2.0 పోటీని తట్టుకునేందుకు ‘టాక్సీవాలా’ న్యూ ఐడియా, 7 నిమిషాల కొత్త సీన్లు!
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'టాక్సీవాలా' లీక్ సమస్యను సైతం అధిగమించి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 35 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.
నేటి వరకు 'టాక్సీవాలా'కు ఎదురు లేదు. అయితే నవంబర్ 29 నుంచి రజనీకాంత్ 2.0 మూవీ థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ సరికొత్త ప్లాన్ వేశారు. ఈ సినిమాలో అదనంగా 7 నిమిషాల సీన్లు కలుపుతున్నారు.

హీరో విజయ్ వెంట ఉంటూ కమెడియన్ విష్ణు పోషించిన హాలీవుడ్ క్యారెక్టర్‌కు సంబంధించి ఈ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఓ వైపు 2.0 ఫీవర్ కొనసాగుతున్న నేపథ్యంలో అదనంగా యాడ్ చేసిన 7 నిమిషాల సీన్లు చూసేందుకు ప్రేక్షకులు ఏ మేరకు ఆసక్తి చూపుతారో చూడాలి.
టాక్సీవాలా చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్ల గ్రాస్... రూ. 20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలూ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క బయ్యర్ డబుల్ ప్రాఫిట్స్ తమ ఖాతాలో వేసుకున్నట్లయింది.


Click it and Unblock the Notifications











