For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సక్సెస్ మీట్: కశ్మీర్‌ పండిట్లను ఊచకోత సబ్జెక్‌పై ప్రశంసలు..

  |

  సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా నటించిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. 'ఎయిర్ టెల్' మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదలైంది. సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం సక్సెస్ మీట్ నిర్వహించారు.

  ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ "సినిమాకు చాలా మంచి అప్లాజ్‌ వచ్చింది. అందరూ బావుందని చెబుతున్నారు. అర్జున్‌ పండిట్‌ పాత్రలో నా నటన, సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ప్రతిరోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీలు కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటే సంతోషంగా ఉంది. కలెక్షన్లు కూడా బావున్నాయి. ప్రతిచోట పాజిటివ్‌ రిపోర్ట్‌ వస్తుంది" అని అన్నారు.

  సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ "శుక్రవారం మా 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌' విడుదలైంది. అన్నిచోట్ల నుండి సినిమా చాలా బావుందనే టాక్‌ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం వెనుక చాలామంది ఉన్నారు. అబ్బూరి రవి, ఆది సాయికుమార్‌, కార్తీక్‌ రాజు, పార్వతీశం, మనోజ్‌ నందం, నిత్య, ఎయిర్‌టెల్‌ గాళ్‌ శషా, కృష్ణుడు, రావు రమేశ్‌గారు... వీరందరూ ఎంతో మద్దతుగా నిలిచారు. అలాగే, సినిమాటోగ్రాఫర్‌ జయపాల్‌, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌. మాకు ఆదిత్య మ్యూజిక్‌ వాళ్లు గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు. వాళ్లకూ థ్యాంక్స్‌. మా టెక్నిషియన్స్‌, టీమ్‌ హార్డ్‌ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా బావుందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూలు రాస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు" అని అన్నారు.

  Aadi Sai Kumars lOperation Gold fish success meet

  పార్వతీశం మాట్లాడుతూ "చూసినవాళ్లందరికీ సినిమా నచ్చింది. నచ్చినవాళ్లు సినిమా బావుందని పదిమందికి చెప్పండి. ఈ రోజు నుండి మా కలెక్షన్లు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను" అన్నారు.

  కార్తీక్‌రాజు మాట్లాడుతూ "ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు. దాన్ని విడుదల చేయడం మరొక ఎత్తు. మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్‌ కనుక ఆ బాధలు నాకు తెలుసు. సాయికిరణ్‌ అడివిగారు ఏడాదిన్నర కష్టపడి మంచి సినిమా తీశారు. అందరూ మంచి సినిమా తీయాలనే ప్రయత్నిస్తారు. ఎవరూ చెడ్డ సినిమా తీయాలనుకోరు. సినిమా చూశాం. మా అందరికీ నచ్చింది. అందరి పాత్రలు బావున్నాయి. సినిమా బతకాలంటే... ఒక వారం తర్వాత రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను. మా బాధను అర్థం చేసుకోండి. అప్పుడు మాకులా చాలామంది ముందుకు వస్తారు" అని అన్నారు.

  నిర్మాతలలో ఒకరైన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ "ఏ సినిమానైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎంతోమంది కృషి ఉంటుంది. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి చాలామంది నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సహకరించారు. విడుదలకు ముందు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. విడుదల కష్టమైంది. అప్పుడు నేను ముందుకు తీసుకొచ్చాను. నాకు ఏ సినిమా అయినా కష్టంలో ఉందంటే... మనం ముందుకు వెళ్లాలనే ఫీలింగ్‌ ఉంటుంది. ఈ సినిమా చూస్తే... ఒక దేశభక్తి భావన కలుగుతుంది. మన దేశాన్ని పాకిస్తాన్‌ ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది? వాళ్లు చేసిన అన్యాయాలు ఏంటనే అంశంపై చేసిన సినిమా 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌'. కశ్మీర్‌ పండిట్లను ఊచకోత కోయడం, మహిళలను అత్యాచారం చేయడం దుర్మార్గం. వినడానికి ఎంతో ఇదిగా ఉంటే... పరిస్థితులను అనుభవించిన కశ్మీరులు ఎంత బాధ పడి ఉంటారనే భావనతో ఎంత కష్టమైనా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్సయ్యా. ప్రతి ఒక్కరికీ ఈ సినిమాను ఫ్రీగా చూపించాలని ఉంది. కానీ, నాకు అంత శక్తి లేదు. ఈ దేశభక్తి సినిమాను నిలబెట్టాల్సిన బాధ్యత అందరిదీ. మార్నింగ్‌ షో కంటే సెకండ్‌ షోకి కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ప్రతి షోకి కలెక్షన్లు పెరిగాయి" అని అన్నారు.

  Aadi Sai Kumars lOperation Gold fish success meet

  అబ్బూరి రవి మాట్లాడుతూ "సినిమా తీయడానికి సాయికిరణ్‌ అడివిగారు ఎంత కష్టపడ్డారో... సినిమాను ప్రేక్షకులకు చూపించడానికి పద్మనాభ రెడ్డిగారు అంత కష్టపడ్డారు. ఆయనకు చాలా చాలా థ్యాంక్స్‌. ఒక పాట లేకున్నా, గ్లామర్‌ ఎపిసోడ్‌ లేకున్నా... అర్జున్‌ పండిట్‌ పాత్ర చేయడానికి ఒప్పుకున్న ఆదిగారికి థ్యాంక్స్‌. నాకు తెలిసి హీరోలందరూ నిలబడేది క్యారెక్టర్ల వల్ల. అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆయన చాలా బాగా చేశారు. దర్శకుడు సాయికిరణ్‌ అడివి ఎన్ని కష్టాలు పడి సినిమా చేశారనేది నాకు తెలుసు. అందరూ ఆయన కోసమే ఈ సినిమా చేశారు. కథ అద్భుతంగా తయారు చేసుకున్న, ఈరోజు విజయం అందుకున్న సాయికిరణ్‌గారికి అభినందనలు. ఇటువంటి సినిమా థియేటర్‌కు వెళ్లి చూస్తే... మనది అన్న ఒక ఫీలింగ్‌ వస్తుంది" అన్నారు.

  బ్యాన‌ర్‌: వినాయ‌కుడు టాకీస్‌
  కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: కీర్తి
  ఫైట్స్‌: రామ‌కృష్ణ‌, సుబ్బు-న‌భా
  సాహిత్యం: రామ‌జోగ‌య్య‌శాస్త్రి
  ఎడిట‌ర్‌: గ్యారీ .బిహెచ్‌
  సినిమాటోగ్ర‌ఫీ: జైపాల్ రెడ్డి నిమ్మ‌ల‌
  స్క్రిప్ట్ డిజైన్‌: అబ్బూరి ర‌వి
  పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్‌ - ఫణి కందుకూరి,
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిర‌ణ్ రెడ్డి తుమ్మ‌
  కో ప్రొడ్యూస‌ర్‌: దామోద‌ర్ యాద‌వ్‌ (వైజాగ్‌)
  నిర్మాత‌లు: ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్‌, సతీష్ డేగల, మిగతా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు
  ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ అడివి

  English summary
  Aadi Sai Kumar's latest movie Operation Gold fish running succesful at box office. In this occassion, film unit organised succesmeet, Abburi Ravi as villain this movie gets huge applause. Directed by Sai Kiran Adivi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X