For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్ గేర్‌లో ఆది సాయికుమార్ రొమాన్స్.. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్!

  |

  హిట్లు, ఫ్లాపులు అనే విషయాన్ని పట్టించుకోకుండా చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న హీరోల్లో ఆది సాయికుమార్ ఒకరు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో లాంటి సినిమాలతో ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన ఆది సాయికుమార్ త్వరలోనే టాప్ గేర్ అనే చిత్రంతో సిద్దమవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో ఆది చేసిన రొమాన్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. ఈ మూవీ వివరాల్లోకి వెళితే..

  Top Gear

  ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు.

  ఇప్పటికే టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్‌ను చూపిస్తోంది. యాక్షన్‌లోనే కాదు.. రొమాన్స్‌లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్‌ రియా సుమన్‌, ఆది కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

  ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన హర్ష వర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

  ''జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.

  నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్
  సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
  మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్
  ఎడిటర్: ప్రవీణ్ పూడి
  ఆర్ట్: రామాంజనేయులు
  కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
  ప్రొడ్యూసర్: కేవీ శ్రీధర్ రెడ్డి
  బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
  సమర్పణ: ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
  పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని

  English summary
  hero Aadi Saikumar will next enthrall us as a taxi driver in his ongoing film Top Gear. Directed by Shashikanth, the film is in the post-production phase. The film’s first look poster and motion video got tremendous response. The motion video showed the action side of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X