twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోగ్రాం ఆపమంటూ... టీవీ ఛానల్‌ స్టాఫ్ కిడ్నాప్‌

    By Srikanya
    |

    చెన్నై : టీవీ ఛానల్‌కు చెందిన ఏడుగురుని కిడ్నాప్‌ చేసినట్లు నగర పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించి నగరంలోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు చెందిన సీనియర్‌ అధికారి అశోకన్‌(56) నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌కు బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు.

    తమ ఛానల్‌లో పని చేసే వసంతన్‌, గోపి, నోబల్‌తోపాటు మొత్తం ఏడుగురుని మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు గుర్తు తెలియనివ్యక్తులు కిడ్నాప్‌ చేశారని పేర్కొన్నారు. నిందితులను గుర్తించి తమ సిబ్బందికి వారి చెర నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

    Vaimaye Vellum TV Programme staff Kidnapped

    అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తమ ఛానల్‌లో 'వాయ్‌మయే వెల్లుం' (నిజాయతీనే విజయం వరిస్తుంది) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా అత్యాచారానికి గురైన ఓ యువతి ఈ కార్యక్రమంలో పాల్గొని తనను ఈ స్థితికి తెచ్చిన వ్యక్తి గురించి చెప్పారన్నారు.

    ఆ కార్యక్రమం ప్రసారం సందర్భంగా ఓ ముఠా తమను బెదిరించిందని, వారే తమ సిబ్బందిని కిడ్నాప్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుని ధర్యాప్తు చేసి త్వరలోనే ఆ ఏడుగురుని విడిపిస్తామని పోలీస్ కమీషనర్ హామీ ఇచ్చారు. అలాగే ఏడుగురు కుటుంబాలు వారు కంగారు పడాల్సిన పనిలేదని,పోలీసులు త్వరలోనే ఈ కేసుని ఛేదిస్తారని ఆయన అన్నారు.

    English summary
    Anchored by Nirmala Periyasamy, Vaimaye Vellum program provides a platform for common people to share their problems and seek solution through meaningful discussion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X