twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ, శంకర్‌కు షాక్.. 2.0 రిలీజ్ నిలిపివేయండి.. మొబైల్ కంపెనీల ఫిర్యాదు

    |

    సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 చిత్రానికి వివాదాల బెడద తగ్గటం లేదు. గత కొద్దికాలంగా అనేక వివాదాలు ఈ సినిమాను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల నేపథ్యంగా సాగే ఈ చిత్ర కథపై మొబైల్ కంపెనీ కన్నెర్ర చేశాయి. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా నిలిపివేయాలని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఫిర్యాదు చేయడంతో 2.0 చిత్రం ఇబ్బందుల్లో పడింది. వివరాల్లోకి వెళితే..

    వివాదాస్పదంగా స్టోరి

    వివాదాస్పదంగా స్టోరి

    మొబైల్ ఫోన్ రేడియేషన్‌ వల్ల జరిగే దుష్పరిమాణల నేపథ్యంగా 2.0 చిత్రం సైంటిఫిక్ ఫిక్షన్‌గా రూపొందింది. మొబైల్ ఫోన్ల రేడియేషన్ల వల్ల మానవులకే కాదు. ప్రపంచంలోని పక్షులకు, జంతువులకు కూడా హానికరం అనే కథతో ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించారు.

     తప్పుదోవ పట్టించే విధంగా

    తప్పుదోవ పట్టించే విధంగా

    శంకర్ తెరకెక్కించిన 2.0 చిత్రం సైన్స్, విజానాన్ని కించపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులను, ప్రజలను తప్పుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్లు వల్ల ప్రజలకు, జంతువులకు పక్షులకు ప్రాణహాని ఉంటుంది అనే విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని సీఓఏఐ కేంద్ర సమాచార ప్రసారశాఖకు ఫిర్యాదు చేసింది.

    2.0 : అమీ జాక్సన్ పాత్ర ఇదే, మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)2.0 : అమీ జాక్సన్ పాత్ర ఇదే, మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)

    రిలీజ్ నిలిపివేయండి

    రిలీజ్ నిలిపివేయండి

    అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రూపొందించిన 2.0 చిత్రాన్ని రిలీజ్ కాకుండా నిలిపివేయాలి. ప్రదర్శనకు అర్హత లేకుండా ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను వాపసు తీసుకోవాలి. తాము చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి తీర్పు వచ్చే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలి అని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్‌కు ఫిర్యాదు చేశారు.

    600 కోట్లతో

    600 కోట్లతో

    భారతీయ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా తెరకెక్కిన 2.0 చిత్రం సుమారు రూ.600 కోట్లతో తెరకెక్కింది. ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో అమీజాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు.

     10 వేల థియేటర్లలో

    10 వేల థియేటర్లలో

    ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఇప్పటికే తొలి రెండు రోజులకు అడ్వాన్స్ బుకింగ్ ఫుల్ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 10 వేల థియేటర్లలో విడుదల కానున్నది.

    English summary
    Cellular Operators Association of India has filed a complaint against Rajinikanth's 2.0 claiming that the film is promoting anti-scientific attitude. In the letter of complaint addressed to the Central Board of Film Certification (CBFC) and the Ministry of Information and Broadcasting, the COAI has claimed that the filmmakers are promoting anti-scientific attitude.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X