జారిపడి, తలకి దెబ్బ తగిలి... సూపర్ హిట్ సీరియల్స్ డైరక్టర్ మృతి

గంగ,వీర వంటి సీరియల్స్ తో నార్త్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన టీవీ సీరియల్ దర్శకుడు వశీమ్ సబీర్ మృతి చెందారు.

By Srikanya

ముంబై: గంగ,వీర వంటి సీరియల్స్ తో ఉత్తరాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వశీమ్ సబీర్ మృతి చెందారు. జనవరి 1, ఆదివారం నాడు...పడిపోవటంతో తలకు దెబ్బ తగిలింది. వెంటనే హాస్పటిల్ కు తీసుకు వెళ్లారు. మరుసటి రోజు సోమవారం నాడు మృతి చెందాడు. ఆయన డైరక్ట్ చేసిన సీరియల్స్ తెలుగుతో సహా చాలా భాషల్లోకి డబ్ అయ్యాయి.

ఆయన మృతికి టీవి ఇండస్ట్రీ అంతా నివాళులు అర్పించింది. ఆయన డైరక్ట్ చేసిన టీవి సీరియల్ లో నటించిన నటీ నటులు అంతా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియచేసారు. ఆయన చాలా ప్రతిభావంతుడుని, అంతటి టాలెంటెడ్ దర్శకుడుని టీవి ఇండస్ట్రీ కోల్పోవటం దురదృష్టమని వ్యాఖ్యానించారు.

Veera, Gangaa director Waseem Sabir dies of brain injury

ఆయన కేవలం టీవి సీరియల్స్ మాత్రమే కాకుండా తమన్నా, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్...ఏక్ బార్ ఫిర్ వంటి టీవి షోలు కూడా చేసారు. ఆయన చేసిన టీవి సీరియల్స్, షోలు సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు కోట్లు సంపాదించి పెట్టాయి.

డ్రామా బాగా పండించగలడని పేరున్న వశీమ్..సెట్ లో డైలాగులు చాలా భాగం రాసుకునేవారిని, అలాగే ఎడిటింగ్ టేబుల్ పై కూర్చూంటే నిముషాల్లో పని పూర్తయ్యేదని, అలా అన్ని రకాలుగా మల్టి టాలెంట్ ఉన్న వశీమ్ వంటి దర్శకులు ఇండస్ట్ర్రీలో అరుదని ఆయనతో పనిచేసిన నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X