Who Is Ayesha Zeenath? వైల్డ్ కార్డుతో బిగ్‌బాస్‌లోకి ఆయేషా.. కమల్‌ హాసన్‌కే షాకిచ్చిన ఫైర్ బ్రాండ్ ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోలో 2.0 వెర్షన్‌కు రంగం సిద్దమైంది. గత 5వారాలుగా కొనసాగుతున్న షో రసవత్తరంగా సాగుతున్నది. ఈ గేమ్ షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు, ఇంటిని రణరంగం చేసేందుకు భారీ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 5వ వారం ముగింపులో ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీలకు భారీగా ప్రారంభం చేస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ యాక్టర్లు, సినీ తారలు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా వచ్చేది ఎవరు? ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నారు? బిగ్‌బాస్ ప్లాన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఇప్పటికే 5 వారాల ఆట ముగిసింది. ఇంకా 7, 8 వారాల ఆటను రక్తి కట్టించేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా మరికొంత మందిని ఇంట్లోకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇంటి నుంచి 4 కంటెస్టెంట్లు బయటకు వెళ్లగా.. ఈ వారం చివర్లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇంటి నుంచి ఇద్దరిని సాగనంపేందుకు సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వారి స్థానంలో మరికొంత మందిని ఇంట్లోకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Ayesha Zeenath into Bigg Boss Telugu 9

బిగ్‌బాస్‌లో ఎప్పటిలానే 2.0 గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు తెరలేపారు. అక్టోబర్ 12వ తేదీన గ్రాండ్‌గా ఈవెంట్‌ను కొనసాగించనున్నారు. దాదాపు 2.30 గంటలు సాగే ఈవెంట్‌కు షూట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంటిలోకి తమిళ బిగ్‌బాస్‌ 6 షోలో పాల్గొన్న కంటెస్టెంట్, టీవీ నటి ఆయేషా జీనత్, గోల్కొండ హైస్కూల్, వినరా సోదర వీర కుమార చిత్రంలో నటించిన శ్రీనివాస్ సాయి, టీవీ నటుడు గౌరవ్ గుప్తా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లో రమ్య, పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న దివ్వెల మాధురి ఇంట్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అందం, అభినయం, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయేషా జీనత్ ఇంట్లోకి వస్తున్నారనే వార్త అందరిలోను ఆసక్తిని రేపింది. ఇంతకు ఎవరీ ఆయేషా అని నెటిజన్లు ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించారు. అయితే ఆయేషా తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ఊర్వశివో రాక్షసివో అనే సీరియల్‌లో కూడా లీడ్‌ రోల్‌లో కనిపించారు. ఇటీవల కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ టెలివిజన్ షోలో పాల్గొన్నారు.


ఆయేషా కెరీర్ విషయానికి వస్తే.. 2017 సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమైన రెడీ స్టడీ పో అనే గేమ్ షో ద్వారా వినోద రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మాయ అనే సీరియల్‌లో నటించారు. 2024 సంవత్సరంలో ఉప్పు పులి కారం, తార అనే చిత్రాల్లో నటించారు. కొన్ని షార్ట్ ఫిలింస్‌, మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా యాక్ట్ చేశారు. ప్రస్తుతం మోయి విరుందు, రాంబో చిత్రాల్లో నటిస్తున్నారు

అయితే 2023 సంవత్సరంల తమిళంలో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. దాదాపు 9 వారాలు ఇంటిలో కొనసాగారు. మొత్తం 63 రోజులపాటు ఇంటిలో ఉన్నారు. ఇంట్లో అత్యంత వివాదాస్పద కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. షోలో ఉన్నంత కాలం ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. అలాగే ఏకంగా హోస్ట్ కమల్ హాసన్‌‌తో గట్టిగా వాదనకు దిగడంతో సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్‌ అయ్యారు.

తమిళ బిగ్‌బాస్ సీజన్ 6లో హోస్ట్ కమల్ హాసన్‌ను ఆయేషా గట్టిగా ఎదురించారు. తనపై, తన ఆట తీరుపై కామెంట్స్ చేయడంపై గట్టిగానే ఎదురు దాడి చేశారు. నన్ను రాంగ్‌గా ప్రొజెక్ట్ చేయకండి. మీరు నా గురించి చెప్పేదంతా కరెక్ట్ కాదు అంటూ వాదనకు దిగారు. ఆ తర్వాత ఆమె గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరిగింది. కమల్‌తో వాదన జరిగిన తర్వాత వారమే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ లోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గేమ్‌ను మరింత రసవత్తరంగా మారుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X