ఆడిషన్ అని పిలిచి టార్చర్ చేశారు.. మగవాళ్లకి తప్పదు.. నటుడు మౌళి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నారు నటుడు మౌళి. ఆయన పూర్తి పేరు మౌళి తనుజ్ ప్రశాంత్. ఏపీ చెందిన ఈ కుర్రాడు సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తన ఫన్నీ రీల్స్, ఇంట్రెస్టింగ్ వీడియోలతో ప్రేక్షకుల అటెన్ష్ ను డ్రా చేశారు. ఆ ఫాలోయింగ్ తో నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలను అందుకోవడం ప్రారంభించారు. ఇలా తొలుత హాస్టల్ బాయ్స్ అనే చిత్రంతో ప్రేక్షకులను తొలిసారిగా వెండితరపై అలరించారు. అప్పటి నుంచి హీరోగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూనే వస్తున్నారు.

ఈ క్రమంలో త్వరలో మౌళి తనుజ్ ప్రశాంత్ లిటిల్ హార్ట్స్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యూత్ ఫుల్ ఫిల్మ్ సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ETV విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందించారు. నిర్మాత బన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో బన్నీ వాస్ మరియు వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నగరం, రాజీవ్ కనకాల, SS కంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో హీరోగా నటించిన మౌళి తన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

Actor Mouli Tanuj Prasanth about his Struggling Days

తాజాగా మౌళి తన రాబోయే చిత్రం లిటిల్ హార్ట్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో మెరుస్తున్నారు. ఈ సందర్భంగా తను చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న సమ్యల గురించి చెప్పుకొచ్చారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మౌళి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు నేను గాజువాకలో ఉన్నప్పుడు గొప్పగా ఊహించుకున్నాను. ఫిల్మ్స్ తీసే వాళ్లందరూ నెక్ట్స్ లెవల్ లో ఉంటారని అనుకునే వాడిని. వాళ్లంతా చాలా మేధావులు. మన రేంజ్ కాదు. వాళ్లు వేరే అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ హైదరాబాద్ కు వచ్చాక అందరూ మనలాంటోళ్లే అని తెలుసుకున్నాను.

ఇండస్ట్రీలో అందరూ మనలానే ఉంటారని తెలుసుకున్నాను. ఇంకా చెప్పాలంటే కొంత మంది ఊర్లో తీసే షార్ట్ ఫిల్మ్స్ కన్నా బుర్ర తక్కువ వాళ్లు ఉన్నారు. ఆఫీస్ లు పెట్టుకొని, చెత్తచెత్త స్క్రిప్ట్స్ పట్టుకొని, వాటికి ఆడిషన్ కు పిలుస్తుంటారు. అలాంటి వాటికి ఆడిషన్స్ కు పిలిచి టార్చర్ చేస్తుంటారు. వాళ్ల స్క్రిప్ట్స్ లో ఏముండదు. నిజానికి నేను ఒక ఆడిషన్ కు వెళ్లాను. అక్కడ వాళ్లు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అది అసలు స్క్రిప్ట్ కాదు. ఒక సీన్ ఉంటదని చెప్పి, తర్వాత మొత్తం కామెడీ ఉంటదని అంటారు. అసలు ఇంతకు అందులో కామెడీ ఏంటంటే చెప్పరు.

కామెడీ ఏంటని అడిగితే రాయలేదు అంటారు. పైగా ఫుల్ కామెడీ అని చెబుతారు. ఫుల్ కామెడీ అన్నప్పుడు కనీసం ఏదైనా సీన్ ఉండాలి కదా అని నేను ప్రశ్నించే వాడిని. అలాగని టాలెంట్ లేని వాళ్లు లేరని కాదు. మంచి టాలెంట్ ఉన్న వారు కూడా ఉన్నారు. అదే సమయంలో ఏం టాలెంట్ లేని వాళ్లు కూడా ఉన్నారు. టాలెంట్ లేని వాళ్లు వాళ్ల బుర్రలేని తనంతో టాలెంట్ ఉన్న యాక్టర్స్ ను, టెక్నీషియన్లను టార్చర్ చేస్తూ ఉంటారు. మరోక ఆడిషన్ లో స్క్రిప్ట్ ఇచ్చారు. ఆడిషన్ చేశాను. కామెడీ కావాలని అన్నారు. అయితే స్క్రిప్ట్ లో ఉన్న విధంగా నేను పెర్ఫామ్ చేశాను. అంతా ఫన్నీగా లేని మొహం మీదే చెప్పారు. దీంతో నేను ఇక్కడ స్క్రిప్ట్ లో కామెడీ లేదని అనుకునే వాడినని చెప్పే వాడిని. ఇక స్క్రిప్ట్ లో ఏం లేకుంటే మంచి నటీనటులు కూడా చెత్తగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X