అమీర్‌ఖాన్ ‘నయీ సోచ్’ ఖర్చు 100 కోట్లు
స్టార్ ప్లస్ కోసం అమీర్‌ఖాన్ చేపట్టిన నయీ సోచ్ కార్యక్రమం కోసం స్టార్ ప్లస్ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం.
సినిమా అయినా, టెలివిజన్ కార్యక్రమమైనా అమీర్‌ఖాన్ చేపడితే అది భారీగానే ఉంటుంది. అందుకు సాక్ష్యంగా దంగల్, పీకే చిత్రాలు నిలిచాయి. టెలివిజన్ రంగంలో సత్యమేవ జయతే కార్యక్రమం నిరూపించింది. తాజాగా మహిళా సాధికారి స్టార్ ప్లస్ కోసం అమీర్‌ఖాన్ నయీ సోచ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రచారం కోసం స్టార్ ప్లస్ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం.

అమీర్ ఖాన్, మార్కెట్ వ్యూహంలో భాగంగా దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద పట్టణాల్లో హోర్డింగ్‌లకు కోసం ఖర్చుచేసినట్టు తెలుస్తున్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్ రంగంలో డిజిటల్ యాడ్స్ డిజైన్ చేస్తున్నారు. మహిళా సాధికారిత కోసం స్టార్ ప్లస్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.



Click it and Unblock the Notifications











