దుమ్మురేపుతున్న వైవా హర్ష.. ఆయన ‘ప్రిపరేషన్’ వైరల్

By Rajababu

Recommended Video

Viva Harsha latest comedy Episode-THE PREPARATION

చూడగానే ముఖంపై నవ్వు పుట్టించే వైవా హర్ష ప్రస్తుతం యూట్యూబ్‌లో సెన్సేషన్. ఆయన రూపొందించిన షార్ట్ ఫిలింస్ యూట్యూబ్‌లో టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి. ఓ షార్ట్ ఫిలింతో పరిచయమైన వైవా హర్ష అడపదడపా టెలివిజన్ కార్యక్రమాల్లో, సినిమాలలో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాడు. తాజాగా ఆయన రూపొందించిన ది ప్రిపరేషన్ అనే టైటిల్‌తో రూపొందించిన షార్ట్ ఫిలిం యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నది.

 వెబ్ సిరీస్‌గా ఫార్ట్ ఫిలింస్

వెబ్ సిరీస్‌గా ఫార్ట్ ఫిలింస్

గతంలో హర్ష పరీక్షల ప్రిపరేషన్, ఫలితాలు లాంటి కథాంశంతో పలు షార్ట్ ఫిలిం రూపొందించారు. తాజాగా వాటిని వెబ్ సిరీస్‌గా మార్చి అదే కథాంశంతో మళ్లీ ది ప్రిపరేషన్‌ అనే షార్ట్ ఫిలింతో ముందుకు వచ్చాడు. ఈ షార్ట్ ఫిలిం అతికొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

 10 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్

10 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్

ప్రస్తుతం యమా ట్రెండింగ్‌లో ఉన్న ది ప్రిపరేషన్ 10 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం గమనార్హం. ఈ వీడియోలో వైవా హర్ష లెక్చరర్ పాత్రను పోషించాడు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు. పరీక్షలను ఎదుర్కోవడానికి, వాటి నుంచి గట్టెక్కడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనే కథాంశంతో ఈ వీడియోను రూపొందించారు.

 ఆసక్తికరమైన అంశాలతో

ఆసక్తికరమైన అంశాలతో

ఈ వీడియోలో కొందరు విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టడానికి చిట్టీలు ప్రిపేర్ చేస్తుండగా, మరికొంత మంది పరీక్షలను పట్టించుకొకుండా క్రికెట్ చూడటం, మరికొందరు ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించడం లాంటి అంశాలను షూట్ చేశారు. అలాగే మరో విద్యార్థి ఏకంగా స్లిప్పుల కోసం జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి చిట్టీలను సిద్దం చేసుకోవడం భలే వినోదంగా ఉంది.

విద్యార్థులకు వైవా హర్ష ట్విస్టులు

విద్యార్థులకు వైవా హర్ష ట్విస్టులు

అలాంటి విద్యార్థులకు వైవా హర్ష ఎలాంటి ట్విస్టులు ఇచ్చాడు. విద్యార్థులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చాడు అనే అంశాలు ఆ వీడియోలో పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియోను వీక్షించిన వారు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అనేక రూపాల్లో కామెంట్లు పెడుతూ వైవా హర్షకు కితాబిస్తున్నారు.

 రేణుదేశాయ్‌తో నీతోనే డ్యాన్స్

రేణుదేశాయ్‌తో నీతోనే డ్యాన్స్

ఇలా షార్ట్ ఫిలింస్‌ను తీస్తూ, నటిస్తూ బిజీగా ఉంటూనే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న నీతోనే డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. వైవా హర్ష డ్యాన్సులకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X