»   » తమ్మారెడ్డితో సినీ ఆర్టిస్టుల మీటింగ్, ఆమెను పట్టుకునేందుకే!

తమ్మారెడ్డితో సినీ ఆర్టిస్టుల మీటింగ్, ఆమెను పట్టుకునేందుకే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijayarani assets siege
హైదరాబాద్: తెలుగు టీవీ నటి విజయరాణి దాదాపు 10 కోట్ల డబ్బుతో పరారైన సంగతి తెలిసిందే. ఆ డబ్బంతా ఆమె తన తోటి నటీనటుల నుండి చిట్టీల రూపంలో వసూలు చేసింది. ఈ పరిణామాలతో ఆమె వద్ద డబ్బు పోగేసుకున్న బాధితులంతా లబోదిబోమంటున్నారు.

విజయరాణిని పట్టుకునేందుకు పోలీసులు రెండు టీంలను రంగంలోకి దింపారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఆస్తులై హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, ఆమె సొంతూర్లోని వ్యవసాయ భూమి, ఇతర ఆస్తులు సీజ్ చేసారు. విజయారాణి ఎక్కడికి వెళ్లిందనే విషయమై తీవ్రంగా గాలింపు చర్యలు చేపటడుతున్నారు.

మరో వైపు విజయరాణి చేతిలో మోసపోయిన సినీ ఆర్టిస్టులంతా దర్శక నిర్మాత తమ్మారెడ్డితో సమావేశం అయ్యారు. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు మరింతగా చొరవ చూపేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

కాగా విజయరాణి తమిళనాడు ప్రాంతంలో మారు వేశంలో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన టీంలను పంపారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఆమె బంధువులు కూడా పరారు కావడంతో పక్కా పథకం ప్రకారమే విజయరాణి 10 కోట్లతో ఎస్కేప్ అయినట్లు స్పష్టమవుతోంది.

English summary
The police seized the assets of Battula Vijaya Rani, who allegedly duped to a tune of Rs.10 crore from junior artistes DCP Pala Raju rushed four police teams to nab her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu