»   » వీడియో: కమల్ హాసన్ తొలి టీవి కమర్షియల్ యాడ్ ఇదిగో

వీడియో: కమల్ హాసన్ తొలి టీవి కమర్షియల్ యాడ్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కమల్ అభిమానుల్లో ఈ మధ్య కాలంలో చర్చనీయాంసంగా మారిన యాడ్ వచ్చేసింది. కమల్ కెరీర్ లో తొలిసారిగా ఆయన ఓ యాడ్ లో నటించారు. ఆ యాడ్ ఇప్పుడు టీవిలో ప్రసారానికి సిద్దమైంది. నిముషం రెండు సెకన్లు సాగే ఈ యాడ్ లో కమల్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆ యాడ్ ని ఇక్కడ చూడండి.

ఆ యాడ్ మరేదో కాదు పోతీస్ యాడ్. పోతీస్ వారు తమిళనాడు లో అతి పెద్ద టెక్సటైల్, జ్యూయలరీ షో రూమ్స్ చైన్ కలిగి ఉన్నారు. ఈ యాడ్ లో కమల్ తన నిజ జీవిత పాత్ర అయిన కమల్ గానే కనిపించారు. యాభై ఏళ్లుగా తనను అభిమానిస్తూ వస్తున్న అభిమానులను ఉద్దేశించి, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యాడ్ సాగింది. ఈ యాడ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఎయిడ్స్ తో భాధ పడుతున్న చిన్నారులకు అంద చేయాలనే ఆయన చేస్తున్నట్లు సమాచారం.

కమల్‌ తాజా చిత్రం 'చీకటి రాజ్యం' విషయానికి వస్తే..

కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. గతంలో మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష.. మరోసారి ఈ సినిమాలో కమల్ కు జంటగా కనిపించబోతోంది. కిషోర్, సంపత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Video: Kamal Haasan's First TV Commercial!

ఈ చిత్రంలో కమల్ నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో వింగ్ కు చెందిన ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నార్కోటిక్స్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు తన కుమారుడుని కిడ్నాప్ చేస్తే ఎలా వారిని ఎదుర్కొని, వెనక్కి తెచ్చుకున్నాడనే కథాంశంతో నడుస్తుందని చెప్తున్నారు.

English summary
Kamal Haasan's first TVC is finally out. He is endorsing the brand 'Pothys' which is a chain of textile and jewellery showrooms in Tamil Nadu.
Please Wait while comments are loading...