Just In
- 9 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్ విజేత అభిజిత్.. తెరపైకి కొత్త సెంటిమెంట్.. కౌశల్ మండా మాదిరిగానే..
సినీ పరిశ్రమలోను, టెలివిజన్ రంగంలోనూ సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. అయితే వాటిని సెలబ్రిటీలు బలంగా నమ్ముతుండటం తెలిసిందే. అయితే బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగింపుకు చేరువవుతున్న నేపథ్యంలో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. అయితే కొందరు ఈ సారి అభిజిత్ విజేత అంటూ ఓ నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ సంఘటనను గుర్తు చేస్తున్నారు. అదేమిటంటే..

11 వారాల్లో 9 సార్లు నామినేట్
బిగ్‌బాస్ తెలుగు 4 షో విషయానికి వస్తే.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ ప్రస్తుతం హౌజ్‌లో బలమైన కంటెస్టెంట్‌గా కనిపిస్తున్నారు. మొత్తం 11 వారాల నామినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 9 సార్లు నామినేట్ అయి ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. ప్రేక్షకుల చేత భారీ ఓట్లు, ట్వీట్లు రాబడుతున్నారు.

అభిజిత్ వైపే మొగ్గు
ఇప్పటికే సినీ వర్గాలు, ఇతర సెలబ్రిటీలు బిగ్‌బాస్ విజేత అభిజిత్ అనే అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా వెల్లడిస్తున్నారు. ఈ సారి అంతా సవ్యంగా సాగితే అభిజిత్ టైటిల్ గెలుచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు అభిజిత్‌కు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ మండాకు
అయితే ఈ సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్‌లో కౌశల్ మండాకు ఎదురైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి షోలో కౌశల్ ఇంటిలో బలమైన కంటెస్టెంట్‌గా కొనసాగాడు. ఆ సమయంలో ఇంటిలోకి వచ్చిన తనీష్ సోదరుడు కౌశల్ మండాను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆయనను కించపరిచే విధంగా, బాధపట్టే విధంగా ప్రవర్తించాడు. ఆ సీజన్‌లో కౌశల్ విజేతగా నిలవడం తెలిసిందే.

అభిజిత్‌పై మోనాల్ సోదరి కామెంట్స్
ఇక ప్రస్తుత సీజన్‌లో అభిజిత్ ఒక బలమైన కంటెస్టెంట్‌గా ఆరంభం నుంచి కనిపిస్తున్నాడు. ఇటీవల ఇంటి సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌ను సందర్శించిన సమయంలో కౌశల్ మండాకు ఎదురైన సన్నివేశం అభిజిత్‌కు కూడా ఎదురైంది. ఇంటిలోకి వచ్చిన మోనాల్ సోదరి హిమాలీ కూడా అభిజిత్‌ను కించపరిచే విధంగా కామెంట్ చేసింది. ఏదైనా ఉంటే ముందే మాట్లాడు.. వెనుక మాట్లాడకు అంటూ కామెంట్ చేసింది. మోనాల్‌ను అభిజిత్ ఒంటెతో పోల్చడాన్ని ఉద్దేశించి హిమాలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

కొత్తగా సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి..
అప్పుడు కౌశల్ మండా విజేతగా నిలిచినట్టే.. అభిజిత్ విజేతగా నిలుస్తాడని హిమాలీ, తనీష్ సోదరుడి విషయాలను సెంటిమెంట్‌గా మారుస్తున్నారు. ఈ సెంటి మెంట్ వాస్తవ రూపం దాల్చి అభిజిత్ విజేత అవుతాడా? లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది. 15వారాల సీజన్‌లో ప్రస్తుతం 12వ వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.