Varsha-Immanuel: ఇమ్మూతో ప్రేమ.. క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ వర్ష..
Varsha-Immanuel: సినిమాలలో కొన్ని క్రేజీ జంటలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. అదే విధంగా బుల్లితెరపై కూడా కొన్ని జంటలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. వాటిలో ఒకటి సుధీర్-రష్మీ జంట అయితే, మరో క్రేజీ జంటగా ఇమాన్యుయేల్-వర్ష జంటనిలిచింది . జబర్దస్త్ షోలో వీరి కెమిస్ట్రీ, హాస్య టైమింగ్ ప్రేక్షకులను అలరించగా, ఆన్‌స్క్రీన్ లో వీరి లవ్ ట్రాక్‌ను చూసి నిజంగానే లవర్స్ అనుకునే స్థాయికి అభిమానులు వెళ్లిపోయారు. ఈ ఇదే విషయంపై జబర్దస్త్ వర్ష స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో జబర్థస్త్ ఇమ్మూతో ప్రేమ .. క్లారిటీ ఇచ్చారు యాంకర్ వర్ష. ఇంతకీ ఏమన్నారంటే?
సుధీర్-రష్మీ తరువాత ఇమ్మూ-వర్ష జంట స్టేజ్ మీదే పెళ్లి స్కిట్స్ తో పెద్ద హైలైట్ అయ్యారు. వీరి మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ చూసి చాలామంది నిజంగానే వీరు కపుల్ అనుకున్నారు. అయితే వర్ష మాత్రం ఎప్పటికప్పుడు "ఇమాన్యుయేల్ నా మంచి ఫ్రెండ్ మాత్రమే" అని స్పష్టం చేసింది. అయినా సోషల్ మీడియాలో వీరి రిలేషన్ గురించి రూమర్లు ఆగలేదు. కొందరు వీరి మధ్య తగాదాలు జరిగాయని, లవ్ బ్రేకప్ అయ్యిందని కూడా ప్రచారం చేశారు. కానీ అసలు విషయమేమంటే ఇవన్నీ షో రేటింగ్ పెంచడానికి చేసిన క్రియేటివ్ యాక్ట్స్ మాత్రమే అని చాలా మందికి తెలియదు.

ఇప్పటికీ వీరి అభిమానులు ఈ జంటను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వర్ష బయటికి వెళ్తే ఇమాన్యుయేల్ గురించి అడుగుతారట, ఇమాన్యుయేల్‌ను చూసినా వర్ష గురించే ప్రశ్నిస్తారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్షను యాంకర్ ఇదే విషయంపై ప్రశ్నించింది. అడిగిన ఆ ప్రశ్నకు వర్ష నవ్వుతూ చెప్పిన సమాధానం హైలైట్ అయింది. "చాలాసార్లు ఫ్యాన్స్ వచ్చి 'వదిన.. అన్న ఎక్కడ?' అని అడుగుతారు. నేనేమీ స్పందించకపోయినా వాళ్లు ఆగరు" అంటూ చెప్పుకొచ్చింది.
ఇదే అనుభవం ఇమాన్యుల్ కూడా చాలాసార్లు ఎదురైందని వర్ష చెప్పుకొచ్చింది. అనుభవాలను తమ స్కిట్ లలో కూడా చాలాసార్లు చూపించాం. అయితే రిలేషన్ షిప్ పై క్లారిటీ ప్రశ్నించగా.. తరువాత చెప్పా అని సరైన బదులు ఇవ్వకుండా ... సమాధానం దాటేసింది. అయితే ఇదంతా టీఆర్పీ కోసం జబర్దస్త్ టీం చేసిన స్టంట్ అని తెలుసు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం నిజంగానే వాళ్ళు లవర్స్ అని ఇప్పటికీ భావిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వర్ష టీవీ షోలు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ప్రోగ్రామ్‌లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీలో 'కిసిక్ టాక్' షో హోస్ట్‌గా వర్ష దూసుకెళ్తోంది. యంగ్ హీరోలు, కొత్త యాక్టర్స్ పాల్గొని తమ జీవిత అనుభవాలను పంచుకునే ఈ షోలో వర్ష గ్లామర్‌తో పాటు బోల్డ్ ప్రశ్నలతో టాక్ షోకు కొత్త హీట్ తెచ్చింది. ప్రతి ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఇమాన్యుయేల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొంటున్నారు. తన కామెడీ టైమింగ్‌తో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను కూడా నవ్విస్తున్నాడు. "బిగ్ బాస్‌కి కామెడీ టచ్ ఇస్తున్న ఏకైక కంటెస్టెంట్ ఇమాన్యుయేల్" అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రేక్షకుల ఓటింగ్‌లో టాప్ స్థానాల్లో దూసుకెళ్తున్న ఇమాన్యుయేల్ టాప్ 5లో స్థానం సంపాదిస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో ఉన్నారు. వర్షా, ఇమాన్యుయేల్ జంట పేరు మాత్రం బుల్లితెర అభిమానుల మనసులో ఇప్పటికీ క్రేజీగా నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications











