»   » బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ గుడ్‌బై?.. యంగ్ టైగర్‌కు లీకుల భయం.. అందుకే రిజెక్ట్

బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ గుడ్‌బై?.. యంగ్ టైగర్‌కు లీకుల భయం.. అందుకే రిజెక్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr.Ntr Rejecting Bigg Boss Season 2 Offer బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ గుడ్‌బై ?

తెలుగులో తొలి రియాల్టీ షో బిగ్‌బాస్ షోను జూనియర్ ఎన్టీఆర్ ఉర్రూతలూగించాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో బిగ్‌బాస్ మరోస్థాయికి వెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా టీఆర్సీ రేటింగ్ నమోదైంది. 70 రోజులుపాటు సాగిన తొలి సీజన్‌లో శివబాలాజీ విన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్1 సక్సెస్ అందించిన ప్రోత్సాహంతో బిగ్‌బాస్2 రంగం సిద్ధమవుతున్నది. అయితే బిగ్‌బాస్2కు హోస్ట్‌గా వ్యవహరిస్తానో లేదో అంటూ ఇటీవల జై లవకుశ ప్రమోషన్ సందర్భంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. అందుకు బలంగా ఫిలింనగర్‌లో ఓ వార్త ప్రచారం అవుతున్నది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..

రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్

రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్

బిగ్‌బాస్2 ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం వెనుక ఎన్టీఆర్‌కు వ్యక్తిగత కారణాలు ఉన్నట్టు సమాచారం. యంగ్ టైగర్‌తో స్టార్ మా జరిపిన చర్చలు విఫలమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానీని బిగ్ బాస్' సీజన్ 2 ని హోస్ట్ చేయించాలని నిర్వాహకులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది.

విదేశాలకు యంగ్ టైగర్

విదేశాలకు యంగ్ టైగర్

బిగ్‌బాస్‌ షోను ఎన్టీఆర్ వదులుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అని ప్రధానంగా వినిపిస్తున్నది. ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించనున్నారట. బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లుక్ లీక్ అవుతుందనే మెయిన్ రీజన్. ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడానికి యంగ్ టైగర్ విదేశాలకు కూడా వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 త్రివిక్రమ్‌కే పూర్థి సమయం

త్రివిక్రమ్‌కే పూర్థి సమయం

త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్‌కు ప్రయోగం లాంటిందేనట. అందుకే తనకు పేరు, ప్రతిష్ఠను తెచ్చిన బిగ్‌బాస్‌ను వదులుకొంటున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా కోసం పూర్థిస్థాయి సమయాన్ని కేటాయించాలను కొంటున్నాడట.

 మరో స్టార్ ఎంపిక కోసం

మరో స్టార్ ఎంపిక కోసం

ఇలాంటి కారణాలను దృష్టిలో పెట్టుకొని బిగ్‌బాస్ షోకు ఎన్టీఆర్ నో చెప్పినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎన్టీఆర్ స్థానంలో మరో స్టార్‌ను ఎంపిక చేసిన తర్వాతనే ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా వెల్లడిస్తారట.

నేచురల్ స్టార్ గ్రీన్ సిగ్నల్..

నేచురల్ స్టార్ గ్రీన్ సిగ్నల్..

ఎన్టీఆర్ స్ధానంలో మరో హీరోను ఎంపిక చేసేందుకు తెలుగులో పలువురు హీరోల పేర్లను పరిశీలించగా నానీ పేరు ప్రధానంగా చర్చకు వచ్చిందట. న్యాచురల్ స్టార్ నాని తో 'బిగ్ బాస్' సీజన్2 ని హోస్ట్ చేయించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఈ షో నానీ హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనే కాలమే సమాధనం చెబుతుంది.

English summary
NTR's Telugu Bigg Boss reality show is grand success in Telugu Televison history. After First season, arrangements are in progress for Bigg Boss2. But NTR not interest to host second season. In place of NTR, Naani name in consideration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu