నేను రెండోసారి ప్రెగ్నెంట్... కారణం తెలిసి భోరుమన్న మేఘన!
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు కొన్ని వేల సీరియళ్లు ప్రసారమై ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే గుర్తుండిపోయాయి. ఇలాంటి వాటిలో జెమినీ టీవీలో ప్రసారమైన చక్రవారం ధారావాహిక మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కించుకుంది. 2003 నవంబర్ 3 నుంచి 2008 ఫిబ్రవరి 15 వరకు ప్రసారమైన ఈ సీరియల్ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. తెలుగులో మొత్తం 1111 ఎపిసోడ్లు ప్రసారమైన చక్రవాకం సీరియల్ తర్వాత కన్నడ, మలయాళంలో డబ్బయి అక్కడి వారిని కూడా ఆకట్టుకుంది. 2016 జూలై 11 నుంచి జెమిని టీవీలో చక్రవాకం సీరియల్ పున: ప్రసారం చేస్తున్నారు. ఇందులో నటించిన నటీనటులు కూడా ఎంతో పేరు, గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సినిమాల్లోనూ బిజీ అయ్యారు. వీరిలో ఇంద్రనీల్ - మేఘన కూడా ఒకరు.
చక్రవాకం సీరియల్‌లో ప్రపోజ్
చక్రవాకం సీరియల్‌లో ఇంద్రనీల్‌కు అత్తగా నటించిన మేఘన... నిజ జీవితంలో అతనికి జీవిత భాగస్వామిగా మారింది. నిజానికి ఈ సీరియల్ కంటే ముందే కాలచక్రం అనే సీరియల్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే మేఘన వ్యక్తిత్వం నచ్చిన ఇంద్రనీల్ ధైర్యంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే ఇంద్రనీల్ తన కంటే 6 నెలలు చిన్నవాడు కావడంతో అతని ప్రేమను తిరస్కరించారు మేఘన. కానీ ఇంద్రనీల్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఆమె వెనుక తిరుగుతూనే ఉన్నాడు. ఏకంగా 9 సార్లకు పైగా మేఘనకు ఇంద్రనీల్ ప్రపోజ్ చేశారు. అతని కష్టం ఫలించి మేఘన ఓ రోజున ఐ టూ లవ్ యూ అని చెప్పేసింది. అయితే ఇక్కడే ఇంద్రనీల్ ట్విస్ట్ ఇచ్చాడు.. మా అమ్మని అడిగి చెబుతానని రెండ్రోజులు తర్వాత ఆమె ప్రేమను ఓకే చేశాడు.

పెళ్లై 20 ఏళ్లు
అంతా బాగానే ఉంది కానీ... ఇద్దరి మధ్యా వయసు తేడా కారణంగా మేఘన - ఇంద్రనీల్‌ల పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. అయితే చక్రవాకం సీరియల్ దర్శకుడు మంజులా నాయుడు.. రెండు కుటుంబాలతో మాట్లాడారు. అయినప్పటికీ ఇంద్రనీల్ తల్లి మాత్రం ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఇంద్రనీల్ - మేఘనలు తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లారు. అలా 2004 డిసెంబర్ 12న పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే దురదృష్టవశాత్తూ దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా వీరికి సంతానం కలగలేదు.
ఇంద్రనీల్- మేఘనలకు టార్చర్
దాంతో మేఘన, ఇంద్రనీల్‌లను ఇబ్బంది పెడుతూ కొందరు ఆన్‌లైన్‌లో మాట్లాడేవారు. వాటికి వీరిద్దరూ తమదైన శైలిలో ఆన్సర్ ఇచ్చేవారు. ఇది భగవంతుడి రాత... కాదనలేం... మా ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టమని, కానీ అలా జరిగిందని వీరిద్దరూ వాపోయారు. పిల్లలు లేకున్నా మేం బాగానే ఉన్నామని తెలిపారు. వీరు ఈ బాధను ఎంత మరిచిపోదామని అనుకున్నా.. కొందరు పదే పదే గుర్తుచేస్తూనే ఉన్నారు. తాజాగా బుల్లితెర నటి విష్ణుప్రియ.. మేఘనను ఏడిపించింది. ఈ వివరాల్లోకి వెళితే..
వర్ష పాడ్‌కాస్ట్‌లో విష్ణుప్రియ సందడి
జబర్దస్త్ ఫేమ్ వర్ష ఓ ఛానెల్‌లో కిస్సిక్ టాక్స్ అంటూ ఓ పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన విష్ణుప్రియను నీ కోసం నువ్వే ఓ గాసిప్ స్ప్రెడ్ చేయాలంటే ఏం చేస్తావని అడిగింది వర్ష. దాంతో నేను సెకండ్ టైమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది విష్ణు. అది గాసిప్ కాదు... రియలైపోయిద్దని వర్ష నవ్వేసింది. ప్రస్తుతానికి అదే గాసిప్ అని విష్ణు చెప్పగా... అయితే ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఫోన్ చేసి నేను సెకండ్ టైమ్ ప్రెగ్నెంట్ అనుకుంటా అని డౌట్‌గా ఎవరికైనా ఫ్రాంక్ కాల్ చేస్తే అసలు రియాక్షన్ ఏంటో చూడాలని ఉందని అంటుంది వర్ష.
ప్రెగ్నెంట్ అనగానే ఏడ్చేసిన మేఘన
దాంతో వెంటనే మేఘన అక్కకి ఫోన్ చేద్దామని అంటుంది విష్ణుప్రియ. ఆ కాసేపటికే మేఘనకు ఫోన్ చేసిన విష్ణు.. అక్కా నాకు సెకండ్ టైం కన్సీవ్ అయ్యానని డౌట్‌గా ఉందని చెబుతుంది. దాంతో మేఘన బోరుమని ఏడుస్తూ కంగ్రాట్స్ చెబుతుంది. ఆ మాటలకి విష్ణు, వర్షలు షాక్ అవుతారు. అక్కా నాకు డౌట్‌గానే ఉందని, నిజం కాదని విష్ణు అనడంతో అది నిజం కావాలని కోరుకుంటున్నానని ఏడుస్తూ చెబుతుంది మేఘన. దాంతో మేఘన అక్కా ఐం రియల్లీ సారీ వర్ష అంటుంది.
మేఘనకు విష్ణుప్రియ సారీ
అలాంటి విషయాలు మీతోనే కదా చెప్పగలను అని విష్ణు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మంచి విషయాలెప్పుడూ, మంచి మనుషులకే ఫస్ట్ చెప్పాలని అంటుంది వర్ష. మా మంచి కోరుకునే మంచి అక్క అని విష్ణు అనగా.. నేనేదో ఊహించుకున్నానని మేఘన అంటుంది. సారీ అక్కా ఈవినింగ్ కలుద్దామని అంటుంది విష్ణు. మీరు జస్ట్ సింపుల్‌గా సారీ చెప్పి తప్పించుకుంటున్నారని, కానీ ఇది అయిపోయిన తర్వాత నాకు బావ దగ్గరి నుంచి మహీ దగ్గరి నుంచి గ్రూప్‌లో మెసేజ్‌లు వస్తాయని అంటుంది విష్ణు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











