For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Drugs case విచారణకు డ్రైవర్ తో రవితేజ..తెలియదనడంతో అలా.. తలనొప్పితో రహస్య ప్రాంతాల నుంచి!

  |

  టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ తారలను ఎక్సైజ్ అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా విచారించారు. ఇక ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు సినీ హీరో రవితేజ ఆయన డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తులు హాజరయ్యారు. అయితే ఈ మొత్తం కేసు బయట పడటానికి కారణం రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కావడంతో ఈ రోజు జరుగుతున్న విచారణ మీద మీడియా అయితే చాలా ఆసక్తి కనబరుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన ధన్య బాలకృష్ణ: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సుధీర్ లవర్

   వీడియో ఫుటేజ్ ఆధారంగా

  వీడియో ఫుటేజ్ ఆధారంగా

  గత కొద్దిరోజులుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎక్సైజ్ శాఖ విచారించిన కొంత మంది సినీ ప్రముఖులతో పాటు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ లకు కూడా నవదీప్ పబ్ లో ఉన్న వీడియో ఫుటేజ్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కూడా అలా చేసి ఆ రోజు తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు అధికారులు.

  Shriya Saran ముంబై వీధుల్లో మొగుడితో శ్రీయాసరన్ ముద్దులాట.. నడిరోడ్డుపైనే రొమాంటిక్‌గా

  రహస్యప్రాంతాల నుంచి

  రహస్యప్రాంతాల నుంచి

  ఇక ఇప్పటికే ఈ కేసులో పూరి జగన్నాథ్ చార్మి రకుల్ ప్రీత్ సింగ్ రానా నందు లాంటి వాళ్లు పోలీసుల ముందు హాజరు కాగా ఈ రోజు సినీ హీరో రవితేజ ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా అధికారుల ముందు హాజరయ్యారు. నిజానికి సినీ హీరోలు ఇంటి ముందు తెల్లవారుజాము నుంచి మీడియా పడిగాపులు కాస్తున్నా వారి కంట పడకుండానే ఈడి ఆఫీస్ ముందు ప్రత్యక్షం అవుతున్నారు సినీతారలు.

  Shilpa Shetty గణపతి మహరాజును ఇంటికి ఆహ్వానించిన శిల్పాశెట్టి..

  కెల్విన్ తో కలిపి విచారణ

  కెల్విన్ తో కలిపి విచారణ

  దానికి కారణం మీడియా వాళ్లు ఈ ఉద్దేశంతో వాళ్లు రాత్రి తమ తమ గెస్ట్ హౌస్ లకి వెళ్లి అక్కడి నుంచి వస్తున్నారని అంటున్నారు.. అలా ఈడి ఆఫీస్ కి ఈ రోజు రవితేజ ఆయన డ్రైవర్ ఇద్దరూ కలిసి వెళ్లారు.. సుదీర్ఘంగా వారి విచారణ కూడా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కెల్విన్ అనే వ్యక్తి తమకు ఎవరో తెలియదని సినీ ప్రముఖులు చెబుతూ ఉండగా ఇది సరైన పద్ధతి కాదు అని భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్న సమయంలో వారి ఎదురుగా కూర్చోబెట్టి కెల్విన్ తో కలిపి విచారణ చేస్తున్నారు.

  డ్రగ్స్ సేవించినట్లు నివేదికలో వెల్లడి

  డ్రగ్స్ సేవించినట్లు నివేదికలో వెల్లడి

  ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అసలు ఈ డ్రగ్స్ కేసు మొత్తం వెలుగులోకి రావడానికి కారణం రవితేజ సోదరుడు మరణం. ఆ మరణం తర్వాత ఆయన డ్రగ్స్ సేవించినట్లు నివేదికలో వెల్లడి కావడంతో ఈ విషయం మీద పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంతోనే అసలు ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

  శ్రీనివాస్ ద్వారా ఈ లెక్కలన్నీ బయటకు

  శ్రీనివాస్ ద్వారా ఈ లెక్కలన్నీ బయటకు

  శ్రీనివాస్ ద్వారా కెల్విన్ వ్యవహారం బయటకు వచ్చింది, కెల్విన్ ద్వారా ఈ లెక్కలన్నీ బయటపడ్డాయి. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ అలాగే కెల్విన్ ఎఫ్ లాంజ్ పబ్బు మేనేజర్ ముగ్గురు మధ్య ఈ డ్రగ్ సంబంధించిన డీలింగ్ జరిగాయని ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ స్టేట్ మెంట్ లతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరు కావాలని చెప్పడంతో రవితేజ తన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లతో హాజరయ్యారు.

  #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
  ఏం బయటపడనున్నాయి

  ఏం బయటపడనున్నాయి

  రవితేజ డ్రైవర్ కూడా తన బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్ లు తీసుకుని విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక నిన్న రానా విచారణ కూడా సుదీర్ఘంగా ఏడున్నర గంటలపాటు సాగగా ఈ రోజు రవితేజ ఆయన డ్రైవర్ విచారణ మీద మాత్రం ఆసక్తి నెలకొంది. ఈ విచారణలో ఎలాంటి కీలక విషయాలు బయటకు వెల్లడి కానున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  English summary
  Actor Ravi Teja on Thursday appeared before the Enforcement Directorate (ED) along with driver as part of the ongoing money laundering probe in connection with a high-end drugs racket busted in 2017.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X