Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కరోనా కోసం కదిలొచ్చిన రాజశేఖర్ కుమార్తెలు.. బర్త్ డే సందర్భంగా సీఎం సహాయనిధికి విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెలు విరాళం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ గా అడుగులు వేస్తున్న వీరు కెరీర్ మొదట్లోనే వారి ఉదారతను చాటుకున్నారు. దొరసాని సినిమాతో రాజశేఖర్ రెండవ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆమె ఒక లక్ష రూపాయలను సీఎం సహాయనిధికి అందించారు.
రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా మరో లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. నేడు ఏప్రిల్ 22 శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఇద్దరు సోదరీమణులు కలిసి తెలంగాణ ఐటి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇద్దరు వారి విరాళానికి సంబంధించిన చెక్స్ ని మాంత్రి కేటీఆర్ కి అందజేశారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ వారి మాటలతో కూడా అందరి మనసులను గెలుచుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి పాజిటివ్ గా స్పందించారు. తమవంతుగా సహాయం చేయాలని నేడు ఈ విధంగా మీ ముందుకొచ్చాం అంటూ.. ప్రజలందరూ ఇళ్ళల్లోనే ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని,స్టే హోమ్. స్టే సేఫ్" అని వివరణ ఇచ్చారు.