ఇక టీవీలో 'మూవీస్ ఆన్ డిమాండ్' సేవలు

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియాకు చెందిన ప్రవాసులు యుప్ టీవీ ద్వారా తమ కిష్టమైన సినిమాలు తమకు అనుకూలమైన సమయంలో చూసే అవకాశం ఉందని ఆయన అన్నారు. సినిమాలు వీక్షించేందుకు నెలవారీ ప్యాకేజీ సౌకర్యం ఉన్నట్టు తెలిపారు. నెలవారీగా చెల్లించడం ఇష్టం లేనివారు సినిమాని ఒకసారి వీక్షించేందుకు కొంత రుసుము చెల్లించినా సరిపోతుందని ఆయన అన్నారు.
'ఇప్పుడు మూవీస్ ఆన్ డిమాండ్‌తో యుప్ టీవీ నెటిజన్లకు మరింత చేరువ కానుంది. ఈ చిత్రాలు చూడడానికి ఇక ఇంట్లో టీవీనే ఉండనక్కర్లేదు. మన కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీలు, బ్లూరే ప్లేయర్‌లు, యుప్ టీవీ డాంగిల్, గూగుల్ టీవీ, బాక్సీ, నెట్ గేర్ ఉంటే చాలు. ఐఫోన్, ఐపాడ్, టాబ్లెట్లలోనూ సినిమాలు చూసే అవకాశం ఉండడంతో ఇక యువతకు యుప్ దగ్గరవుతుందన్న ఆశాభావాన్ని ఉదయ్‌రెడ్డి వ్యక్తంచేశారు.


Click it and Unblock the Notifications











