»   » ఈ రోజు నుంచే 'ఈటీవీ'- 'వావ్‌2' ..డిటేల్స్

ఈ రోజు నుంచే 'ఈటీవీ'- 'వావ్‌2' ..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Wow 2 on Tuesday 19th November on Eenadu TV
హైదరాబాద్ : 'ఈటీవీ'లో ప్రసారమైన 'వావ్‌' కార్యక్రమం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయికుమార్‌ వ్యాఖ్యానంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన రియాల్టి షో 'వావ్‌'. ఇప్పుడు ఈ పోగ్రాం 'వావ్‌2'గా మారి నేటి నుంచి ప్రతి మంగళ వారం 'ఈటీవీ'లో ప్రసారమవుతుంది. కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందించేలా ఉండాలని ఈటీవీ, సోనోపిక్స్‌ సంస్థలు దీన్ని తీర్చిదిద్దాయి. ప్రైజ్‌మనీని కూడా రూ.9 లక్షలకు పెంచారు. ప్రతి మంగళవారం రాత్రి 9.30కి ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతుంది.


ఈ పోగ్రాం గురించి సాయికుమార్ మాట్లాడుతూ...'వావ్‌'... మాంఛి కిక్‌ ఇచ్చే గేమ్‌ షో. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించినప్పుడు నాకు కలిగిన అనుభూతి కూడా ఇదే. 'వావ్‌' ఫార్మేట్‌, రౌండ్లు చాలా ప్రాచుర్యం పొందాయి. దాన్ని మార్చడం మాకు ఇష్టం లేదు. అయితే రెండో రౌండ్‌గా పకడో పకడో అనే బాల్‌గేమ్‌ పెట్టాం. 'వావ్‌'కి వచ్చినవాళ్లు కాసింత నవ్వుకొని... బోలెడు జ్ఞానం... బహుమతులతో బయటకి వెళ్లాలి. ఈసారి కొత్తకొత్త ప్రశ్నలు, ప్రశ్న సమయంలో నేపథ్యాల వివరణ అందిస్తున్నాం అన్నారు.


అలాగే సీక్వెల్‌ అంటే ఎప్పుడూ బాధ్యత మరింత పెరుగుతుంది. అది సినిమా అయినా... టీవీ కార్యక్రమం అయినా ఒకటే. మొదటి 'వావ్‌'లో 160 ఎపిసోడ్‌లు చేశాం. కార్యక్రమాన్ని నిలిపివేసిన తర్వాత ఓ సినిమా కోసం వేచి చూసినట్లు 'వావ్‌-2' కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. సినిమాగానీ, వ్యాఖ్యానంగానీ ఎక్కడైనా అమితాబ్‌ బచ్చన్‌గారే ఆదర్శం. 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' లాంటి కార్యక్రమాలు చూసి చాలా మంది ఆయన కాకపోతే అలాంటివి నువ్వే చేయాలి అన్నారు. అంతగా నాకూ పేరొచ్చింది. ఇదంతా ఈటీవీ 'వావ్‌' వల్లే.


ఇక సాయికుమార్‌ చాలా గంభీరంగా ఉంటాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయగలడా అని తొలిరోజు అందరూ అనుకున్నారు. కానీ నా మీద ఈటీవీ, సోనోపిక్స్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేశాను. రెండో భాగం తొలి రోజు చేస్తున్నప్పుడు కూడా తొలి ఎపిసోడ్‌ అనుభవమే. అదే ఉత్సాహం.. ఆనందం... అదే కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే కోరిక. సమాజం మీద సినిమా, టీవీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నాణ్యత, సంస్కారం విషయంలో 'ఈటీవీ', 'సోనోపిక్స్‌' చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

English summary

 Wow 2 on Tuesday 19th November on Eenadu TV. Sai Kumar hosting this Show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu