మానస్, ప్రియాంకకు ఫస్ట్‌నైట్... మధ్యలో దూరిన వీజే సన్నీ! అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం డిజైన్ చేసిన బీబీ హోటల్ టాస్క్ సరదాగా సాగిపోతున్నది. వీజే సన్నీ ఫన్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అనీ మాస్టర్‌ను ఆటపట్టిస్తూ ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. నవంబర్ 11వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో మానస్, ప్రియాంక కోసం ఏర్పాటు చేసిన హానీమూన్ ఏర్పాట్లకు వీజే సన్నీ తూట్లు పొడిచాడు. తాజా ప్రోమోలో సన్నీ చేసిన హంగామా ఎలా ఉందో ఓసారి చూద్దాం.

హనీమూన్ కోసం బీబీ హోటల్‌కు

హనీమూన్ కోసం బీబీ హోటల్‌కు

బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా కొత్తగా పెళ్లి చేసుకొన్న జంటగా మానస్, ప్రియాంక బీబీ హోటల్‌లో హనీమూన్ జరుపుకొనేందుకు వచ్చారు. హోటల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అనీ మాస్టర్ కొత్త దంపతులకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. మీ ఇద్దరి కోసం పడకగదిని సుందరంగా ముస్తాబు చేశాం అంటూ అందంగా అలంకరించిన బెడ్ వద్దకు తీసుకెళ్లింది. అయితే మానస్, ప్రియాంక మధ్యలో పానకంలో బుడగ మాదిరిగా వీజే సన్నీ దూరాడు.

మానస్, ప్రియాంక ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు

మానస్, ప్రియాంక ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు

అనీ మాస్టర్ అలంకరించిన బెడ్ రూమ్‌లోకి ప్రియాంక, మానస్, వీజే సన్నీ వచ్చారు. పూలతో అందంగా లవ్ సింబల్ పెట్టి బెడ్‌ను ముస్తాబు చేశారు. అయితే ఆ బెడ్‌ను చూసిన ఠక్కున బెడ్ మీదకు వీజే సన్నీ దూకాడు. పూలతో అలంకరించిన బెడ్‌ను పాడు చేయడంతో ప్రియాంక బాధపడింది. సార్ మీరు అలా ఎందుకు చేస్తారు అంటూ వీజే సన్నీతో అనీ మాస్టర్ చెప్పుకొని బాధపడింది. అయితే తమ ఫస్ట్‌నైట్‌కు వీజే సన్నీ అడ్డంకిగా నిలవడంతో ప్రియాంక అక్కడి నుంచి బయటకు వెళ్తూ.. మీకు 200 టిప్ ఇద్దామని అనుకొన్నాను. ఇప్పుడు ఇవ్వడం లేదు అంటూ చెప్పింది.

అనీ మాస్టర్‌ను ఆటపట్టిస్తున్న వీజే సన్నీ

అనీ మాస్టర్‌ను ఆటపట్టిస్తున్న వీజే సన్నీ

హోటల్ మేనేజర్ అని మాస్టర్‌ను వీజే సన్నీ ఇక అంతటితో వేధించడం ఆపలేదు. మేనేజర్ అంటూ పిలిచాడు. దాంతో ఏంటి సార్ అంటూ అనీ మాస్టర్ దగ్గరకు వచ్చి.. చెప్పండి సార్.. అంటే.. ఏం లేదు.. నీవు ఇచ్చిన తిను పదార్థం బాగుంది అని చెప్పాలని అనుకొన్నాను అంటూ పంచ్ విసిరాడు.

మానస్‌తో వీజే సన్నీ గొడవ

మానస్‌తో వీజే సన్నీ గొడవ

ఇక మానస్, ప్రియాంక డైనింగ్ టేబుల్ వద్ద ఉంటే.. వీజే సన్నీ వెళ్లి గందరగోళం సృష్టించాడు. టేబుల్ వద్దకు వెళ్లి మానస్‌పై గ్లాస్‌తో నీళ్లు పోశాడు. దాంతో మానస్, వీజే సన్నీ మధ్య తోపులాట జరిగింది. వీజే సన్నీ తోయడంతో.. ఎందుకు తోస్తున్నావు అంటూ మానస్‌ గొడవ పడ్డాడు. నిన్ను ఎప్పుడు తోశాను అంటూ వీజే సన్నీ ఎదురు సమాధానం చెప్పాడు. దాంతో హోటల్ సిబ్బందిగా వ్యవహరిస్తున్న యాంకర్ రవి వచ్చి ఎందుకు సార్ గొడవ అంటూ జోక్యం చేసుకొన్నాడు.

హీరోయిన్‌తో వచ్చావని బిల్డప్ కొడుతున్నావా?

హీరోయిన్‌తో వచ్చావని బిల్డప్ కొడుతున్నావా?

అయితే మానస్, వీజే సన్నీ మధ్య గొడవ జరుగుతూనే ఉంది.. నీవు హీరోయిన్‌ను తీసుకొచ్చావని బిల్డప్ కొడుతున్నావా? నీవు ఏమైనా హీరోవా? అంటూ వీజే సన్నీ గట్టిగా దబాయించే ప్రయత్నం చేశాడు. అయితే ఏం మాట్లాడుతున్నావు.. ఏంటీ హీరోయిన్ అంటున్నావు అంటూ ప్రియాంక అంటే.. పక్కనే ఉన్న మానస్.. నీకు కాంప్లిమెంట్ ఇచ్చాడు కదా అనగానే వీజే సన్నీతోపాటు అక్కడ ఉన్న అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

కాజల్ డబ్బుల పంచాయితీ

ఇక డబ్బులు పోగొట్టుకొన్న ఆర్జే కాజల్ గొడవ పడింది. నా డబ్బుల లెక్క తేలే వరకు నేను ఎవరికి టిప్ ఇవ్వను అంటూ కామెంట్ చేసింది. హోటల్‌లోని ఐస్ క్రీమ్స్ దొంగతనం చేస్తూ.. సిరి, కాజల్ కనిపించారు. రిచ్ పీపుల్ అంటూనే ఇలా దొంగతనం చేయాల్సి వస్తున్నది అంటూ కాజల్ కామెట్ చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Vj Sunny One Man Show, మాస్ ఎంటర్టైనర్!! || Filmibeat Telugu
సార్ ఆ డోర్ తీస్తే మీరు బయటకే అంటూ షణ్ముఖ్

సార్ ఆ డోర్ తీస్తే మీరు బయటకే అంటూ షణ్ముఖ్

ఇదిలా ఉంటే.. కంటెస్టెంట్లు ఎలిమినేషన్ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లే మెయిన్ గేట్ వద్ద వీజే సన్నీ హంగామా చేశారు. ఎవరక్కడ అంటూ మెయిన్ గేట్ డోర్‌ను కొడుతూ కామెడీ చేశాడు. పక్కనే ఉన్న షణ్ముఖ్.. సార్ ఆ డోర్ తీస్తే మీరు ఇక బయటకే.. మీరు లోపల ఉండలేరు అంటూ షణ్మఖ్ చెప్పాడు. అయినా డోర్ కొట్టడంతో సార్.. కాస్త డోర్ తీస్తారా... సార్ బయటకు వెళ్తారట అంటూ షణ్ముఖ్ అంటూ కనిపించాడు. ఇంటిలో ఇంకా ఏం ఫన్ క్రియేట్ అయిందో పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ స్పష్టత రాదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X