Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బయోపిక్ స్క్రిప్ట్ రెడీ చేయమని మా అమ్మ ముందే చెప్పింది: నరేష్
టాలీవుడ్ సీనియర్ నటి విజయ నిర్మల బయోపిక్ కూడా తెరపైకి రానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె తనయుడు నరేష్ కూడా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నట్లు మీడియాకు కూడా వివరణ ఇచ్చారు. గత ఏడాది నుంచి ఈ విషయంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా విజయ నిర్మల బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు నరేష్ తెలియజేసారు.
నరేష్ మాట్లాడుతూ.. తన బయోపిక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని నా తల్లి నన్ను కోరింది. గత కొంత కాలం నుంచే ఆమె కథను రాయడం ప్రారంభించాను, కానీ ఆమె ఆరోగ్యం క్షీణించిన తరువాత స్క్రిప్ట్ వర్క్ ఆపేయాల్సి వచ్చింది. అత్యుత్తమ వ్యక్తిత్వానికి సంబంధించిన బయోపిక్‌కు చాలా పరిశోధనలు చేయాలి, అలాగే ఎన్నో వివరాలను సేకరించాల్సి ఉంటుంది" అని నరేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఇకపోతే విజయ నిర్మల పాత్రలో నటించబోయేది కీర్తి సురేష్ అని ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ విషయంపై నరేష్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఫుల్స్ స్క్రిప్ట్ సిద్ధమైన తరువాత అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణను రెండవ వివాహం చేసుకున్న విజయ నిర్మల లెజెండరీ యాక్టర్ గానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి అలాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడలి.