Just In
- 10 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 11 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 12 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 13 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రదీప్ 30 రోజుల ప్రేమకు డిమాండ్.. సోషల్ మీడియాలో ఈ యంగ్ యాంకర్‌దే హవా
యాంకర్ ప్రదీప్ ఇకపై వెండితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే సినిమాతో హీరో అవతారమెత్తుతున్నాడు ప్రదీప్. డిఫరెంట్ కథాంశంతో యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి స్టార్ హీరోల సపోర్ట్ కూడా లభిస్తుండటం విశేషం. ప్రదీప్‌కి మొదటగానే రానా సపోర్ట్ చేశారు. ఆయన చేతుల మీదుగానే ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ల కాన్సెప్టు, సంగీతం తనకు బాగా నచ్చినది తెలిపిన రానా.. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఇటీవలే చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం' ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట హవా నడుస్తోంది.
'నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్న.. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా.. నెలవంకను ఇద్దామనుకున్నా.. ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే..' అంటూ సాగే ఈ పాటకు చంద్ర బోస్ లిరిక్స్ అందించగా.. సిద్ శ్రీరామ్ సునీత ఈ పాటను చక్కగా పాడారు. అనూప్ రూబెన్స్ బాణీలు కట్టారు.

ఎంతో వినసొంపుగా ఉన్న ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట.. యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ డిమాండ్ చూస్తుంటే ప్రదీప్ తొలి సినిమాతోనే ఆకట్టుకోవడం ఖాయం అని తెలుస్తోంది.