Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లవ్యూ రా చిల్లర ఫెల్లోస్.. నందు పోస్ట్ వైరల్
గీతా మాధురి భర్త, నటుడు హీరో నందు గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. BB అంటూ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. BBలో ఉన్నా, రచ్చ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ ఇస్తా.. మీ సపోర్ట కావాలంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచాడు. ఇక BB అంటే అందరూ బిగ్ బాస్ అని అనుకోవడం, ఇక తదుపరి అప్డేట్ ఎప్పుడు ఇస్తాడని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదరుచూడటం చివరకు తన కొత్త సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ (BB) పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.
అయితే BB అంటే బిగ్ బాస్ అనుకోవడం, అలా అనుకోవాలనే నందు కూడా తన స్ట్రాటజీ ఉపయోగించి కొత్త ప్రాజెక్ట్‌పై హైప్ పెంచుకున్నాడు. ఇక వీటిపై లెక్కలేనన్ని మీమ్స్ హల్చల్ చేశాయి. ఇంతకీ BB అంటే చెప్పండన్నా అని కొందరు, తీరా చెప్పాక ఇలా చేశావేంటన్నా అని ఇంకొందరు కామెంట్ చేశారు. అయితే నందు ఇలా చేయడంతో నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. వాటిపై నందు కాస్త ఫైర్ అయినట్టు తెలుస్తోంది.

ఫ్రొఫైల్ పిక్ ఉండదు.. జీరో పోస్ట్స్, జీరో ఫాలోవర్స్ ఉండి..జీవితంలో ఏదీ సాధించలేక, ప్రయత్నిస్తున్న వాళ్లను కూడా డిస్కరేజ్ చేస్తూ చిల్లర కామెంట్స్ చేసే చిల్లర గాల్లకి ఈ పోస్ట్ అంకితం.. చెత్త నా ఫెల్లోస్ లవ్యూ రా అంటూ కాస్త గట్టిగానే సెటైర్ వేశాడు నందు. మొత్తానికి నందు తన కొత్త చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్‌తో బాగానే వైరల్ అవుతున్నాడు.