిసిన మనిషిని ఫోన్లో మాట్లాడితే నేను ఈ బియ్యం లోడు వేయించుకున్నాను అని చెబుతాడు. మరి ఇంత జరుగుతుంటే శిల్ప ఎందుకు నోరు మెదపలేదు అని ప్రశ్నిస్తుంది. నాకు కూడా అదే విషయం అర్థం కాలేదు అని అంటాడు. ఇదేమీ చిన్న విషయం కాదు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ చెప్పాల్సిన విషయం అని అంటుంది. విషయం చెప్పడానికి కిందకి వెళుతుంటే భరత్ తల్లి నిష్టూరంగా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు చేసిన పని కారణంగా ఇంట్లో ఎవరూ అన్నం తినలేని పరిస్థితి నెలకొందని అంటుంది.

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
  నా మాట వినడం లేదు

  నా మాట వినడం లేదు

  దీంతో ఒక్కడినే ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూ అసలు నా మాట ఎవ్వరూ వినడం లేదని అన్నయ్య కూడా నన్ను తిట్టడానికి చూస్తున్నారు తప్ప నేను చెబుతున్న మాట వినడం లేదని అంటాడు. ఆ విషయం చెబుతూనే శిల్ప తో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ బంధువులు అనే ఉద్దేశంతో ఈ లోడు వేయించానని భరత్ పేర్కొంటాడు. దీంతో మొత్తం మీద శిల్ప టార్గెట్ అయినట్లే కనిపిస్తోంది. కానీ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు, మరి తర్వాత ఎపిసోడ్ లొ శిల్ప వీళ్లందరికీ ఏమని సమాధానం చెబుతుంది ? తనకేమీ సంబంధం లేదని చేతులెత్తి వేయనుందా? అనేది చూడాల్సి ఉంది. అలాగే శిల్ప తల్లితో మాట్లాడుతున్నప్పుడు సీత ఎంటర్ కావడంతో శిల్ప చెబుతున్న మాటలన్నీ సీత వినట్లే కనిపిస్తోంది. దీంతో తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  Vadinamma Episode 642: Raghuram lashes out at Bharat for his irresponsible behaviour. On the other hand, Shilpa feels elated as her plan works out.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X