టాలీవుడ్ లో కొత్త విలన్... లుక్స్ అదుర్స్ అంటోన్న నెటిజెన్స్...
కొత్తదనానికి పెద్ద పీట వేయడంలో ముందుండేది తెలుగు ప్రేక్షకులే. పాటైనా, ఆటైనా కాస్త ఇంస్టెస్టింగ్ గా అనిపిస్తే చాలు దానికి బ్రహ్మరథం పట్టేస్తారు. జనాల పల్స్ ను బట్టీ, టాప్ స్టార్లు కూడా రొటీన్ కు భిన్నమైన కథలకు ఓటేస్తూ కొత్త తరహా కథలకు పెద్ద పీట వేస్తున్నవైనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ అవకాశాన్నిఅందిపుచ్చుకుంటున్నారు కొందరు యంగ్ ఫిల్మ్ మేకర్స్. వైవిధ్యమైన కథా, కథనాలకు తోడు విభిన్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు.
ఇటీవల తమ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేసి ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్న మిస్టేక్ మూవీ టీమ్ తాజాగా సినిమాలోని విలన్ క్యారెక్టర్ ను పరిచయం చేసింది. 'రామ్ అసుర్' సినిమాలో హీరోగా అలరించిన అభినవ్ సర్దార్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. మొదటి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో చెలరేగిపోయిన అభినవ్ ఇప్పుడు విలన్ గెటప్ లో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారనే విషయం స్పష్టమవుతోంది. సిక్స్ ప్యాక్స్ ఆబ్స్, లాంగ్ బ్లాండ్ హెయిర్ స్టైల్ తో దర్శనమిస్తోన్న సర్దార్ టాలీవుడ్ విలనిజంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేట్టే కనిపిస్తున్నారు.

హీరో మంచు విష్ణు ఈ మోషన్ పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. విడుదలైన కాసేపటికే ఈ పోస్టర్ వైరల్ గా మారడం మరో విశేషం. సన్నీ కోమలపాటి దర్శకత్వంలో తెరకెకిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని రెండు పాటలు 'గంటా గ్రహచారం', "టకీర మోచో" యూట్యూబ్ ను షేక్ చేసేస్తున్నాయి. వేటికవే విభిన్నమైన ఈ రెండు పాటలూ వైవిధ్యమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.
తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా అదే స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అభినవ్ సర్దార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, సుజిత్ కుమార్, కరిష్మా కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం అనౌన్స్ చేయనుంది. మరి హీరోగా, ప్రొడ్యూసర్ గా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న అభినవ్ సర్దార్ విలన్ గానూ అదే స్థాయిలో రఫ్పాడిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











