»   »  ఈ రోజు సాయింత్రం ...'ఈటీవీ' లో హోరెత్తనున్న ఓరుగల్లు

ఈ రోజు సాయింత్రం ...'ఈటీవీ' లో హోరెత్తనున్న ఓరుగల్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రెండు నెలల క్రితం అంటే... డిసెంబరు 11, గురువారం సాయంత్రం... సుస్వరాలకు అభిషేకం చేస్తున్నట్టుగా వరంగల్‌ కేఎంసీ ప్రాంగణాన రాలిన చినుకులతో ఆహూతుల మది పరవశించింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇతర ప్రముఖ గాయనీగాయకులతో 'ఈటీవీ' ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించిన 'స్వరాభిషేకానికి' ఓరుగల్లు నగరి నీరాజనం పట్టింది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే ఈ రోజు( ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు 'ఈటీవీ'లో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎప్పుడా... ఎప్పుడాని ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నాడు ప్రత్యక్షంగా స్వరామృతాన్ని రుచి చూసిన వారు... వారు తమ అనుభూతులను చెప్పగా ఆ మాటలు వినిన వారు... జరిగిన కార్యక్రమాన్ని ఆరోజు కొద్దిసేపు ప్రత్యక్ష ప్రసారంగా తిలకించిన వారు... ఇలా ఎందరెందరో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గాయకులు ఆ రోజు అటు క్లాసు, ఇటు మాసు, ఇంకో వైపు యువత.. ఇలా అన్ని విధాలుగా ఆకట్టుకొనే పాటలతో హోరెత్తించారు. 'ఓరుగల్లుకే పిల్లా పిల్లా' అంటూ గాయకులు కారుణ్య, మాలతి పాటల ప్రవాహానికి తెరతీశారు.

Warangal special Swarabhishekam today

స్వరాభిషేకం ఓరుగల్లులో జరుగుతోంది కాబట్టి.. ఆ ప్రాంత ప్రత్యేకతను చాటుతూ అందుకొన్న ఈ పాటకి ఆవరణలోని వేలాది మందిలో ఉత్సాహం వచ్చింది. ప్రముఖ వ్యాఖ్యాత సుమ.. జనాల్లోకి వెళ్లి వారిని పలకరించి ఆకట్టుకొన్నారు. ఎస్పీ బాలు 'మోగింది వీణ' పాటని ఆలపించారు. టిప్పూ, సునీత ఆలపించిన 'గాల్లో తేలినట్టుందే' పాటకు యువత స్టెప్పులేసింది. ప్రముఖ గాయకుడు మనో ప్రత్యేక వేషధారణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాంకర్‌ సుమ.. సందర్భానుసారంగా చేసిన వ్యాఖ్యానం ప్రాంగణంలో సుమపరిమళాలు వెదజల్లింది.

వరంగల్‌ ముద్దు బిడ్డ, నటి సంగీతకు అంకితమిస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్పీ శైలజ పాడిన 'గోవులు పూసే గోవులు కాసే..' మెలోడీ పాటకు మరోసారి వరంగల్‌ వాసులు మైమరిచారు. వందేమాతరం శ్రీనివాస్‌ 'ఒసేయ్‌ రాములమ్మ' పాటకు ఓరుగల్లు స్ఫూర్తినిచ్చిందని పేర్కొంటూ ఆ పాటని ఆలపించారు. ఈ పాట పాడుతున్నంత సేపు గ్యాలరీల్లో మహిళలు లేచి నృత్యాలు చేశారు.

గాయకులు సుమంగళి, కారుణ్య, మాలతి, హరిణి, వడ్డేపల్లి శ్రీనివాస్‌ తమ పాటలతో హోరెత్తించారు. అనంతరం డీఐజీ మల్లారెడ్డి, ఐజీ కేశవనాయుడును, స్పాన్సర్లుగా ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, జీఎంఆర్‌ బృందావన్‌, ప్రశాంతి హాస్పిటల్‌, జయ గ్రూప్‌, శ్రీరామ సీడ్స్‌, అక్షర చిట్‌ఫండ్స్‌, ఇండియన్‌ ఏజెన్సీస్‌, సదరన్‌ ట్రావెల్స్‌, ఆర్డీ జూనియర్‌ కాలేజీ, మార్గదర్శి కంపెనీ వారిని గాయకుడు బాలు సన్మానించి జ్ఞాపికల్ని అందజేశారు.

English summary
Eetv's Super Hit programme Swarabhishekam today evening at 5.30 warangal special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu