»   » బిగ్‌బాస్ పార్టిసిపెంట్లలో ‘క్లాస్ట్రోఫోబియా’ లక్షణాలు!?, సంపూ సీక్రేట్ రూం లో ఉన్నాడా??

బిగ్‌బాస్ పార్టిసిపెంట్లలో ‘క్లాస్ట్రోఫోబియా’ లక్షణాలు!?, సంపూ సీక్రేట్ రూం లో ఉన్నాడా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో బ్రహ్మండంగా ప్రారంభమైంది. తొలిసారి ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్‌గా కనిపిస్తూ చేస్తున్న కార్యక్రమానికి మంచి స్పందనే వచ్చింది. తొలి రోజు ఎపిసోడ్స్‌లో సెలబ్రిటీల పరిచయం మొదలైన దగ్గరినుంచే నెమ్మదిగా ఈ షో మీద ఉన్న హైప్ తగ్గటం మొదలయ్యింది.

క్లాస్ట్రోఫోబియా

క్లాస్ట్రోఫోబియా

టీవీ నటుడు సమీర్, ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్, కమెడియన్‌ ధన్‌రాజ్‌ తదితరులు పాల్గొంటున్న ఈ షోలో సభ్యులను ‘క్లాస్ట్రోఫోబియా' బాధిస్తున్నదని తెలియవస్తోంది. కిటికీలు లేని గదుల్లో, లిఫ్ట్‌లలో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా' అంటారు.

Bigg Boss Telugu: Sampoornesh Babu Cries For Elimination
ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరి పోయింది

ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరి పోయింది

ప్రస్తుతం నటుడు సంపూర్ణేశ్‌ బాబు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ‘క్లాస్ట్రోఫోబియా' భావనతో బాధపడుతున్నాడు. ‘నాది పల్లెటూరి నేపథ్యం. ఇక్కడ నన్ను బంధించేసినట్టుగా ఉంది. నన్ను పంపించేయండి' అని మొన్నటి నుంచీ అతడు బిగ్‌బాస్‌ షోలో ప్రాధేయ పడుతున్నాడు. ఇక నిన్న మాత్రం సంపూ కోపం, ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరి పోయింది. ఒక్క సారి బరస్ట్ అయిపోయాడు.

పూర్తిగా డీలాపడిపోయాడు

పూర్తిగా డీలాపడిపోయాడు

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన మరుసటి రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా డీలాపడిపోయాడు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నాడు. ఓసారి ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని, మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆందోళన పడ్డాడు.

నన్ను ఇంటికి పంపించండి

నన్ను ఇంటికి పంపించండి

దీంతో 'బిగ్ బాస్'గారు నన్ను ఇంటికి పంపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేసుకున్నాడు. షోలో మరో సభ్యుడు ధన్‌రాజ్ చొరవ తీసుకుని . టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పి కూర్చోబెట్టాడు. ఒకవేళ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్‌లో సంపూ పేరు వచ్చేలా చేస్తామన్నారు.

హౌస్ నుంచి వచ్చేశాడు

హౌస్ నుంచి వచ్చేశాడు

తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్‌కు 'బిగ్ బాస్' హామీ ఇవ్వడంతో కాస్త కంట్రోల్ అయినట్టే కనిపించినా ఆ నిన్న మాత్రం మామూలుగా కాదు ఒక రేంజిలో రియాక్టయ్యాడు. బిగ్‌బాస్‌ను ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు బిగ్ బాష్ షోకు ఓ నమస్కారం అంటూ.. ఈ షోలో తాను వుండలేనని హౌస్ నుంచి వచ్చేశాడు.

సీక్రెట్ రూమ్‌లో

సీక్రెట్ రూమ్‌లో

పల్లె నుంచి వచ్చిన తాను ఒకే ఇంట్లో నాలుగు గోడల మధ్య జీవించలేకపోతున్నానని సంపూర్ణేష్ తెలిపాడు. అయితే నీ ఇష్టప్రకారమే ఈ షోలోకి వచ్చావని బిగ్ బాస్ సర్థి చెప్పినా, సంపూర్ణేష్ బాబు పట్టించుకోలేదు. దీంతో సంపూర్ణేష్ బాబును బయటకు వచ్చేయమని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే సంపూ బయటకు వచ్చాడా? లేదా అన్నది పూర్తిగా తెలియదు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ షోలో సీక్రెట్ రూమ్‌లో కొంత మందిని ఉంచి తరువాత మళ్లీ షోకు పంపిన సంగతి తెలిసిందే.

English summary
On Thuesday ninth episode of Bigg Boss Telugu aired and revealed the Burning Star Sampoornesh Babu’s violent behaviour and he Eliminated Himself From Bigg Boss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu