»   » అఖిల్ ..శాడిస్ట్ అట, ఆయన శాడిజం ఏమిటో వాళ్లకే తెలసట!

అఖిల్ ..శాడిస్ట్ అట, ఆయన శాడిజం ఏమిటో వాళ్లకే తెలసట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అఖిల్ ..శాడిస్టా...ఏమో ...మరి...అందులో ఎంత వరకూ నిజముందో కానీ..అతనే స్వయంగా నేను శాడిస్టు అని చెప్పుకోవటంలో నమ్మక తప్పటం లేదు అంటున్నారు. ఇంతకీ ఎప్పుడు ఈ విషయం అఖిల్ చెప్పాడు..అంటారా..రీసెంట్ గా యాంకర్ అనసూయ హోస్ట్ చేసిన ఓ టాక్ షోలో ఈ విషయాలు బయిటపడ్డాయి. ఆ టాక్ షో పేరు ఎ డేట్ విత్ అనసూయ.

యాంకర్ అనసూయ ఈ టాక్ షోను అద్బుతంగా నిర్వహించాలని ఫిక్సై, రకరకాల ప్రశ్నలతో షోకు తొలి గెస్ట్ అయిన అఖిల్ పై దాడి చేసింది. అన్నిటికి సరదాగా నవ్వుతూ, నాటిగా కవ్విస్తూ సమాధానం చెప్పాడు. అందులో భాగంగానే తనను చిన్నప్పుడు ఫ్రెండ్స్ శాడిస్ట్ అనేవారిని తేల్చి చెప్పాడు.

అఖిల్ మాట్లాడుతూ....తన ఫ్రెండ్స్ తో తాను బాగా చొరవగా ఉంటానని తన విశ్వరూపం ఏమిటి అన్నది తన స్నేహితులకు మాత్రమే తెలుసునని అందువల్లనే తన స్నేహితులంతా తనను 'శాడిస్ట్' అని పిలుస్తారని బయటపెట్టాడు .

Yes, I am a Sadist: Akhil Says

అయితే తన స్నేహితులు ఎవరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకపోవడంతో తన సాడిస్ట్ టెంపర్ మెంట్ బయటకు రాలేదని తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు అఖిల్.

అలాగే అఖిల్ మరొక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు అఖిల్. తనకు హార్రర్ సినిమాలంటే విపరీతమైన భయం అన్నాడు. అందువల్ల కనీసం అలాంటి సినిమాల ట్రైలర్స్ కూడా చూడనని అంటూ తన రహస్యాన్ని బయట పెట్టాడు.

ఈమధ్య తనకు ఒక దర్శకుడు మంచి హర్రర్ సినిమా కథ చెప్పిన విషయాన్ని గుర్తుకుచేసుకుంటూ ఆ కథ బాగుంది కానీ ఆ కథ విన్నతర్వాత వారం పాటు అర్ధరాత్రి సమయంలో పడుకోలేదని రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కర్టెన్స్ తీసి లైట్స్ వేసుకుని పొడుకున్న తన భయాన్ని వివరించాడు.

English summary
Anchor Anasuya as the host, a talk show is launched, which goes by the title “A Date With Anasuya”. When quizzed about his friends, Akhil revealed many funny and interesting things. He also told that his close friends call him a “Sadist”, as he keeps irritating them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu