Don't Miss!
- News
BBC Documentary : ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్-సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Finance
Adani Stocks: జాతీయవాదంతో మోసం కవర్ చేయటం కుదరదు.. అదానీకి స్ట్రాంగ్ వార్నింగ్..!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- Sports
INDvsNZ : ఇలాగైతే ఐపీఎల్ ఆడటానికి కూడా రారు.. లక్నో పిచ్‌పై మాజీ దిగ్గజం వెటకారం!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
2023 సంక్రాంతికి రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.. ఆ రెండు సినిమాలు ఒకేసారి
ఈ సంక్రాంతికి సౌత్ బాక్సాఫీస్ వద్ద ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. గతంలో అనుకున్న సినిమాలేవి కూడా 2023 సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు. హఠాత్తుగా దసరాకు రావాలని అనుకున్న సినిమాలు మాత్రమే ఇప్పుడు వస్తున్నాయి. కేవలం ఇందులో వారసుడు సినిమా మాత్రమే ముందస్తుగా ఒక ప్రకటన అయితే ఇచ్చింది. ఇటీవల దిల్ రాజు కూడా అదే విషయం పై క్లారిటీ ఇచ్చాడు. అన్ని సినిమాల కంటే ముందే మా సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
అయితే ఎవరు ఏ డేట్ ఫైనల్ చేసుకున్నారు అనే విషయంలో మాత్రం అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా తమిళంలో అజిత్ నటించిన తునివు సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. జనవరి 11వ తేదీన ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

ఇక జనవరి 12వ తేదీ ఒకేసారి రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. విజయ్ వారసుడు సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా జనవరి 12వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య ధియేటర్ల విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఇక రెండు సినిమాల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చర్చించుకుని థియేటర్లను షేర్ చేసుకోబోతున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన రాబోతోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు హై రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే మొదట వారసుడు సినిమాకు అనుకున్నంత ఎక్కువగా థియేటర్స్ దక్కకపోవచ్చు అనే టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని సినిమాలకు సమానమైన థియేటర్స్ లభించేలా విడుదల చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ సినిమాలన్నిటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో ఒక ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.