నేటితరం లవ్‌స్టోరి 4 లెట‌ర్స్‌.. కే రాఘవేంద్రరావు చేతుల మీదుగా టీజర్!

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం 4 లెట‌ర్స్‌.
'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షికఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

4 లెట‌ర్స్‌ టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావుఈ చిత్రం టీజర్ ను దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

4 Letters movie teaser launched by K Raghavendra Rao

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' ప్రవాస భారతీయుడైన ఈ చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్ గారు నిర్మించిన ఈ చిత్రం '4 లెటర్స్' టీజర్ నేటి తరం యువతి యువకుల మనోభావాలకు అడ్డం పట్టేలా ఉంది. హీరో ఈశ్వర్ కు ఇది తొలి చిత్రమైనా ఎంతో చక్కగా నటించాడు. సత్యానంద్ గారి శిష్యరికం కాబట్టి చక్కని ప్రతిభ కనబరిచాడు. అతనికి చిత్రపరిశ్రమలో ఉజ్వలమైన భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ లు ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని అభిలషించారు.

ఈ నెల ౩౦న చిత్రం ఆడియో, ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల కానున్నది.

ఈ సంద‌ర్భంగా...నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం 4 లెట‌ర్స్‌. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం. ఈ నెల ౩౦న చిత్రం ఆడియో,. ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల అవుతాయని తెలిపారు.

4 Letters movie teaser launched by K Raghavendra Rao

హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..' ఎంతోమంది టాప్ స్టార్స్ ను వెండితెరకు పరిచయం చేసిన గ్రేట్ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర రావు గారు నా తొలి చిత్రం టీజర్ ను విడుదల చేయటం, నన్ను ఆశీర్వదించటం సంతోషం గా ఉంది. ఆయన హస్తవాసి మంచిదని ఎంతో మంది అంటూ ఉంటారు. ఆయన చేతుల మీదుగా విడుదల అయిన ఈ చిత్రం టీజర్ తోపాటు, చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ క‌లుసుకోవాల‌ని త‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. టీజర్ ను గురు తుల్యులు శ్రీ రాఘవేంద్ర రావు గారి చేతులమీదుగా విడుదల అవటం ఈ చిత్ర విజయానికి శుభ సూచకం. ఆయనకు హృదయపూర్వక కృతఙ్ఞతలు. నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు సినిమాను తెర‌కెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే 4 లెట‌ర్స్‌: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం అన్నారు.

ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్ట‌ర్‌: రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు: సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ: చిట్టిబాబు.కె

నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్,
క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X