twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆనందయ్య మందు తీసుకున్నా.. ఆ తర్వాత ఏమైందంటే.. కీలక వివరాలు వెల్లడించిన జగపతి బాబు!

    |

    నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఒక సామాన్య వ్యక్తి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే ఖచ్చితంగా అది ఆయుర్వేదం గొప్పతనం అని చెప్పక తప్పదు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎంటర్ కావడంతో కొన్ని రోజుల పాటు ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. ఇక నిన్ననే ఈ తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా మూడు రోజుల పాటు అది కొనసాగనుంది. అయితే ఈ మందు డోస్ తీసుకున్నానని ఆ తర్వాత తన శరీరంలో జరిగిన మార్పుల గురించి జగపతి బాబు తాజాగా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

    అచేతనావస్థలో ఉన్న వాళ్లు కూడా

    అచేతనావస్థలో ఉన్న వాళ్లు కూడా

    నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అనే చిన్న గ్రామానికి చెందిన ఆనందయ్య పెద్దగా చదువుకున్నది లేదు.. తన గురువు నేర్పించిన ఆయుర్వేద వైద్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు ఆయన. ప్రాచీన గ్రంథాలలో ఉన్నట్లు కొన్ని సహజ సిద్ధంగా దొరికే ఆకులు అలమలతో ఆయన ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు. అయితే ఈ ఆయుర్వేద మందు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని వీడియోలలో ఆయన మందు వేస్తే దాదాపు అచేతనావస్థలో ఉన్న వాళ్లు కూడా లేచి కూర్చుంటూ ఉండడంతో జనాలందరికీ మందు మీద నమ్మకం ఏర్పడింది.

    చెట్నీ వేసుకుంటే కరోనా తగ్గదు

    చెట్నీ వేసుకుంటే కరోనా తగ్గదు

    అయితే ఆయన మందు గురించి రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు బాబు గోగినేని లాంటివాళ్ళు. అది ఒక చెట్నీ అని ఆ చెట్నీ వేసుకుంటే కరోనా తగ్గదని పెద్ద ఎత్తున బాబు గోగినేని చాలా రోజుల నుంచి ఖండిస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది అల్లోపతి వైద్యులు ఎన్ని విమర్శలు చేస్తున్నా... సామాన్య జనం మాత్రం ఆయన మందు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున ప్రజలు తరచూ వస్తూ ఉండటంతో ప్రభుత్వం అప్పటికప్పుడు మందు పంపిణీ నిలిపివేసింది.

    మందుకు గ్రీన్ సిగ్నల్

    మందుకు గ్రీన్ సిగ్నల్

    ఈ దెబ్బకు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతినివ్వాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆనందయ్య సైతం తనను మందు పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ప్రభుత్వం కూడా ఈ మందు వల్ల ఎలాంటి హాని కలగదని తేలడంతో తాజాగానే దానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే మందు పంపిణీ చేయాలంటే మందు తయారీ మూడు రోజులు పడుతుందని ఆనందంగా చెప్పడంతో ప్రస్తుతానికి పంపిణీ జరగడం లేదు.

    ముందే మద్దతు

    ముందే మద్దతు

    అయితే ముందు నుంచి ఆనందయ్య మందుకు పలువురు సినీ సెలబ్రిటీలు మద్దతు పలుకుతున్నారు. మొన్నీమధ్యనే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఆనందయ్య మందుకు మద్దతు తెలిపారు. 'ప్రకృతి తల్లి మనని రక్షించడానికి వచ్చినట్లుగా అనిపిస్తోంది, ఆనందయ్య గారి మందుకు అధికారిక అనుమతులు రావాలని,ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. ఆయనకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి.' అని జగపతి బాబు ట్వీట్ చేశారు.

    Recommended Video

    Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
    ఇప్పుదేమన్నారు అంటే

    ఇప్పుదేమన్నారు అంటే

    అయితే తాజాగా ఈ అంశం మీద ఆయన కీలక కామెంట్లు చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మనశ్శాంతి అనే ఒక ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం మీడియాతో జగపతిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఆనందయ్య మందు తీసుకున్నానని ఒక డోస్ తీసుకున్నాక తన శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని చెప్పారు. అలాగే దేవుడి దయ వల్ల కరోనా కూడా ఇప్పటివరకు తనకు రాలేదని అన్నారు. చాలా వీడియోలు చూసి తాను ఒక విశ్లేషణ చేసి ఆ తర్వాత ఆనందయ్య మందు వేసుకున్నానని అది వేసుకున్నందుకు ఆనందంగా ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

    English summary
    Medical practitioner Anandayya’s traditional medicine is currently a hot topic not only in Telangana and Andhra Pradesh but also india wide. today actor jagapathi babu Revealed his experience after using Anandayya Medicine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X