»   » హీరోయిన్లు బికినీలు ధరిస్తే తప్పకాదు.. నేను మిడ్డీ వస్తే తప్పా.. యాంకర్ రష్మీ

హీరోయిన్లు బికినీలు ధరిస్తే తప్పకాదు.. నేను మిడ్డీ వస్తే తప్పా.. యాంకర్ రష్మీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని టాప్ యాంకర్ల రష్మీ ఒకరు. ఆమె యాంకర్‌గా వ్యవహరించే ప్రొగ్రామ్స్‌కు మంచి రేటింగ్ ఉంటాయి. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో మంచి ఊపు మీద ఉన్నది. అడల్ట్ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్ ధీటుగా రష్మీపై రూమర్లు కూడా ఎక్కువే. తోటి యాక్టర్ అఫైర్ ఉన్నట్టు ప్రస్తుతం జోరుగా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. టీవీ ప్రొగ్రాంలలో ఆమె ధరించే దుస్తులపై అభ్యంతరం వ్యక్తమవుతుంటుంది. సకుటుంబ సమేతంగా రష్మీ కార్యక్రమాలను చూడటం ఇబ్బంది అనే వాదన కూడా ఉంది. తన డ్రెస్సింగ్స్‌పై చేసిన కొన్ని కామెంట్లపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించింది.

అందాల ఆరబోస్తే..

అందాల ఆరబోస్తే..

ఇటీవల తన దుస్తుల గురించి అడిగిన ప్రశ్నపై రష్మీ మండిపడింది. హీరోయిన్లు బికినీలు ధరిస్తే తప్పుకాదు. వారు అందాలు ఆరబోస్తే పట్టించుకోరు. యాంకర్లు మిడ్డీలు, మినీలు, షార్ట్స్ వేసుకొంటే తప్పా అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెండితెరమీద హీరోయిన్లు బట్టలు విప్పి ఆడితే లొట్టలు వేసుకొంటూ చూస్తారు. బుల్లితెర మీద మిడ్డీలు వేసుకొంటే తప్పుపడుతారా అని విరుచుకుపడింది.

ఐటెంలలో హాట్‌హాట్‌గా..

ఐటెంలలో హాట్‌హాట్‌గా..

టెలివిజన్ తెరమీద దుమ్ము రేపుతూనే సినీ పరిశ్రమలో అవకాశాలపై కూడా కన్నేసింది. గుంటూరు టాకీస్ లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన చారుశీల, అంతం, బలపం పట్టి భామ ఒడిలో, తను వచ్చెనంట అనే చిత్రాల్లో ఆమె పోషించిన గ్లామర్ పాత్రలకు మంచి పేరు వచ్చింది. బస్తీలో రష్మీ చేసిన ఐటం సాంగ్ కేక పుట్టించింది.

దుమ్ము రేపిన ఫొటోషూట్

దుమ్ము రేపిన ఫొటోషూట్

ఇటీవల రష్మీ చేసిన ఓ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆమె అందాల ఆరబోత ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. టెలివిజన్ స్క్రీన్ మీద రష్మీ డ్రెస్సులు, లుక్స్ హాట్‌హాట్‌గా ఉంటాయన్నది తెలిసిందే. సినిమా అవకాశాల కోసమే హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేశారనే కొందరి వాదన.

యూట్యూబ్‌లో ఐటంసాంగ్ హవా..

యూట్యూబ్‌లో ఐటంసాంగ్ హవా..

గుంటూరు టాకీస్ చిత్రంలో ఆమె నటించిన నీ సొంతం పాట యూట్యూబ్‌లోనూ వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో ఆ పాటను మూడు కోట్లకు మందికి పైగా చూడటం విశేషం. ఆ పాటలో ఆమెను చూసిన వాళ్లు మరో సన్నిలియోన్ అని వ్యాఖ్యానించడం తెలిసిందే.

డిమాండ్ ఉంది.. అందుకే నటిస్తున్నా..

డిమాండ్ ఉంది.. అందుకే నటిస్తున్నా..

గుంటూరు టాకీస్ చిత్రంలోని ఐటం పాటపై స్పందిస్తూ.. సిల్వర్ స్క్రీన్ మీద నాకు డిమాండ్ ఉంది. అందుకే నటించాను. నేను అలా కనిపిస్తే చూసే వాళ్లున్నప్పుడు ఎందుకు నేను ఎందుకు చేయకూడదు. యూట్యూబ్‌లో అశ్లీలమైన వీడియోలు ఎన్నో ఉన్నాయి. వాటిని అందరూ చూస్తున్నారా.. రష్మీకి డిమాండ్ ఉంది కాబట్టే చూస్తున్నారు అని రష్మీ వివరణ ఇచ్చారు.

English summary
Anchor, Actress Rashmi Gautam is talk of the Industry. These days her dressing spree is become contraversial. She said It’s like a demand and supply chain, as people are watching and adding to its viewership. It’s not a vulgar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu