twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Actor Raj Bala చిన్న హీరో పెద్ద మనసు.. 30 కుటుంబాలకు చేయూత

    |

    కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు నానా కష్టాలకు గురవుతున్నారు. రోజువారీ కార్మికులు, చేతివృత్తులపై ఆధార పడిన వారి పరిస్థితి దారుణంగా మారింది. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారికి అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. వ్యాపార, సినీ వర్గాలు తమ వంతుగా సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూసి వర్ధమాన నటుడు రాజ్‌బాలా స్పందించారు. తన వంతుగా పేదలకు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన సొంత ఊరులోని 30 కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది.

    యువ నటుడు రాజ్‌బాల ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోని యడవల్లి. అలాగదే కర్నూలు జిల్లాతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీలో కరోనా ప్రభావం ఉన్న కర్నూలు జిల్లాలో విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రాజ్‌బాల తన పేరిట ఉన్న స్వచ్ఛంద సంస్థ ద్వారా తమ వంతు సాయం అందించడంపై స్థానికంగా మంచి స్పందన వ్యక్తమైంది.

     Actor Raj Bala help for 30 families amid corona crisis

    కరోనా లాక్‌డౌన్‌లో తిండికి కష్టపడుతున్న కుటుంబాలకు అండగా నిలచారు. దాదాపు 30కిపైగా కుటుంబాలకు రూ.1000కిపైగా విలువైన నిత్యావసర వస్తువులను అందించారు. దీంతో రోజువారీ కూలీలకు ఆహారపరమైన ఇబ్బంది కొంత మేరకు తగ్గేలా రాజ్‌బాల నిర్ణయం తీసుకొన్నారు.

    ఇక రాజ్‌బాల కెరీర్ విషయానికి వస్తే.. D/o వరమ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాకప్ లేకుండానే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. లవ్ బూమ్, 7 టూ 4 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్‌తో 5ws అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    English summary
    Actor Raj Bala help for 30 families amid corona crisis. Actor takes initiation and help for Corona Victims in Prakash Districts. He distributed groceries for 30 family worth Rs.1000.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X