»   » కపిల్ శర్మకు మరో షాక్.. సోనాక్షి సిన్హాతో సిద్ధూ..

కపిల్ శర్మకు మరో షాక్.. సోనాక్షి సిన్హాతో సిద్ధూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ది కపిల్‌శర్మ షో హోస్ట్ కపిల్ శర్మకు ప్రతీ వారం ఓ గండంగా మారుతున్నది. విమానంలో జరిగిన గొడవ కారణంగా సునీల్ గ్రోవర్ ఈ షో నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ గొడవ మరిచిపోకముందే కపిల్‌కు షోలో గెస్ట్, క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ రూపంలో మరో షాక్ తగిలింది. తనపై అభ్యంతరకరంగా జోకులు పేల్చడంపై ఆగ్రహించిన సిద్దూ గతవారం షూటింగ్ హాజరుకాకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

బూతు జోకులకు సిద్ధూ హర్ట్

బూతు జోకులకు సిద్ధూ హర్ట్

ఇటీవల పరిణితి చోప్రా, అయుష్మాన్ ఖురానా ఇద్దరు తమ సినిమా ప్రమోషన్ కోసం కపిల్‌శర్మ షోకు వచ్చారు. ఈ సందర్బంగా వారు చాలా దారుణమైన జోక్ పేల్చడంతో సిద్దూ చాలా హర్ట్ అయినట్టు సమాచారం. ఆ కారణంగానే షో కు సంబంధించిన షూటింగ్ హాజరుకాలేదని తెలుస్తున్నది.

కపిల్ శర్మ షోకు డుమ్మా

కపిల్ శర్మ షోకు డుమ్మా

మరుసటి వారం కోసం బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హాతో జరుగాల్సిన షూటింగ్ ఎలాంటి సమాచారం లేకుండా హాజరుకాలేదని కపిల్ టీంకు సంబంధించిన సభ్యులు వెల్లడించారు. పంజాబ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ది కపిల్ శర్మ షో కోసం సమయం కేటాయించడం కష్టంగా మారిందనే మాట వినిపిస్తున్నది. ముంబైకి రాకపోకలు సాగించడానికి చాలా కష్టంగా మారినట్టు పలు సందర్బాల్లో సిద్దూ పేర్కొన్నట్టు సమాచారం.

షో వల్ల నష్టం జరుగుతుందా...

షో వల్ల నష్టం జరుగుతుందా...

సిద్దూకి రాజకీయ కారణాలు ఒక కారణం కాగా, మరో కారణం కపిల్ శర్మ ప్రవర్తన, షో నడిపే తీరు వల్ల తన హోదాపై, రాజకీయంగా నష్టం కలిగే ముప్పు ఉందనే భావనలో సిద్ధూ ఉన్నాడట. ఒకవేళ సిద్దూ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లయితే ది కపిల్ శర్మ షోకు పెద్ద సమస్యే రావొచ్చనేది కొందరి వాదన.

టీఆర్పీ పెంచాలి.. సోని డెడ్‌లైన్

టీఆర్పీ పెంచాలి.. సోని డెడ్‌లైన్

సునీల్ గ్రోవర్, ఇతర సభ్యులు ఈ షో నుంచి తప్పుకోవడం వల్ల సోని టెలివిజన్ రేటింగ్ దారుణంగా పడిపోయినట్టు వార్తలు వచ్చాయి. టీఆర్పీని దృష్టిలో పెట్టుకొని కపిల్‌కు సోని చిన్నపాటి హెచ్చరిక కూడా ఇచ్చినట్టు తెలిసింది. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొంటునందున షోను సరైన రీతిలో నడిపించాలని, ఒకవేళ టీఆర్పీలు పెరుగకపోతే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడానికైనా వెనుకాడమని కపిల్‌కు సోని యాజమాన్యం స్పష్టం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.

English summary
Kapil Sharma’s show is getting into a bigger mess with each passing week. Last weekend moderator Navjot Singh Sidhu was seen getting risque in his humour making Kapil squirm and reprimand Paaji for being naughty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu