HBD Aakash Puri: బచ్చన్ సాబ్‌గా ఆకాశ్ పూరి. చోర్ బజార్‌తో తుపాకి పట్టి..
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి మరోసారి తన ప్రతిభను చాటుకొనేందుకు విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పూరీ ఆకాశ్ జన్మదినాన్ని పురుస్కరించి ఆయన నటించిన చోర్ బజార్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీఎస్ రాజు నిర్మాతగా పరిచయం అవుతూ ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చోర్ బజార్ న్యూ ఏజ్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది అని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి జార్జిరెడ్డి చిత్రాన్ని అందించిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

చోర్ బజార్ చిత్రంలో బచ్చన్ సాబ్‌గా ఆకాశ్ పూరి కనిపిస్తున్నారు. ఆకాశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాం. చిత్రంలో ఆకాశ్ ఇంతకు ముందెన్నడూ కనిపించిన పాత్రలో అలరించబోతున్నారు. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతంలో చోర్ బజార్ షూటింగు జరుగుతున్నది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: అన్వర్ ఆలీ
క్యాస్టూమ్ డిజైనర్: ప్రసన్న దంతులూరి
ఫైట్స్: ఫృథ్వీ శేఖర్
కోరియోగ్రాఫర్: భాను
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
బ్యానర్: ఐవీ ప్రొడక్షన్స్
నిర్మాత: వీఎస్ రాజు
రచన, దర్శకత్వం: బీ జీవన్ రెడ్డి


Click it and Unblock the Notifications











