AA22: బన్నీ స్టెప్స్‌కి జపాన్ టచ్.. అల్లు అర్జున్- అట్లీ ప్లాన్ మామూలుగా లేదు..

AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పై అంచనాలు రోజురోజుకి పీక్స్‌కి చేరుతున్నాయి. దక్షిణాదిలో పేరొందిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీస్తోంది. మొదట పాన్ ఇండియా మూవీగా అనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు మేకర్స్ పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్ - అట్లీ కుమార్ కాంబో అనగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. అల్లు అర్జున్ ఈ మూవీలో నాలుగు విభిన్న పాత్రల్లో నటించబోతున్నారట. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా బన్నీ వెండితెరపై కనిపించనున్నారని సమాచారం. అంతేకాక, కథాంశం టైమ్ ట్రావెల్, పునర్జన్మ వంటి సైంటిఫిక్, ఫాంటసీ అంశాల చుట్టూ తిరగబోతుందని టాక్. ఇలాంటి కాన్సెప్ట్‌ తెలుగు సినిమాల్లో అరుదుగా రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.

AA22 Japan Choreographer Joins Allu Arjun Atlee 800 Cr Pan World Film

ఈ భారీ బడ్జెట్ మూవీలో మరో స్పెషల్ హైలైట్ హీరోయిన్‌ల సంఖ్య. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మెయిన్ లీడ్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే కూడా అల్లు అర్జున్ తో స్కీన్ షేర్ చేసుకోబోతున్నారట. అలాగే.. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇలా స్టార్ కాస్టింగ్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ చేయడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్‌ పెరిగింది. అలాగే.. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలోని ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.

ఇలా నేషనల్ నుంచి గ్లోబల్ స్థాయికి మారిన 'AA22'సినిమాను మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను మరింత మోస్ట్ అవైటెడ్ గా మార్చేందుకు జపాన్ టాప్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషిని తీసుకొచ్చారు. ఇటీవల అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన 'ఇండియన్ సినిమాకి పనిచేయడం నా కల. నెల రోజులుగా ఈ టీమ్‌తో ఉన్నాను. ఎవరూ ఊహించని కొత్త కాన్సెప్ట్‌తో సినిమా వస్తోంది'అని చెప్పడంతో అభిమానుల్లో మరింత హైప్ పెరిగింది. బన్నీ డ్యాన్స్‌కి ఉన్న క్రేజ్‌ ప్రత్యేకం. బన్నీ వేసే స్టెప్పులు ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాయి. ఇప్పుడు జపాన్ కొరియోగ్రాఫర్‌తో కలిసి బన్నీ ఏవిధమైన స్టెప్పులు వేయబోతాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ముంబయిలో భారీ షెడ్యూల్ పూర్తయింది. ఇక అబుదాబిలో మరొక యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ జరగనుంది. హాలీవుడ్ టెక్నీషియన్లతో వర్క్ చేసి ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. దాదాపు 800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా 2026 చివరి నాటికి లేదా 2027లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 'పుష్ప 2'తో పాన్ ఇండియా స్టార్‌గా స్థిరపడిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా అవతరించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ మేకింగ్, బన్నీ డ్యాన్స్, దీపికా పదుకోన్ గ్లామర్ కలయికతో ఈ మూవీ వేరే లెవల్ కు చేరుతుందడంలో టువంటి సందేహం లేదు.

More from Filmibeat

Read more about: aa22 allu arju atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X